దళిత గడప తొక్కటం ఆపను: మాజీ సీఎం | Yeddyurappa hosts Lunch for Dalit families in his home | Sakshi
Sakshi News home page

దళిత కుటుంబాలకు మాజీ సీఎం లంచ్‌

Published Tue, Aug 29 2017 10:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

Yeddyurappa hosts Lunch for Dalit families in his home



సాక్షి, బెంగళూరు:
తనపై ఎన్ని విమర్శలు చేసినా దళితుల ఇళ్లకు వెళ్లటం ఆపనని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి  బీఎస్‌ యెడ్యూరప్ప ప్రకటించారు. ఈ యేడాది మే లో పాదయాత్ర సందర్భంగా ఆయన పలు దళిత ఇళ్లను సందర్శించి, అక్కడ భోజనం చేశారు. కృతజ్ఞతగా సోమవారం డాలర్స్‌ కాలనీలోని తన నివాసానికి ఆయా కుటుంబాలను ఆహ్వానించి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం 33 దళిత కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం యెడ్డీ మీడియాతో మాట్లాడారు. 
 
‘నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరిచ్చిన ఆతిథ్యాన్ని మరువలేను. అంత పేదరికంలో కూడా నా భోజనం కోసం మీరు పడ్డ కష్టం దగ్గరుండి మరీ చూశాను’ అని యెడ్డీ ఆ దళిత కుటుంబాలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన పర్యటనను రాజకీయం చేసేవారికి ఆయన చురకలంటించారు. ఎన్ని విమర్శలు చేసినా తాను మాత్రం దళిత వాడల్లో పర్యటించటం ఆపనని తెలిపారు.   
 
ఇక ఈ చేష్టలపై కాంగ్రెస్‌, జనతా దళ్‌(సెక్యులర్‌) పార్టీలు మండిపడుతున్నాయి. హోటల్‌ నుంచి భోజనం తెప్పించుకుని తిని దళితులను యెడ్డీ ఘోరంగా అవమానించారంటూ ఆ మధ్య విమర్శలు చేశాయి కూడా. అయితే తాను మాత్రం అవేం పట్టించుకోనని యెడ్యూరప్ప చెబుతూ వస్తున్నారు.
 
2018లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.  బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యెడ్యూరప్ప బరిలో నిల్చోబోతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సుమారు 23 శాతం ఓట్లు షెడ్యూల్‌ తెగలు, షెడ్యూల్‌ జాతి వాళ్లకు చెందినవే ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రేమ, వరాల జల్లులను కురిపించేస్తూ.. దళిత వాడలకు క్యూ కడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement