Dalit Families
-
గ్రామాభివృద్ధి కమిటీ అరాచకం.. 70 దళిత కుటుంబాల బహిష్కరణ
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో గురువారం అమానుష సంఘటన చోటుచేసుకుంది. డిచ్పల్లి మండలం దూస్గామ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆరాచకాలు మితిమీరాయి. గ్రామంలోని 70 దళిత కుటుంబాలను వీడీసీ బహిష్కరించింది. డప్పులు కొట్టేందుకు కూలి పెంచమని అడిగిన కారణంగా 70 కుటుంబాలను వీడీసీ సభ్యులు బహిష్కరణ చేశారు. గ్రామంలో దళిత కుటుంబాలకు విధి లైట్లు , మంచి నీటి సరఫరా నిలిపివేశారు. అయితే వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కలెక్టరేట్కు తరలివచ్చిన బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని కోరుతున్నాయి. చదవండి: ఫ్లూ మాదిరిగా ఇకపై ఏటా కరోనా ప్రభావం -
‘దళితులకు నాయ్యం చేసేందుకే ఢిల్లీ నుంచి వచ్చా’
సాక్షి, నెల్లూరు : దళితులకు నాయ్యం చేసేందుకే తాను ఢిల్లీ నుంచి వచ్చానని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కే రాములు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు దళితవాడలో ఆయన బహిరంగ విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాల ఇళ్ళకు వెళ్లి పరామర్శించారు. వారు ఆయన వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధిత కుటుంబాలు ఆయన ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితవాడలో సుమారు 300 కుటుంబాలుంటే 100 మంది కూడా హాజరు కాలేదంటే పోలీసులు ఎంతగా భయబ్రాంతులకు గురి చేశారో అర్థమవుతోందని అన్నారు. సమావేశానికి కలెక్టర్, ఎస్పీలు రాకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై రాష్ట్రపతికి నివేదికను అందజేస్తామని తెలిపారు. -
దళిత గడప తొక్కటం ఆపను: మాజీ సీఎం
సాక్షి, బెంగళూరు: తనపై ఎన్ని విమర్శలు చేసినా దళితుల ఇళ్లకు వెళ్లటం ఆపనని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప ప్రకటించారు. ఈ యేడాది మే లో పాదయాత్ర సందర్భంగా ఆయన పలు దళిత ఇళ్లను సందర్శించి, అక్కడ భోజనం చేశారు. కృతజ్ఞతగా సోమవారం డాలర్స్ కాలనీలోని తన నివాసానికి ఆయా కుటుంబాలను ఆహ్వానించి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం 33 దళిత కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం యెడ్డీ మీడియాతో మాట్లాడారు. ‘నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరిచ్చిన ఆతిథ్యాన్ని మరువలేను. అంత పేదరికంలో కూడా నా భోజనం కోసం మీరు పడ్డ కష్టం దగ్గరుండి మరీ చూశాను’ అని యెడ్డీ ఆ దళిత కుటుంబాలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన పర్యటనను రాజకీయం చేసేవారికి ఆయన చురకలంటించారు. ఎన్ని విమర్శలు చేసినా తాను మాత్రం దళిత వాడల్లో పర్యటించటం ఆపనని తెలిపారు. ఇక ఈ చేష్టలపై కాంగ్రెస్, జనతా దళ్(సెక్యులర్) పార్టీలు మండిపడుతున్నాయి. హోటల్ నుంచి భోజనం తెప్పించుకుని తిని దళితులను యెడ్డీ ఘోరంగా అవమానించారంటూ ఆ మధ్య విమర్శలు చేశాయి కూడా. అయితే తాను మాత్రం అవేం పట్టించుకోనని యెడ్యూరప్ప చెబుతూ వస్తున్నారు. 2018లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యెడ్యూరప్ప బరిలో నిల్చోబోతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సుమారు 23 శాతం ఓట్లు షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ జాతి వాళ్లకు చెందినవే ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రేమ, వరాల జల్లులను కురిపించేస్తూ.. దళిత వాడలకు క్యూ కడుతున్నాయి. -
మేం ఇస్లాంలోకి మారే పరిస్థితి రావొచ్చు!
కరూర్ (తమిళనాడు): వివక్షపై దళితులు పోరుబాట పట్టారు. దేవాలయ ఉత్సవంలో పాల్గొనేందుకు తమను అనుమతించకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు వాపస్ ఇచ్చేస్తామని హెచ్చరించాయి. ఆలయంలోకి ప్రవేశించకుండా తమపై వివక్ష కొనసాగిస్తే.. అందుకు నిరసనగా తాము ఇస్లాం మతంలోకి మారుతామని వారు హెచ్చరించారు. తమిళనాడులోని కరూర్లో గురువారం ఈ ఘటన జరిగింది. దళిత కుటుంబానికి చెందిన గీత మాట్లాడుతూ తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, తమపై ఇలాగే వివక్ష కొనసాగిస్తే.. తాము బలవంతంగా ఇస్లాం మతంలోకి మారే పరిస్థితి రావొచ్చునని చెప్పారు. -
దళితులకు భూములు దక్కేనా..!
- భూ పంపిణీతో దళితుల్లో చిగురిస్తోన్న ఆశలు - ప్రభుత్వ భూముల వివరాలు నమోదు పూర్తి - మూడెకరాల భూమి ఇస్తే వందలాది కుటుంబాలకు లబ్ధి యాచారం: ప్రభుత్వం చేపట్టబోయే భూ పంపిణీ కార్యక్రమంతో వందలాది మంది దళిత కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది. తాము ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని ఆశలు చిగురిస్తున్నాయి. మండలంలోని 20 గ్రామాల్లో 24,168 ఎకరాల 2 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 8,441 ఎకరాల 19 గుంటల భూమిని 1976 నుంచి ఇప్పటివరకు అసైన్మెంట్ కింద పేదలకు పట్టాలు ఇచ్చారు. వారం కింద అధికారులు తేల్చిన లెక్కల ప్రకారం ఇంకా మండలంలో సాగుకు యోగ్యంగా లేని భూమి 5,406 ఎకరాల 19 గుంటలు ఉండగా, కేవలం 376 ఎకరాల 2 గుంటల భూమి మాత్రమే వ్యవసాయానికి యోగ్యంగా ఉంది. పలు గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా గుట్టలు, రాళ్లు, రాప్పలతో కూడి ఉండడంతో యోగ్యంగా మార్చుకోవాలంటే పెద్దమొత్తంలో ఖర్చవుతుంది. పలు గ్రామాల్లో వందలాది ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించారు. స్థానిక రెవెన్యూ అధికారుల అండదండలతో దొంగ పట్టదారు పాసుపుస్తకాలను పొందిన ఆక్రమణదారులు బ్యాంకుల్లో కుదువ పెట్టి వివిధ రకాల రుణాలు పొందారు. మండలంలోని నల్లవెల్లి, మంతన్గౌరెల్లి, కొత్తపల్లి, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి పాసు పుస్తకాలను సృష్టించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా, ఉన్నతాధికారులకు విన్నవించినా ఆ ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుంచి కాపాడలేకపోయారు.