
భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్, కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల పెరుగుతున్న కమ్రంలో.. రాష్ట్రంలో కోవిడ్ థర్డ్‌వేవ్ వచ్చిందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారీగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగితే.. కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొక తప్పదని ఇప్పటికే నిపుణులు హెచ్చిరించిన విషయం తెలిసిందే. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొక తప్పదని సీఎం అన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో కరోనాపై పోరాడాగలమని శివరాజ్ సింగ్ చెప్పారు. ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతుందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భోపాల్, ఇండోర్ నగరాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 124 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరమైన ఇండోర్‌లో 62 కేసులు, భోపాల్‌లో 27 కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment