lunch program
-
రాహుల్ గాంధీ లంచ్.. ప్యారడైజ్ బిర్యానీ.. నీలోఫర్ చాయ్!
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ డిక్లరేషన్ గురించి విస్తృతంగా చర్చ జరిగేలా ప్రచారం చేయాలని సూచించారు.సుమారు రెండు గంటల పాటు గాంధీభవన్‌లో గడిపిన రాహుల్ గాంధీ చాలా ఉత్సాహంగా కనిపించారు. అందరినీ పలకరిస్తూ, ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం 1:53 గంటలకు రాహుల్ గాంధీభవన్‌కు వచ్చారు. తొలిసారి వచ్చిన ఆయనకు పూలదండలు వేసి, వేద పండితుల ఆశీర్వచనం మధ్య ఘనంగా స్వాగతించారు. చదవండి👉🏼 కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్? రాహుల్ తొలుత ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు, టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్, ఓయూ పరిశోధక విద్యార్థి చనగోని దయాకర్‌గౌడ్‌లతో మాట్లాడారు. తర్వాత తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ప్రతినిధులు బి.వేణుగోపాల్‌రెడ్డి, మధు తదితరులు తెలంగాణలో సమస్యలపై రాహుల్‌కు ఒక నివేదిక ఇచ్చారు. విస్తృతస్థాయి సమావేశం అనంతరం పార్టీ సభ్వత్య నమోదులో క్రియాశీలంగా పనిచేసిన వారితో రాహుల్ ఫోటోలు దిగారు. గాంధీభవన్‌లో 35 ఏళ్లుగా స్వీపర్ పనిచేస్తున్న యాదమ్మను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాహుల్‌కు పరిచయం చేశారు. రాహుల్ ఆమెతో సెల్ఫీ దిగారు. ప్యారడైజ్ బిర్యానీ.. నీలోఫర్ చాయ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ తనకు ఎంతో ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీని ఆస్వాదించారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆయన ప్రత్యేకంగా ప్యారడైజ్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీని కోక్ తాగుతూ తిన్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. తర్వాత పేస్ట్రీ (కేక్) తిన్న రాహుల్.. కొంతసేపటి తర్వాత నీలోఫర్ కేఫ్ నుంచి తెచ్చిన చాయ్‌ను రుచి చూశారు. అంతకుముందు జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్ హైదరాబాద్ బిర్యానీ, చాయ్ బాగుంటాయని ప్రస్తావించారు. దీంతో నేతలు వెంటనే ఈ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. చదవండి👉🏻 రాహుల్ సభ సక్సెస్.. కాంగ్రెస్‌లో సమరోత్సాహం -
‘కేసీఆర్ సారు నా పక్కనే కూసుండి తిన్నరు, సంతోషమైంది’
సాక్షి, యాదాద్రి భువనగిరి: దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పర్యటించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. వాసాలమర్రికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ గ్రామానికి మరో 20 సార్లు వస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామ రూపురేఖలు మారాలని, అభివృద్ధి పనులు జరగాలన్నారు. అందరం కలిసి ఏడాది కల్లా బంగారు వాసాలమర్రిని చేద్దామని ఆకాంక్షించారు. ఇక వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పక్కన కూర్చొని భోజనం చేసిన ఆకుల ఆగమ్మ అనే మహిళ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కేసీఆర్ సారు పెద్ద కొడుకులా తనను ఆదరించారని చెప్పుకొచ్చారు. సీఎం సారే స్వయంగా తనకు పండ్లు ఇచ్చారని, శాఖం వడ్డించారని తెలిపారు. (చదవండి: సీఎం కేసీఆర్ భోజనం: 23 రకాల వెరైటీలతో మెనూ! ) సీఎంతో తన సంభాషణ ఎలా సాగిందో ఆగమ్మ మాటల్లోనే.. ‘నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. సారు నా పక్కనే కూసుండి అన్నం తిన్నడు. ఆయన తినే కూర కూడా నాకు వడ్డించిండు. నేను కూడా నీ కొడుకునే అని చెప్పిండు. నాకు చానా సంతోషమైంది. పింఛన్ వస్తుందా అని సారు అడిగిండు. మా ఆయనకు వస్తున్నది అని చెప్పినా. కొడుకులు కోడళ్ల కన్నా కూడా మంచిగ.. సారు మా బాగోగులు తెలుసుకున్నరు’అని ఆగమ్మ ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: వాసాలమర్రికి నేనే అండగా ఉంటా: సీఎం కేసీఆర్) -
మంత్రులకు సీఎం విందు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో మంగళవారం విందు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశం అనంతరం మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, సిద్ధా రాఘవరావు, దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, భూమా అఖిలప్రియ, నారాయణ, నిమ్మకాయల చినరాజప్ప, నారాలోకేష్, కొత్తపల్లి జవహర్, నక్కా ఆనంద్ బాబు, కళా వెంట్రావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు విందులో పాల్గొననున్నారు. ఇక మంత్రులు ఎన్ఎండీ ఫరూఖ్, ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, పితాని సత్యనారాయణ, యనమల రామకృష్ణుడు విందు కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం. కాగా, ఏపీ అసెంబ్లీకి ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. సీఎం ఇచ్చే తాజా విందు చివరిది కానుంది. -
దళిత గడప తొక్కటం ఆపను: మాజీ సీఎం
