
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కే రాములు
సాక్షి, నెల్లూరు : దళితులకు నాయ్యం చేసేందుకే తాను ఢిల్లీ నుంచి వచ్చానని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కే రాములు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు దళితవాడలో ఆయన బహిరంగ విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాల ఇళ్ళకు వెళ్లి పరామర్శించారు. వారు ఆయన వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధిత కుటుంబాలు ఆయన ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితవాడలో సుమారు 300 కుటుంబాలుంటే 100 మంది కూడా హాజరు కాలేదంటే పోలీసులు ఎంతగా భయబ్రాంతులకు గురి చేశారో అర్థమవుతోందని అన్నారు. సమావేశానికి కలెక్టర్, ఎస్‌పీలు రాకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై రాష్ట్రపతికి నివేదికను అందజేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment