పాట్నా: ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. సీఎంగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. తాజాగా కేబినెట్ విస్తరణ చేపట్టారు సీఎం నితీశ్ కుమార్. 31 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన మంత్రుల చేత ప్రమాణం చేయించారు గవర్నర్ ఫాగు చౌహాన్. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఉన్నారు.
బిహార్ కేబినెట్‌లో మొత్తం 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్‌లో తేజస్వియాదవ్ ఆర్జేడీకి 16, నితీశ్ కుమార్ జేడీయూకు 11 స్థానాలు కేటాయించారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్‌లు ఇచ్చారు.
Tej Pratap Yadav, RJD leader and brother of Deputy CM Tejashwi Yadav, takes oath as a minister in the Bihar cabinet. #BiharCabinetExpansion pic.twitter.com/68zpjRUuPO
— ANI (@ANI) August 16, 2022
ఇదీ చదవండి: బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??.. షిండేలాగే నితీశ్ కూడా..
Comments
Please login to add a commentAdd a comment