
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి కుర్చీపై బీఎస్ యడియూరప్ప ఎన్ని రోజులు ఉంటారనే దానిపై రోజుకో రకమైన విశ్లేషణలు ఊపందుకున్నాయి. 75 ఏళ్లు నిండిన యడియూరప్ప పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముఖ్య పదవుల్లో కొనసాగరాదని బీజేపీలోని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎంత త్వరగా యడియూరప్పను సాగనంపితే తాము ఆ పీఠాన్ని అధిరోహించాలని బీజేపీలో అంతర్గత పోరాటం మొదలైనట్లు రాజకీయ వర్గాల కథనం. ఇందులో కొందరు మాజీ సీఎంలు, సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించాలని వారు అధిష్టానానికి వినతులు పంపుతున్నారు. ఇటీవల మాజీ సీఎం, ప్రస్తుత మంత్రి జగదీశ్ శెట్టర్ ఢిల్లీ పర్యటన ఉదాహరణగా చెప్పవచ్చు.
హస్తినలో సీఎం ఏం మాట్లాడతారు?
ఇలాంటి తరుణంలో 17వ తేదీన సీఎం యడియూరప్ప ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారని తెలిసింది. వరద సహాయం, కేబినెట్ విస్తరణపై చర్చిస్తారని బయటకు చెబుతున్నా, తన పదవీ భద్రత గురించి కూడా ఆయన అధిష్టానం నుంచి హామీ తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment