కరోనా కాలంలో కేబినెట్ విస్తరణ | Madhya Pradesh CM Cabinet Expansion With Five Members | Sakshi
Sakshi News home page

కరోనా కాలంలో కేబినెట్ విస్తరణ

Published Tue, Apr 21 2020 2:24 PM | Last Updated on Tue, Apr 21 2020 2:34 PM

Madhya Pradesh CM Cabinet Expansion With Five Members - Sakshi

భోపాల్‌ : ఓ వైపు మధ్యప్రదేశ్‌ కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నా.. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాత్రం రాజకీయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం  మంత్రివర్గాన్ని విస్తరించారు. రాష్ట్ర మంత్రులుగా ఐదుగురు  ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ వీరితో ప్రమాణం చేయించారు. వీరిలో జ్యోతిరాదిత్యా సింధియా వర్గానికి చెందిన ముగ్గురు తిరుగుబాటు నేతలకు మంత్రివర్గంలో చోటుదక్కింది. కాగా 21 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కమల్‌ సర్కార్‌ కూలిపోయిన విషయం తెలిసిందే.

అనంతరం ఆయన రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బాధ్యతలు స్వీకరించారు. కరోనా వైరస్‌ కారణంగా ఇన్ని రోజులు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా ఐదుగురు మం‍త్రులకు అవకాశం కల్పించారు. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 1450కి చేరింది. వైరస్‌ కారణంగా 78 మంది మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement