షిమోగా నుంచి లోక్ సభ బరిలో యాడ్యూరప్ప
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యాడ్యూరప్ప పోటీ చేసే లోక్ సభ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని షిమోగో లోక్ సభ నియోజక వర్గం నుంచి యాడ్యూరప్ప బరిలోకి దిగనున్నారని తాజా జాబితాలో వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ శనివారం లోక్ సభ బరిలో దిగే 52 మంది అభ్యర్థులతోపాటు యాడ్యూరప్ప స్థానాన్ని కూడా ఖరారు చేస్తూ రెండో జాబితాను విడుదల చేసింది.
యాడ్యూరప్ప స్థాపించిన కర్ణాటక జనాతా పార్టీ(కేజేపీ)ని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు యాడ్యూరప్ప సేవలను బీజేపీ వినియోగించుకోనుంది. నరేంద్ర మోడీని నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతోనే తాను తిరిగి సొంత గూటికి వెళుతున్నట్లు యాడ్యూరప్ప గతంలో స్పష్టం చేసి.. తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.