సాక్షి, బెంగళూరు: తనపై ఎన్ని విమర్శలు చేసినా దళితుల ఇళ్లకు వెళ్లటం ఆపనని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప ప్రకటించారు. ఈ యేడాది మే లో పాదయాత్ర సందర్భంగా ఆయన పలు దళిత ఇళ్లను సందర్శించి, అక్కడ భోజనం చేశారు. కృతజ్ఞతగా సోమవారం డాలర్స్ కాలనీలోని తన నివాసానికి ఆయా కుటుంబాలను ఆహ్వానించి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం 33 దళిత కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం యెడ్డీ మీడియాతో మాట్లాడారు. ‘నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరిచ్చిన ఆతిథ్యాన్ని మరువలేను. అంత పేదరికంలో కూడా నా భోజనం కోసం మీరు పడ్డ కష్టం దగ్గరుండి మరీ చూశాను’ అని యెడ్డీ ఆ దళిత కుటుంబాలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన పర్యటనను రాజకీయం చేసేవారికి ఆయన చురకలంటించారు. ఎన్ని విమర్శలు చేసినా తాను మాత్రం దళిత వాడల్లో పర్యటించటం ఆపనని తెలిపారు. ఇక ఈ చేష్టలపై కాంగ్రెస్, జనతా దళ్(సెక్యులర్) పార్టీలు మండిపడుతున్నాయి. హోటల్ నుంచి భోజనం తెప్పించుకుని తిని దళితులను యెడ్డీ ఘోరంగా అవమానించారంటూ ఆ మధ్య విమర్శలు చేశాయి కూడా. అయితే తాను మాత్రం అవేం పట్టించుకోనని యెడ్యూరప్ప చెబుతూ వస్తున్నారు. 2018లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యెడ్యూరప్ప బరిలో నిల్చోబోతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సుమారు 23 శాతం ఓట్లు షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ జాతి వాళ్లకు చెందినవే ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రేమ, వరాల జల్లులను కురిపించేస్తూ.. దళిత వాడలకు క్యూ కడుతున్నాయి. -
‘మధ్యాహ్నం’ మంటలు
సాక్షి, నరసరావుపేట :పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా బడిమానివేసే పిల్లల సంఖ్యను తగ్గించి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది. మొదట్లో పథకం బాగానే నడిచినప్పటికీ రోజు రోజుకు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధర లు ఆకాశాన్నంటుతుండటంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం ఏజెన్సీ నిర్వాహకులకు కష్టంగా మారింది. ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి 100 గ్రాముల బియ్యంతో పాటు 4 రూపాయల 35 పైసలు, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆరు రూపాయల చొప్పున ప్రభుత్వం ఏజెన్సీ నిర్వాహకులకు చెల్లిస్తోంది. ప్రతి బుధవారం విద్యార్థులకు కోడిగుడ్డు అందించాలనే నిబంధన కూడా ఉండడంతో ప్రస్తుత మార్కెట్లో కోడిగుడ్డు ధర 4 నుంచి 5 రూపాయల వరకు పలుకుతుంది. దీంతో ప్రభుత్వం తమకు చెల్లించే డబ్బు కోడిగుడ్డు కొనుగోలుకే సరి పోతుందని, ఇక మిగతా వంట ఎలా చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. బిల్లు లు కూడా ప్రతి నెలా రావడంలేదని, రెండు, మూడు నెలలకొకసారి వస్తుండటంతో మధ్యాహ్న భోజనం వండేందుకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు సరిపోక విద్యార్థులకు సరైన పోషక ఆహారం అందించలేకపోతున్నామని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. గుదిబండగా మారిన గ్యాస్ సరఫరా.. అసలే సమస్యల కుంపటిలో కొట్టుమిట్టాడుతున్న తమకు ఇటీవల ప్రభుత్వం గ్యాస్ విషయంలో తీసుకున్న నిర్ణయం గుదిబండగా మారిందని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ఏడాదికి 9 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ ధరల్లో ఇస్తామని, ఆపైన కావాలంటే రూ. 1350 చెల్లించాల్సిందేనంటూ ప్రభుత్వం నిబంధన విధించడం దారుణమని వాపోతున్నారు. రోజుకు 120 నుంచి 200 మంది విద్యార్థులకు వంట చేయాల్సిన తమకు వారానికి ఒక సిలిండర్ చొప్పున నెలకు 4, ఏడాదికి 40 సిలిండర్లకుపైగా అవసరం అవుతాయని, ప్రభుత్వ నిబంధనతో ఇక ఏజెన్సీలను మానుకోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు. వంటశాలలు లేక ఆరుబయటే వంట అధికశాతం ప్రభుత్వ పాఠశాలల్లో వంటశాలలు లేకపోవడంతో ఆరుబయటే వంట చేయాల్సిన దుస్థితి నెలకొందని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి తమకు అందించే గ్యాస్, బిల్లులను పెంచాలని కోరుతున్నారు. అయితే వంటశాలల నిర్మాణానికి ఒక్కొక్క పాఠశాలకు రూ. 75వేలు మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తుండటంతో ఆ మొత్తంతో నిర్మాణం చేపట్టలేక కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్లు పెంచాలి ఏడాదికి తొమ్మిది సిలిండర్లు మాత్రమే ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తుంది. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు రెట్టింపు ఇవ్వాలి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. మాకందించే బిల్లులను కూడా పెంచాలి. - వెంకటరమణ, శ్రీనివాసగిరిజనకాలనీ బిల్లులు పెంచి ఆదుకోండి విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ప్రభుత్వం అందిస్తున్న బిల్లులు సరిపోవడంలేదు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో కట్టెపుల్లలు కొనలేకపోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా మొర ఆలకించాలి. - శిరసగండ్ల లక్ష్మీ, మాచవరం