సాక్షి, బెంగళూరు : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో వరుసగా అపశృతులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు మరో అవమానం తోడైంది. ఆయన ప్రసంగిస్తున్న వేళ బీజేపీ నేత, మాజీ సీఎం యాడ్యురప్ప హాయిగా కునుకు తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తాజాగా మైసూర్ రోడ్‌లోని రాజేంద్ర కళామందిర్‌లో బీజేపీ నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో షా ఆవేశపూరితంగా ప్రసంగిస్తుంటే యెడ్డీ మాత్రం హాయిగా నిద్రపోయారు. అది గమనించిన షా.. పదే పదే యెడ్డీని చూస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయినప్పటికీ తోటి నేతలవెరూ యెడ్డీని కదిలించే ప్రయత్నం చేయలేదు.
ఇక ఈ వీడియో తమకు చిక్కటంతో కాంగ్రెస్ పార్టీ.. సోషల్ మీడియాలో వీడియోను ట్రోల్ చేస్తోంది. మరోవైపు జాతీయ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.
బీజేపీలోకి వలసలు
మరో పక్క ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా జేడీఎస్ ఎమ్మెల్యే మల్లికార్జున ఖుబా బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరో జేడీఎస్ నేత సందేశ్ స్వామి బీజేపీలోకి చేరిపోయారు. మూడుసార్లు కౌన్సిలర్‌గా పని చేసిన సందేశ్.. టికెట్ దక్కకపోవటంతో ఆ అసంతృప్తితో పార్టీ మారిపోయారు. ఇక మొన్నీమధ్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాలికయ్యా వెంకయ్య గుత్తేదార్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment