బీహార్‌లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్(యూ) చీఫ్, సీఎం నితీష్ కుమార్.. బీహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీపై తేజస్వీ యాదవ్ స్పందించారు. సీఎం నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.
నితీష్‌కుమార్‌కు విశ్వసనీయత లేదు. ఆయన చర్మిషా తగ్గింది. ఇప్పటికే మద్దతు కోరి రెండుసార్లు మా వద్దకు వచ్చారు. సపోర్ట్ చేయమని చేతులు జోడించి వేడుకున్నారు. మద్దతు ఇచ్చాం. కానీ ఈ సారి ఆ తప్పు చేయం’అని చెప్పారు. భవిష్యత్తులో నితీష్ కుమార్‌తో చేతులు కలిపే అవకాశం గురించి అడిగినప్పుడు పార్టీ మరోసారి ఆ తప్పు చేయదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : ట్రంప్ దేశాన్ని అమ్మేశారు
బీహార్‌లో నితీష్ కుమార్ విశ్వసనీయత, ప్రభావం ముగిసింది. శాంతిభద్రతలు అదుపు తప్పాయి. వాటిని నిర్మూలించే సామర్ధ్యం సీఎం నితీష్ కుమార్‌లో లేవని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి తరచూ పొత్తులు మారుతున్నారని యాదవ్ విమర్శించారు. నితీష్ ఆర్‌జేడీతో ఉన్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. బీజేపీలో ఉన్నప్పుడు ఆర్‌జీడీని విమర్శిస్తారు. ఇవేం రాజకీయాలు. ఫలితమే అతని విశ్వసనీయత నాశనం అయ్యిందని తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు.
తేజస్వీయాదవ్‌తో నితీష్ కుమార్ భేటీపై
తేజస్వీయాదవ్‌తో నితీష్ కుమార్ భేటీపై బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. కేవలం సమాచార కమిషనర్ నియామకానికి సంబంధించి వీరిద్దరూ భేటీ అయ్యారని స్పష్టం చేసింది. సమాచార కమిషనర్ నియామక కమిటీలో విపక్ష నేత కూడా సభ్యుడేనని గుర్తుచేసింది. అందులో ఎలాంటి రాజకీయాలు లేవని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment