- చిన రాజప్ప వర్సెస్ జ్యోతుల
- గొల్లపల్లి వర్సెస్ పులపర్తి
- జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు
మంత్రివర్గ విస్త‘రణం’
Published Sat, Apr 1 2017 12:27 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
చంద్రబాబు మంత్రివర్గ విస్త‘రణం’గా మారేలా ఉంది. ముహూర్తం ముంచుకొస్తున్నకొద్దీ ఎవరి సీటు ఊడిపోతుందో, కొత్తగా ఎవరికి ఛా¯Œ్స వస్తుందనే దానిపై టీడీపీలో చర్చ సాగుతోంది. ఆదివారం మంత్రివర్గ విస్తరణతో బాబుకు ఎంతవరకు కలిసి వస్తుందో తెలియదు గానీ జిల్లా టీడీపీలో మాత్రం వర్గపోరు ఖాయమంటున్నారు. ఈ పరిణామాలు జిల్లా టీడీపీలో
రాజకీయం ఒక్కసారిగా వేడెక్కించాయి. బాబు కేబినెట్‌లో ఇద్దరు మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంత్రిగా సీనియర్. సీఎం తరువాత కేబినెట్‌లో నంబర్–2గా చెప్పుకుంటున్నారు. పార్టీలో సీనియర్ అయినా మంత్రిగా మాత్రం చినరాజప్ప జూనియర్. యనమల బెర్త్ విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని పార్టీవర్గాలు అంచనా. హోంమంత్రి చినరాజప్ప శాఖల్లో మార్పు ఉంటుందా లేక, పార్టీ క్రియాశీలక పదవి అప్పగిస్తారా అనే దానిపై స్పష్టత లేక పార్టీ నేతలు తలలుపట్టుకుంటున్నారు.
రెపరెపలాడుతున్న ‘జ్యోతి’
నెహ్రూ చిరకాల వాంఛైన మంత్రి పదవి కోసం నమ్మి టిక్కెట్టు ఇచ్చి గెలిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఓటేసి ఎమ్మెల్యేను చేసిన జనాన్ని నెహ్రూ నడిసంద్రంలో ముంచేసి ‘సైకిల్’ ఎక్కేశారు. మంత్రివర్గ విస్తరణ సమయం వచ్చేసరికి పదవిపై గ్యారెంటీ లభించక జ్యోతుల వర్గంలో నిస్సత్తువ ఆవహించింది. జిల్లాలో కాపు సామాజికవర్గం నుంచి ఒకరికి మించి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. ఈ లెక్కన జ్యోతుల బెర్త్ ఖాయం కావాలంటే చినరాజప్పకు ఉద్వాసన తప్పదు. రాజప్పను పక్కనబెట్టి రెండు పార్టీలు మారి తిరిగొచి్చన జ్యోతులకు ఇస్తే కేడర్‌కు ఏమని సమాధానం చెబుతామని రాజకీయంగా మొదటి నుంచి జ్యోతులతో పొసగని ఒక సీనియర్ మంత్రి బాబు వద్ద మోకాలడ్డుతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు అసమంజసమని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహ¯ŒS వ్యతిరేకిస్తున్నారనే సాకును చూపించి జ్యోతుల ఆశలపై నీళ్లుచల్లేలా ఉన్నారు. వీరిద్దరి పరిస్థితి ఇలా ఉండగా జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. కోనసీమ నుంచి ఆ ఛా¯Œ్స కోసం ఇద్దరు పోటీపడుతున్నారు. మాజీ మంత్రిగా రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆశిస్తున్నారు. తమ ఎమ్మెల్యేని కాదని ఇటీవలే టీడీపీలోకి వచ్చిన గొల్లపలి్లకి అవకాశం ఎలా ఇస్తారని పులపర్తి వర్గం ప్రశ్నిస్తోంది.
చినరాజప్ప పరిస్థితీ...
పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు రికార్డు స్థాయిలో చేపట్టిన చినరాజప్పకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రస్థాయిలో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ బాధ్యతలను చినరాజప్పకు అప్పగించడం అందులో భాగమేనని విశ్లేషిస్తున్నారు. కాపు ఉద్యమ రూపంలో బాబుకు ఎదురైన సవాళ్లను పోలీసులతో ఉక్కుపాదంతో అణచివేయడం, ఉద్యమ నేత ముద్రగడపై ఎడాపెడా విరుచుకుపడ్డ నేపథ్యంలో రాజప్పకు బాబు వద్ద మంచి మార్కులే పడ్డాయంటున్నారు. పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును కేబినెట్‌లోకి తీసుకుంటే అతని స్థానంలో చినరాజప్పే కనిపిస్తున్నారని పార్టీలో చర్చనడుస్తోంది.
Advertisement
Advertisement