cabinet extention
-
బిహార్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 31 మంది ప్రమాణం
పాట్నా: ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. సీఎంగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. తాజాగా కేబినెట్ విస్తరణ చేపట్టారు సీఎం నితీశ్ కుమార్. 31 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన మంత్రుల చేత ప్రమాణం చేయించారు గవర్నర్ ఫాగు చౌహాన్. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఉన్నారు. బిహార్ కేబినెట్లో మొత్తం 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్లో తేజస్వియాదవ్ ఆర్జేడీకి 16, నితీశ్ కుమార్ జేడీయూకు 11 స్థానాలు కేటాయించారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్‌లు ఇచ్చారు. Tej Pratap Yadav, RJD leader and brother of Deputy CM Tejashwi Yadav, takes oath as a minister in the Bihar cabinet. #BiharCabinetExpansion pic.twitter.com/68zpjRUuPO — ANI (@ANI) August 16, 2022 ఇదీ చదవండి: బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??.. షిండేలాగే నితీశ్ కూడా.. -
కరోనా కాలంలో కేబినెట్ విస్తరణ
భోపాల్ : ఓ వైపు మధ్యప్రదేశ్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రాజకీయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం మంత్రివర్గాన్ని విస్తరించారు. రాష్ట్ర మంత్రులుగా ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ వీరితో ప్రమాణం చేయించారు. వీరిలో జ్యోతిరాదిత్యా సింధియా వర్గానికి చెందిన ముగ్గురు తిరుగుబాటు నేతలకు మంత్రివర్గంలో చోటుదక్కింది. కాగా 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కమల్ సర్కార్ కూలిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజులు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా ఐదుగురు మంత్రులకు అవకాశం కల్పించారు. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1450కి చేరింది. వైరస్ కారణంగా 78 మంది మృతి చెందారు. -
శాఖల కేటాయింపు.. ఎన్సీపీ జాక్‌పాట్
సాక్షి, ముంబై : మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూచన మేరకు ఆయన ప్రతిపాదించిన మంత్రుల శాఖల జాబితాను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆదివారం ఉదయం ఆమోదం తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ముందుగా ఊహించిన విధంగానే ఎన్సీపీ సీనియర్ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థిక, ప్రణాళిక శాఖలను అప్పగించారు. అలాగే ఉద్ధవ్ కుమారుడు, ఆదిత్య ఠాక్రేకు పర్యవరణం, టూరిజం శాఖ దక్కింది. ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు హోంశాఖ, నవాబ్ మాలిక్ మైనార్టీ శాఖ, జయంత్ పాటిల్‌కు జలవనరులు శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్‌కు పబ్లిక్ వర్స్ దక్కింది. అయితే ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ ఎన్సీపీకే దక్కినట్లు తెలుస్తోంది. మిగతా వివరాలు రావాల్సి ఉంది. (శరద్ పవార్.. ప్రభుత్వంలో కీ రోల్) కాగా డిసెంబర్ 30న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు: ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్: ఆర్థిక శాఖ, ప్రణాళికా శాఖ అనిల్ దేశ్‌ముఖ్: హోం శాఖ ఆదిత్య ఠాక్రే : పర్యావరణం, టూరిజం శాఖ బాలా సాహెబ్ తోరత్: రెవెన్యూ శాఖ అశోక్ చవాన్ : ప్రజాపనుల శాఖ (పబ్లిక్ వర్క్స్) ఏక్నాథ్ షిండే : పట్టణాభివృద్ధి శాఖ నవాబ్ మాలిక్ : మైనారిటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఛగన్ భుజ్‌భల్ : ఆహార, పౌర, వినియోగదారుల పరిరక్షణ శాఖ సుభాష్ దేశాయ్: పరిశ్రమలు, మైనింగ్, మరాఠీ భాషా మంత్రిత్వ శాఖ సంజయ్ రాథోడ్ : అటవీ శాఖ ఉదయ్ సామంత్ : ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ, దాదా భుసె : వ్యవసాయం, సందీప్ భుమ్రే : ఉపాధి హామీ, గులాబ్రావ్ పటేల్ : వాటర్ సప్లై, శంకర్రావు గడఖ్ : ఇరిగేషన్ శాఖ కాగా జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ మరియు టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్, న్యాయశాఖ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వద్ద ఉండగా, ఇక ఇతర మంత్రులకు శాఖలు కేటాయించాల్సి ఉంది. -
శివసేనకు భారీ షాక్.. మంత్రి రాజీనామా!
