
దొడ్డబళ్లాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఏనాడూ గౌరవించని కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఆయన ఫొటో చూపించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ముఖ్య మంత్రి బీఎస్ యడ్యూరప్ప విమర్శించారు. పట్టణంలోని భగత్‌సింగ్ క్రీడా మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకపోగా ఎన్నికల్లో ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. తాను 50 మంది పౌర కార్మికులను ఇంటికి పిలిచి సన్మానించానన్నారు.
దేశానికి రైతు, చేనేత కార్మికుడు రెండు కళ్లలాంటివారన్నారు. సీఎం సిద్ధరామయయ్యకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా టుడే ఎన్నికల సర్వే ఫలితాలను పట్టించుకోనవసరం లేదని అన్నారు. మొళకాల్మూరు బీజేపీ అభ్యర్థి శ్రీరాములు మాట్లాడుతూ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయితే చేనేత కార్మికుల అన్ని రుణాలనూ మాఫీ చేస్తారన్నారు. ఇదే సందర్భం గా చలనచిత్ర నిర్మాత, జేడీఎస్ సీనియర్ నాయకుడు సారథి సత్యప్రకాశ్ వందలాదిమంది మద్దతుదారులతో కలిసి యడ్యూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ పుట్టస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment