సాక్షి, బెంగళూరు: ఒక దేశం ఒక భాష అంటూ కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వ్యతిరేక స్వరాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.. అమిత్ షా హిందీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కేంద్ర నిర్ణయంతో ఏకీభవించేదిలేదని తేల్చిచెప్పారు. ‘దేశంలోని భాషలన్నీ సమానమే. దానిలో భాగంగానే కర్ణాటకకు కూడా కన్నడ చాలా ముఖ్యం. హిందీని అమలుచేయలన్న కేంద్ర నిర్ణయంతో ఏకీభవించేదిలేదు’ అంటూ యడియూరప్ప స్పష్టం చేశారు.
తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని మక్కళ్‌నిధీమయ్యం అధినేత కమల్‌హాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకే హెచ్చరించారు. కాగా హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ.. భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. షా వ్యాఖ్యలపై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.
All official languages in our country are equal. However, as far as Karnataka is concerned, #Kannada is the principal language. We will never compromise its importance and are committed to promote Kannada and our state's culture.
— CM of Karnataka (@CMofKarnataka) September 16, 2019
Comments
Please login to add a commentAdd a comment