సాక్షి, ముంబై : ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది కాలంలోనే మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడి సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్న అబ్దుల్ సత్తార్ కేబినెట్ నుంచి వైదొలిగినట్లు వార్తులు వినిపిస్తున్నాయి. కేబినెట్ హోదా ఇవ్వకపోవడం, మంత్రిగా ప్రమాణం చేసి వారం గడుస్తున్నా ఇంకా శాఖలు కేటాయించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ రాజీనామాపై అబ్దుల్ సత్తార్ ఇప్పటి వరకు బహిరంగ ప్రకటన చేయలేదు. మరోవైపు అధికార శివసేన మాత్రం రాజీనామా వార్తలను తీవ్రంగా ఖండించింది. సత్తార్ ప్రభుత్వంలోనే కొనసాగుతారని ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా సిల్లోద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్తార్.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ సీటు ఆశించిన ఆయన.. తనకు సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి శివసేన కండువా కప్పుకున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. (జాక్‌పాట్ కొట్టిన శరద్ పవార్.. ప్రభుత్వంలో కీ రోల్) -
జాక్‌పాట్ కొట్టిన పవార్.. ప్రభుత్వంలో కీ రోల్
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రభుత్వంలోనూ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన మంత్రులకు కీలక శాఖలను అప్పగించేందుకు శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. డిసెంబర్ 30న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. కాగా శాఖల కేటాయింపు కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు పర్యావరణ, పర్యాటక శాఖ ఇస్తారని సమాచారం. సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ శాఖ కావాలని పట్టుబట్టినా శివసేన అంగీకరించలేదని తెలుస్తోంది.(సీనియర్లకు చోటేది.. భగ్గుమన్న అసంతృప్తులు!) కాగా మంత్రులుగా ప్రమాణం చేసినప్పటికీ వారికి ఇంకా శాఖలను కేటాయించని విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం శరద్ పవార్ భేటీ అయ్యారు. శాఖల అప్పగింతపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన హోంమంత్రిత్వశాఖను ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు అప్పగించే యోజనలో ఉద్ధవ్ ఉన్నారని తెలిసింది. అలాగే ఏక్నాథ్ షిండేకు పట్టణాభివృద్ధిశాఖ, శుభాష్ దేశాయ్‌కు పరిశ్రమలు, బాలాసాహెబ్ తోరట్‌కు రెవెన్యూ, కార్మిక, ఎక్సైజ్‌శాఖ దిలీప్ వాల్సే పాటిల్‌కు, ఆరోగ్య వర్షా గైక్వాడ్‌కు, సామాజిక న్యాయం ధనుంజయ్ మూండేకే దక్కే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు శరద్ పవార్, ఉద్ధశ్ ఠాక్రే మధ్య అంగీకారం కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారి తీసిన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనుక శదర్ ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి వారిని ఒప్పంచడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. చివరి నిమిషంలో ఎన్సీపీపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్‌ను సైతం వెనక్కిరప్పిచడంలో శరద్ రచించిన వ్యూహం విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటులో శరద్ పవాద్‌కే ముఖ్యపాత్ర అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం అభిప్రాయపడ్డారు. దీంతో కీలక శాఖలను ఎన్సీపీకి అప్పగించేదుకు సైతం ఠాక్రే వెనుకాడట్లేదని తెలుస్తోంది. మరోవైపు శాఖల కేటాయింపులో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కీలకశాఖలన్నీ శివసేన, ఎన్సీపీ దక్కేఅవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు ముందుగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్లో చోటు దక్కకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణతీ షిండే ఇప్పటికే ఆందోళలకు దిగిన విషయం తెలిసిందే. -
కేబినెట్లోకి అజిత్ పవార్, ఆదిత్య ఠాక్రే!
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు పూర్తయింది. ఈరోజు (సోమవారం) సాయంత్రంలోపు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివసేన అధినేత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్సీపీ ముఖ్యనేత అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కోరిన విషయం తెలిసిందే. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఠాక్రే.. అజిత్‌తో పాటు ఆదిత్యానూ కేబినెట్లోకి తీసుకుంటామని శరద్‌తో చెప్పినట్టు సమాచారం. అజిత్‌కు మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై మూడు పార్టీల ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. చివరికి శరద్ విజ్ఞప్తి మేరకు డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు ఠాక్రే అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఆయతో పాటు ఆదిత్య మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. కానీ వీరిద్దరి స్థానంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు డిప్యూటీ సీఎం పదవి కోసం ఎన్సీపీ సీనియర్ నేత జయంత్ పాటిల్ తీవ్రంగా పోటీపడుతున్నారు. పదవి ఎలాగైనా తనకే వచ్చేలా తన మద్దతు దారులతో మంతనాలు జరుపుతున్నారు. దీంతో అజిత్, పాటిల్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నా.. చివరికి పవార్‌నే వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (తండ్రి ప్రభుత్వంలో కుమారుడికి చోటెక్కడ?) మొత్తం 42 మందికి అవకాశం ఉండటంతో శివసేన నుంచి 13 మందిని, ఎన్సీపీ నుంచి 13 మందిని, కాంగ్రెస్‌కు చెందిన 10 మందిని మంత్రివర్గంలో చేర్చుకోనున్నారు. శివసేన, ఎన్సీపీలకు 10 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు ..కాంగ్రెస్ నుంచి 8 మంది కేబినెట్, ఇద్దరు సహాయ మంత్రులు కానున్నారు. కాగా సీఎంతో పాటు ఇదివరకే ఆరుగురు మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. -
ఠాక్రే టీంలోకి అజిత్ పవార్!
సాక్షి, ముంబై : శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈనెల 30న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ విస్తరణ చేస్తారని సమాచారం. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణపై చర్చ నిమిత్తం సోమవారం సీఎం ఠాక్రేతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవిపైనే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. శరద్ విజ్ఞప్తి మేరకు అజిత్‌కు డిప్యూటీ సీఎం కేటాయించేందుకు ఉద్ధవ్ అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఈనెల 30న ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కాగా, ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు కూడా గతంలోనే మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీపై తిరుగుబాటు, ఫడ్నవిస్‌తో చేతులు కలపడం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం, రాజీనామా.. అనంతరం తిరిగి సొంత గూటికి రావడం వంటి చర్యలతో వివాదానికి అజిత్ కేంద్ర బిందువుగా మారారు. దీంతో శివసేన నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. ఎన్సీపీని నుంచి ఇద్దరు నేతలు ఉద్ధవ్‌తో ప్రమాణం చేసినప్పటికీ వారికి శాఖలు కేటాయించలేదు. మరోవైపు అజిత్ ఎన్సీపీలోకి తిరిగిరావడంతో డిప్యూటీ సీఎం పదవికి ఆయనకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. శివసేనకు నగరాభివృద్ధి శాఖ, ఎన్సీపీకి హోం శాఖ, కాంగ్రెస్‌కు రెవెన్యూ శాఖ కట్టబెట్టే సూచనలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు!
సాక్షి, ముంబై: శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ఈ నెల 23న జరిగే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు మంత్రుల చొప్పున మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. నవంబర్ 28వ తేదీన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రేతోపాటు మూడు పార్టీలకు చెందిన ఏక్నాథ్ షిండే, సుభాస్ దేశాయ్, ఛగన్ భుజబల్, జయంత్ పాటిల్, బాలాసాహెబ్ థోరాత్, నితిన్ రావుత్ ఇలా ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత నాగ్‌పూర్‌లో సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన ఆ ఆరుగురు మంత్రులకు ఈ నెల 12వ తేదీన తాత్కాలికంగా పలు శాఖల బాధ్యతలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 23 లేదా 24వ తేదీన జరిగే మొదటి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి....? ఏ మంత్రి పదవి లభిస్తుంది...? అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సామాన్య ప్రజలు కూడా మంత్రివర్గ విస్తరణపై దృష్టిసారించారు. 18 మందికి చోటు.. శివసేన 10 మంది ఎమ్మెల్యేల పేర్లు, కాంగ్రెస్ 9 మంది, ఎన్సీపీ 8 ఇలా మొత్తం 27 మంది ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితా రూపొందించాయి. అందులో ఆరుగురు చొప్పున అంటే 18 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించనుంది. అదృష్టం ఎవరిని వరిస్తుందనేది విస్తరణ తరువాత తేటతెల్లం కానుంది. మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలున్న ఎమ్మెల్యేలలో శివసేన నుంచి 10 రాందాస్ కదం, అనీల్ పరబ్, సునీల్ ప్రభు, దీపక్ కేసర్కర్, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, గులాబ్రావ్ పాటిల్, ఆశీష్ జైస్వాల్, సంజయ్ రాఠోడ్, సుహాస్ కాందేలకు అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్‌లో అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, విజయ్ వడెట్టివార్, వర్షా గైక్వాడ్, యశోమతి ఠాకూర్, సునీల్ కేదార్, సతేజ్ పాటిల్, కే.సి.పాడ్వీ, విశ్వజీత్ కదం. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, దిలీప్ వల్సే పాటిల్, ధనంజయ్ ముండే, హసన్ ముశ్రీఫ్, నవాబ్ మలిక్, రాజేశ్ టోపే, అనీల్ దేశ్‌ముఖ్, జితేంద్ర అవ్హాడ్‌లకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. -
అమాత్యులు కాలేక ఆక్రోశం
సాక్షి, బెంగళూరు: అధికార బీజేపీలో కొత్తగా మంత్రి పదవుల సెగ అలముకొంటోంది. మంత్రివర్గంలో చోటు దక్కని వారు కొందరు బహిరంగంగా ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. మంత్రి పదవి వరించినవారు మంచి శాఖ కావాలని ప్రయత్నాలు సాగిస్తుండగా, అసలు పదవే లేనివారు కినుక వహించారు. అసంతృప్తిని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధిష్టానం సహాయం కోరారు. రెండో విడతలో మంత్రి పదవి ఇస్తే సరి, లేని పక్షంలో ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధహని పలువురు ఎమ్మెల్యేలు సంకేతాలిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా తన సోదరుడు రమేశ్ కత్తికి టికెట్ ఇవ్వలేదని, తాజాగా మంత్రివర్గంలో తనకు చోటు ఇవ్వలేదని సీనియర్ ఎమ్మెల్యే ఉమేశ్‌కత్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అథణి నుంచి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ సవదికి మంత్రి పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. క్రమశిక్షణ చర్యలు తప్పవు మంత్రి పదవులు రాలేదని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు, బెదిరింపులకూ దిగుతున్నారని పార్టీ నాయకత్వానికి సీఎం యడియూరప్ప ఫిర్యాదు చేశారు. దీంతో సీఎంతో బీజేపీ కార్యాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగకుండా చూసుకోవాలని, క్రమశిక్షణను పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి నుంచి తిరుగుబాటు చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం ఉంటుందని చెప్పారు. రెండు డజన్ల ఆశావహులు ఈ తరుణంలో రెండోవిడత విస్తరణ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు పెద్ద సవాల్‌గా మారింది. బీజేపీ నుంచి మొత్తం 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ప్రస్తుతం 20 మంది పైగా ఆశావహులు ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ –జేడీఎస్ నుంచి అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవిపై ఆశలు పెంచుకొన్నారు. బీజేపీ సీనియర్లు ఉమేశ్ కత్తి, యత్నాళ్, తిప్పారెడ్డి, గూళిహట్టి శేఖర్, కేజీæ బోపయ్య, అప్ప చ్చు రంజన్, పూర్ణిమ, మురుగేశ్ నిరాణి, శివన గౌడ నాయక్, అభయపాటిల్, దత్తాత్రేయ పాటి ల్, అంగార, బాలచంద్ర జార్కిహోళి, రేణుకాచా ర్య, హాలాడి శ్రీనివాసశెట్టి, విశ్వనాథ్ తదితరులు పదవులు దక్కక గుర్రుగా ఉన్నట్లు సమాచారం. -
యడియూరప్ప మంత్రివర్గం ఏర్పాటు
-
యడ్డీ కేబినెట్ ఇదే..
సాక్షి, బెంగళూరు: ప్రతిపక్షాల విమర్శలకు తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఎట్టకేలకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తన క్యాబినేట్లో మొత్తం 17 మందికి అవకాశం కల్పించారు. వీరంతా మంగళవారం గవర్నర్ వాజూభాయ్ వాలా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు కాలేదనే విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక కసరత్తుల తరువాత మంత్రివర్గం ఏర్పాటు చేస్తానని సోమవారం సీఎం యడియూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వీరే మంత్రులు.. సోమన్న రవి, బసవరాజు, నివాస్ పుజారి, మధుస్వామి, చిన్నప్పగౌడ, నగేష్, ప్రభు చవాన్, శశికళ, అన్నాసాహెబ్, గోవింద్, అశ్వస్థ నారాయణ్, ఈశ్వరప్ప, అశోక్, జగదీష్ షెట్టర్, శ్రీ రాములు, సురేష్ కుమార్, చంద్రకాంత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
సీఎల్పీ మాజీనేతకి మంత్రిపదవి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కాంగ్రెస్ మాజీ నేత విఖే రాథాకృష్ణ పాటిల్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. కాంగ్రెస్ శానససభా పక్ష నేతగా మొన్నటివరకూ వ్యవహరించిన విఖే పాటిల్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఫడ్నవిస్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పాటిల్‌తో పాటు ఆశిష్ షెలార్ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 13 మంది మంత్రులకు ఫడ్నవిస్ అవకాశం కల్పించగా.. వారిలో 10 మంది బీజేపీ ఇద్దరు శివసేన ఒకరు ఆర్పీఐ నుంచి ప్రాతినిథ్యం పొందారు. పదిమంది బీజేపీ మంత్రుల్లో ఆరుగురికి కేబినెట్ హోదా, నలుగురికి సహాయ మంత్రుల హోదా ఇచ్చారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో కొత్త మంత్రులందరి చేత గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫడ్నవిస్ తన కేబినెట్‌ను విస్తరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ముందు జరుగనున్న ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలే ఆసారికి చివరి సమావేశాలు కానున్నాయి. -
మహా మంత్రివర్గంపై కీలక భేటీ
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో మంత్రివర్గం విస్తరణ ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన నేతలు పదవుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో శనివారం భేటీ అయ్యారు. ఠాక్రే నివాసమైన మాతాశ్రీలో సమావేశమైన ఇరువురు నేతలు మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే కేంద్ర మంత్రి మండలిలో కేవలం ఒకే కేబినేట్ పదవి దక్కడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న శివసేన.. రాష్ట్రంలో తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కాగా మంత్రిమండలి తాజా విస్తరణలో భాగంగా శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై కూడా వారి మధ్య ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే శివసేనతో పాటు ఎన్డీయే మిత్రపక్షాలకు ఈసారి కేబినేట్లో బెర్తు దక్కే అవకాశం ఉంది. ఇటీవల ఫడ్నవిస్ మాట్లాడుతూ.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే మంత్రివర్గ విస్తరణలో మిత్రపక్షాలన్నింటికీ అవకాశం కల్పిస్తామని తెలిపారు. దీంతో పదవులు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ఫడ్నవిస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదిలావుండగా.. శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మంత్రివర్గంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తమకు సీఎం పదవి కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఇప్పటి వరకూ స్పందించలేదు. -
మంత్రివర్గ విస్త‘రణం’
చిన రాజప్ప వర్సెస్ జ్యోతుల గొల్లపల్లి వర్సెస్ పులపర్తి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : చంద్రబాబు మంత్రివర్గ విస్త‘రణం’గా మారేలా ఉంది. ముహూర్తం ముంచుకొస్తున్నకొద్దీ ఎవరి సీటు ఊడిపోతుందో, కొత్తగా ఎవరికి ఛా¯Œ్స వస్తుందనే దానిపై టీడీపీలో చర్చ సాగుతోంది. ఆదివారం మంత్రివర్గ విస్తరణతో బాబుకు ఎంతవరకు కలిసి వస్తుందో తెలియదు గానీ జిల్లా టీడీపీలో మాత్రం వర్గపోరు ఖాయమంటున్నారు. ఈ పరిణామాలు జిల్లా టీడీపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కించాయి. బాబు కేబినెట్లో ఇద్దరు మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంత్రిగా సీనియర్. సీఎం తరువాత కేబినెట్లో నంబర్–2గా చెప్పుకుంటున్నారు. పార్టీలో సీనియర్ అయినా మంత్రిగా మాత్రం చినరాజప్ప జూనియర్. యనమల బెర్త్ విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని పార్టీవర్గాలు అంచనా. హోంమంత్రి చినరాజప్ప శాఖల్లో మార్పు ఉంటుందా లేక, పార్టీ క్రియాశీలక పదవి అప్పగిస్తారా అనే దానిపై స్పష్టత లేక పార్టీ నేతలు తలలుపట్టుకుంటున్నారు. రెపరెపలాడుతున్న ‘జ్యోతి’ నెహ్రూ చిరకాల వాంఛైన మంత్రి పదవి కోసం నమ్మి టిక్కెట్టు ఇచ్చి గెలిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఓటేసి ఎమ్మెల్యేను చేసిన జనాన్ని నెహ్రూ నడిసంద్రంలో ముంచేసి ‘సైకిల్’ ఎక్కేశారు. మంత్రివర్గ విస్తరణ సమయం వచ్చేసరికి పదవిపై గ్యారెంటీ లభించక జ్యోతుల వర్గంలో నిస్సత్తువ ఆవహించింది. జిల్లాలో కాపు సామాజికవర్గం నుంచి ఒకరికి మించి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. ఈ లెక్కన జ్యోతుల బెర్త్ ఖాయం కావాలంటే చినరాజప్పకు ఉద్వాసన తప్పదు. రాజప్పను పక్కనబెట్టి రెండు పార్టీలు మారి తిరిగొచి్చన జ్యోతులకు ఇస్తే కేడర్‌కు ఏమని సమాధానం చెబుతామని రాజకీయంగా మొదటి నుంచి జ్యోతులతో పొసగని ఒక సీనియర్ మంత్రి బాబు వద్ద మోకాలడ్డుతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు అసమంజసమని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహ¯ŒS వ్యతిరేకిస్తున్నారనే సాకును చూపించి జ్యోతుల ఆశలపై నీళ్లుచల్లేలా ఉన్నారు. వీరిద్దరి పరిస్థితి ఇలా ఉండగా జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. కోనసీమ నుంచి ఆ ఛా¯Œ్స కోసం ఇద్దరు పోటీపడుతున్నారు. మాజీ మంత్రిగా రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆశిస్తున్నారు. తమ ఎమ్మెల్యేని కాదని ఇటీవలే టీడీపీలోకి వచ్చిన గొల్లపలి్లకి అవకాశం ఎలా ఇస్తారని పులపర్తి వర్గం ప్రశ్నిస్తోంది. చినరాజప్ప పరిస్థితీ... పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు రికార్డు స్థాయిలో చేపట్టిన చినరాజప్పకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రస్థాయిలో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ బాధ్యతలను చినరాజప్పకు అప్పగించడం అందులో భాగమేనని విశ్లేషిస్తున్నారు. కాపు ఉద్యమ రూపంలో బాబుకు ఎదురైన సవాళ్లను పోలీసులతో ఉక్కుపాదంతో అణచివేయడం, ఉద్యమ నేత ముద్రగడపై ఎడాపెడా విరుచుకుపడ్డ నేపథ్యంలో రాజప్పకు బాబు వద్ద మంచి మార్కులే పడ్డాయంటున్నారు. పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును కేబినెట్లోకి తీసుకుంటే అతని స్థానంలో చినరాజప్పే కనిపిస్తున్నారని పార్టీలో చర్చనడుస్తోంది.