కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(ఫైల్ ఫొటో)
యశవంతపుర/కర్ణాటక: పలు రాష్ట్రాలలో శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల కారణంగా హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. బెంగళూరులోని ప్రైవేటు హెలికాప్టర్లు ఆయా రాష్ట్రాల బడా నేతలు బాడుగకు తెప్పించుకున్నారు. సీఎం యడియూరప్ప రాష్ట్రంలో దూరప్రాంతాలకు హెలికాప్టర్‌లో వెళ్తుంటారు. కానీ గిరాకీ వల్ల హెలికాప్టర్ దొరక్కపోవడంతో కారులోనే వెళ్లారు. గత ఆదివారం 9:30 గంటలకు దావణగెరె జిల్లా హరిహరకు వెళ్లారు. అక్కడ వివిధ మఠాల కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరిగి మధ్యాహ్నం 1:30 గంటలకు బెంగళూరుకు రోడ్డుమార్గంలో సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. ఎండలో ఆరు వందల కిలోమీటర్లు కారులో తిరిగిన సీఎం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
ఎంపీ హెగ్డేకి బెదిరింపు కాల్
యశవంతపుర: ఎంపీ అనంతకుమార్ హెగ్డేకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌కాల్ చేసి బెదిరించాడు. ఘటనపై శిరసి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల ఐదోతేదీ రాత్రి రెండు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ‘గతంలో ఫోన్ చేసినప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశావు.ఈ సారి ఎలాగైనా ప్రాణం తీస్తా’ అంటూ ఆవ్యక్తి ఉర్దూ భాషలో మాట్లాడుతూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment