rapuru
-
మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి..
ప్రకృతినే నమ్ముకున్న గిరిజనులు వాటినే ఆధారం చేసుకుని మంచి ఆహార ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి సమీపిస్తే అడవిలో మారేడును సేకరించి నన్నారి షర్బత్ తయారీకి పూనుకుంటారు. అనుకున్నదే తడవుగా ఒక సంఘంగా ఏర్పడి విరివిగా షర్బత్‌ను తయారుచేసి విక్రయిస్తున్నారు. వేసవి నేపథ్యంలో రసాయనాలు లేకుండా తయారు చేస్తున్న సన్నారి షర్బత్‌కు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేస్తున్న గిరిజనులు ఆర్థిక పరిపుష్టికి అడుగులు వేస్తున్నారు. సాక్షి, నెల్లూరు : జిల్లాలోని రాపూరు మండలంలో నన్నారి షర్బత్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన గిరిజనులు దీనినే ఉపాధిగా మార్చుకున్నారు. స్థానిక వెలుగొండల్లో దొరికే అటవీ ఫలసాయాన్ని సేకరించి నన్నారీని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసి ఆదాయం గడిస్తున్నారు. ప్రకృతి వనరులతో తయారు చేసే నన్నారి షర్బత్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ద్వారా శరీర ఉష్ణోగ్రత్త తగ్గుతుంది. సంఘటితంగా ఏర్పడి వెలుగొండలను ఆనుకుని ఉన్న రాపూరు మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా ఉన్న అటవీనే నమ్ముకుని జీవించే గిరిజన మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దకాలంలోనే గిరిజనులు సంఘటితంగా ఏర్పడి గ్రామస్థాయి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆపై శ్రీ లక్ష్మీ నరసింహ యానాది మండల సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. ఆపై వారి జీవన విధానం మెరుగు పరుచుకునేందుకు ప్రధాన మంత్రి వన్‌ధన్ యోజన కార్యక్రమం ఏర్పాటుచేసి తద్వారా మెరుగైన జీవనోపాధులు కల్పించుకోవడం జరిగింది. వెలుగొండల్లో ముడిసరుకు సేకరించి.. వెలుగొండల్లో విరివిగా కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. 275 మంది గిరిజన సభ్యులు వన్‌ధన్ వికాస కేంద్రం(వీడీవీకే) ఏర్పాటు చేసుకుని అటవీ ఫలసాయం సేకరణ చేస్తున్నారు. వీరికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐటీడీఏ శాఖల ఆధ్వర్యంలో గిరిజనులకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కావలసిన శిక్షణ కార్యక్రమాలు, తయారీ, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు. ఉసిరితో.. అలాగే జనవరి నుంచి మార్చి నెల వరకు వెలుగొండ అడవుల్లో ఉసిరి కాయల సేకరణ జరుగుతుంది. ఈ సీజన్లో దాదాపు 20 టన్నుల ఉసిరి కాయలను సేకరిస్తుంటారు. దాదాపు 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సేకరించిన ఉసిరికాయలను కేజీ రూ.30ల చొప్పున దళారులు గిరిజనుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంటారు. విలువ ఆధారిత ఉత్పత్తిలో భాగంగా ఉసిరి కాయలతో ఉసిరి క్యాండీలు చేయడం వలన, మూడు కేజీల ఉసిరికాయలతో ఒక కేజీ క్యాండీలను తయారీ చేస్తారు. వీటి విలువ మార్కెట్లో రూ.500గా ఉంది. ఈ ఉసిరి క్యాండీల తయారీలో దాదాపు 30 మంది గిరిజనులు శిక్షణ పొందారు. చక్కెర పాకంలో ఉడకబెట్టిన ఉసిరి కాయలను నానబెట్టడం ద్వారా ఈ క్యాండీలను తయారు చేస్తారు. తయారీ ఖర్చు పోగా, మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే నిమ్మకాయ ఊరగాయల తయారీ, స్వచ్ఛమైన తేనె సేకరణ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం గిరిజనులు తయారు చేసిన అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఉత్పత్తులను పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో మార్కెటింగ్ చేసేలా స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సాయం చేశారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్లో కూడా పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఎటువంటి కల్తీ లేని అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఫలసాయంతో మండలంలోని దాదాపు 1,590 పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. విలువపెంచి విక్రయాలు అడవుల్లో సేకరించే కలపేతర అటవీ ఉత్పత్తులకు ముడిసరుకులు విక్రయిస్తే అంతగా ఆదాయం వచ్చేది కాదు. ముడిసరుకులను బయటకు వెళ్లి వస్తువుల విలువలను పెంచి అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ఒక కేజీ కుంకుళ్లు అమ్మితే రూ.20 వస్తుంది. అదే విత్తనాలను వేరు చేసి అమ్మితే కేజీ రూ.140 వస్తుంది. ఉసిరి కేజీ అమ్మితే రూ.30 వస్తుంది అదే ఆమ్ల క్యాండీలుగా చేసి అమ్మితే కేజీ రూ.500 వరకు వస్తుంది. మారేడు కూడా కేజీ రూ.350 వస్తుంది అదే నన్నారి షర్బత్ చేసి అమ్మితే రూ.2500 వస్తుంది. ఇలా లాభదాయకంగా ఉంది. – వెలుగు సుబ్బయ్య, వన్‌ధన్ వికాస కేంద్రం అధ్యక్షుడు అందరం సంపాదిస్తున్నాం వన్‌ధన్ వికాస కేంద్రం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పని దొరుకుతోంది. ఇంట్లోని వారంతా సంపాదిస్తుండడంతో ఆనందంగా జీవిస్తున్నాం. డీఆర్డీఏ, ఐటీడీఏ, జీసీసీ వారు మాకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేశారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. – గాలి శ్రీనివాసులు, వన్‌ధన్ వికాస కేంద్రం కార్యదర్శి నన్నారి తయారీ ఇలా.. శ్రీ లక్ష్మీనరసింహ యానాది మండల సమాఖ్యలోని సభ్యుల్లో దాదాపుగా 30 మంది నన్నారి షర్బత్ తయారీలో నిష్ణాతులుగా ఉన్నారు. అలాగే 150 మంది నన్నారి షర్బత్‌కు కావల్సిన మారేడు గడ్డలను సేకరించి ప్రాసెసింగ్ చేస్తుంటారు. గాలి వెంకటేశ్వర్లు, గాలి శ్రీనివాసులు, వెలుగు సుబ్బయ్య, యాకసిరి జయరామయ్య, నారాయణ, నల్లు శివ మొదలగు వారు ఈ నన్నారి షర్బత్‌ను తయారు చేస్తుంటారు. జనవరి నుంచి జూన్ నెల వరకు నన్నారి షర్బత్ తయారీ మీద గిరిజనులు దృష్టి పెడుతుంటారు. దీనికి కావల్సిన మారేడు గడ్డలను వెలిగొండ అడవుల్లో జనవరి నుంచి మే నెల వరకు సేకరిస్తారు. ఈ సీజన్లో దాదాపుగా 10 నుంచి 15 టన్నుల వరకు మారేడు గడ్డలను సేకరిస్తారు. సాధారణంగా ఒక కేజీ గడ్డల విలువ రూ.400 ఉండగా ఒక కేజీ నుంచి 30 లీటర్ల నన్నారి షర్బత్‌ను తయారు చేయవచ్చు. మార్కెట్లో ఒక లీటర్ రూ.160 ఉండగా కేజీ మారేడుతో దాదాపుగా రూ.4,800 ఆదాయం వస్తుంది. ఇలా 15 టన్నులకు రూ.72 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అందులో తయారీకి కావల్సిన ఇతర దినుసుల ఖర్చు, తయారీ ఖర్చు, లేబర్ వంటి వాటిని తీసేయగా మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ ఆర్థికంగా పురోగమిస్తున్నారు. -
రాపూరు ఎస్సైను అరెస్ట్ చేయాలి: దళితులు ఆందోళన
-
‘దళితులకు నాయ్యం చేసేందుకే ఢిల్లీ నుంచి వచ్చా’
సాక్షి, నెల్లూరు : దళితులకు నాయ్యం చేసేందుకే తాను ఢిల్లీ నుంచి వచ్చానని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కే రాములు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు దళితవాడలో ఆయన బహిరంగ విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాల ఇళ్ళకు వెళ్లి పరామర్శించారు. వారు ఆయన వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధిత కుటుంబాలు ఆయన ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితవాడలో సుమారు 300 కుటుంబాలుంటే 100 మంది కూడా హాజరు కాలేదంటే పోలీసులు ఎంతగా భయబ్రాంతులకు గురి చేశారో అర్థమవుతోందని అన్నారు. సమావేశానికి కలెక్టర్, ఎస్పీలు రాకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై రాష్ట్రపతికి నివేదికను అందజేస్తామని తెలిపారు. -
రాపూర్ పోలీస్‌స్టేషన్ దాడి కేసులో పురోగతి
-
నెల్లూరు జిల్లా రాపూర్‌లో పోలీసులపై దాడి
-
రాపూరులో గుడిసెల తొలగింపు - ఉద్రిక్తత
రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలో రైల్వే లైను నిర్మాణానికి సేకరించిన స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను మంగళవారం ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు తొలగించారు. దాంతో బాధితులు రహదారిపై రాస్తారోకో చేస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 30 ఇళ్లను తొలగించారు. సంబంధిత స్థలాన్ని రైల్వే లైను నిర్మాణానికి సేకరించామని తెలిసినా కొందరు గుడుసెలు వేసుకున్నారని అధికారులు తెలిపారు. -
సినీ ఫక్కీలో చోరీ
రాపూరు: ‘దొంగలు తిరుగుతున్నారు.. బంగారం దోచుకుంటారు.. ఇన్ని నగలు మెడలో ఉంచుకోకు.. చీర కొం గులో కట్టుకో..’ అని మాయమాటల తో నమ్మించి సుమారు ఐదు సవర్ల విలువైన బంగారు సరుడును ముగ్గురు మహిళలు చాకచక్యంగా దోచుకున్నారు. ఈ ఘటన రాపూరులో బుధవారం మిట్టమధ్యాహ్నం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. వెంకటగిరి తూర్పువీధికి చెందిన గడ్డం రత్నమ్మ (60) రాపూరు కొత్తపేటలో జరిగే బంధువుల ఉత్తరక్రియలకు వచ్చింది. ఆమె బస్సు దిగి వస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని మహిళలు ఆమె తో మాటలు కలిపారు. తాము ఊరికి కొత్తని, మంచి టవల్ కొనుగోలు చేసి ఇవ్వాలని నమ్మబలకడంతో రత్నమ్మ రాపూరు పాత బస్టాండులోని వస్త్ర దుకాణానికి తీసికెళ్లి రూ.30 విలువైన టవల్ కొనుగోలు చేసి ఆ మహిళలకు ఇచ్చింది. షాపు నుంచి బయటకు వస్తుండగా ఇక్కడ ఒక పర్సు పడి ఉందని తనతోపాటు వచ్చిన ఒక మహిళ దానిని తీసుకొని ఇందులో రూ.5,500 ఉన్నాయని, వీటిని ముగ్గురం సమానంగా పంచుకుందామని చెప్పి జనసంచారం లేని స్థానిక చర్చి రోడ్డు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో రాపూరులో దొంగలు ఉన్నారు ఇంత బంగా రు మెడలో వేసుకొని తిరిగితే వారు దోచుకుంటారని ఇద్దరు మహిళలు రత్నమ్మకు చెప్పారు. రత్నమ్మ తన మెడలోని సరుడును తీసి పర్సులో దాచుకుంటుండగా పర్సులో ఎందుకు చీర కొంగులో కట్టుకొని ఇంటికి వెళ్లి వేసుకోమని వారే సరుడును తీసి చీర కొంగులో కట్టి అది ఊడకుండా వైరుతో గట్టిగా చుట్టారు. పవిట చెంగులో గులకరాళ్లు.. ఇంతలో ఒక మహిళ వచ్చి తన పర్సు వస్త్ర దుకాణం వద్ద పడిపోయిందని, అది మీకు దొరికిందని అక్కడి వారు చెప్పారని, ఇస్తారా.. పోలీసులకు చెప్పమంటారా అని గద్దిస్తూ మహిళల వద్ద ఉన్న పర్సును లాక్కుని వాదనకు ది గింది. తనతో ఉన్న మహిళలు ఆమెతో గొడవ పడుతూ తనను వెళ్లమని అ త్యంత చాకచక్యంగా జారుకున్నారని, తను అక్కడి నుంచి కొంత దూరం వెళ్లి తన చెంగుకు ఉన్న ముడిని తీసిచూడగా అందులో గులకరాళ్లు ఉన్నాయ ని, తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశానని ఏడుస్తూ చెప్పింది. సరుడు నాలుగు సవర్లు ఉంటుందని సరుడులో రెండు కాసు లు, నాలుగు గుండ్లు, మంగళసూత్రం ఉన్నాయని, ఇవి సుమారు ఐదు సవర్ల వరకు ఉంటుందని తెలిపింది. తన వద్దకు వచ్చిన మహిళలు ముగ్గురు ఒకే ముఠాకు చెంది ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ కర్రిముల్లా,తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, నిందితులు దొరకలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. గత సెప్టెం బర్ నాలుగున రాపూరు మండలం వెలుగోనుకు చెందిన యశోదరమ్మ కూడా ఇలాగే మూడు సవర్ల బంగారు సరుడును పోగొట్టుకొని మోస పోయింది. -
శేషాద్రుడి అక్రమాలు ఎన్నో..
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: రాపూరులో హెచ్ఎంగా పనిచేస్తూ సస్పెండ్ అయిన శేషాద్రివాసు పనితీరు పరిశీలిస్తే అన్నీ అక్రమాలే కనిపిస్తున్నాయి. అయినా ఆయన్ను విద్యాశాఖ అధికారులు అందలమెక్కించారు. తనను ప్రశ్నించే వారి విషయంలో చిన్నచిన్న సాకులు చూపి సస్పెండ్ చేశారు. యూటీఎఫ్ నేత పరంధామయ్య సస్పెండ్‌ను వెంటనే రద్దు చేయాలని అపాయింటింగ్ అథారిటీ ఉన్న డీఈఓకు కలెక్టర్ గత నెల 28న ఆర్డర్ వేశారు. అయినప్పటికీ విద్యాశాఖ పట్టించుకోలేదు. శేషాద్రివాసు గురించి మరిన్ని వివరాలు సమాచార హక్కు చట్టం కింద ‘న్యూస్‌లైన్’ మరిన్ని వివరాలు సేకరించింది. కనుపర్తిపాడులో లెక్కలు మాస్టార్‌గా పనిచేస్తున్నప్పుడు ఈ హెచ్ఎం దీర్ఘకాలిక సెలవు పెట్టాడు. రిలీవ్ అయ్యేటప్పుడు, తిరిగి జాయిన్ అయ్యేటప్పుడు అక్కడి హెచ్ఎం ప్రొసీడింగ్స్ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఎస్‌ఆర్‌లో (సర్వీసు రిజిస్టర్లో) నమోదు చేయాలి. కాని అలా జరగలేదు. సెలవులను దేని కింద ట్రీట్ చేశారో చూపకుండా జీతం పొందాడు. ఇదే స్కూల్లో ఉన్నప్పుడు ఓడీ(ఆన్‌డ్యూటీ) కింద పలుమార్లు వెళ్లాడు. కాని ఓడీకి కూడా జాయినింగ్, రిలీవింగ్ సర్టిఫికెట్స్ లేవు. దీర్ఘకాలిక సెలవులు పెట్టినందు వల్ల ఇంక్రిమెంట్ వెనక్కి వెళ్లాలి. కాని ప్రతి సంవత్సరం ఒకే టైమ్‌లో ఇంక్రిమెంట్ ఆగకుండా పొందడం విశేషం. ఎస్‌ఆర్‌లో ఆర్జిత సెలవుల అకౌంట్లో ఈఎల్ లీవులు అధికంగా, లోపల ఎస్ఆర్ ఎంట్రీలు తక్కువగా ఉండటం గమనార్హం, సీఎల్స్‌ను (సెలవులు) ఓడీగా దిద్దుకున్నారు. ఇదే పాఠశాలలో మొదట సీఎల్‌గా ఉన్న వాటిని రిజిస్టర్లో ఓడీగా దిద్దుకున్నారు. ఇలా జరగాలన్నా అక్కడి హెచ్ఎం ఇన్షియల్ ఉండాలి. కాని అలా లేదు. ఉదాహరణకు 2008, ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఇలా దిద్దారు. ఇలా దిద్దిన అనేక ఓడీల రిజిస్టర్లను సమాచార హక్కు చట్టం ద్వారా ‘న్యూస్‌లైన్’ సేకరించింది. కలెక్టర్ బహిరంగ విచారణ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. రాపూరులో.. : రాపూరులో కూడా రికార్డులను తారు మారు చేశారనే అనుమానంతో రవికుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. ఏడు నెలలైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ తనకు అనుకూలంగా ఉన్న ఓ టీచర్‌ను వెంకటగిరిలో డిపార్ట్ మెంట్ ఆఫీసర్‌గా నియమించాడు. ఎంతో సీనియారిటీ ఉన్న వారిని కాదని నియమించడంలో ఈ హెచ్ఎం పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. అనంతసాగరంలో ఈ హెచ్ఎం ఎంఈఓగా పని చేస్తూ వేధిస్తుండటంతో ఓ ఉపాధ్యాయడు ఈయన్ను కొట్టాడు. (మధ్యలో ఎంఈఓ నుంచి మళ్లీ హెచ్ఎంగా డిమోట్ అయ్యారు) మచ్చుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సస్పెన్షన్ విషయమై గూడూరు డిప్యూటీ ఈఓ వెంకటేశ్వరరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఆర్జేడీ ఉత్తర్వుల మేరకు హెచ్ఎం సస్పెండ్ అయ్యాడన్నారు. రాపూరుకు ప్రత్యామ్నాయ హెచ్ఎంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను డీఈఓ కార్యాలయానికి కూడా పంపినట్టు తెలిపారు. అయితే కోర్టు శేషాద్రివాసు సస్పెన్షన్‌ను రద్దు చేసిందని, అందుకే పరీక్షల విధుల్లోకి తీసుకున్నానని డీఈఓ చెప్పడం గమనార్హం. పరంధామయ్య సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశం గత నెల 28న కలెక్టర్ యూటీఎఫ్ నేత పరంధామయ్య సస్పెండ్‌ను రద్దు చేయాలని కోరుతూ అపాయింటింగ్ అథారిటీ అయిన డీఈఓకు ఆర్డర్ వేశారు. కాని డీఈఓ లెక్కచేయలేదు. సకాలంలో సిలబస్ పూర్తి చేయలేదనే ప్రధాన ఆరోపణతో పరంధామయ్యను డీఈఓ సస్పెండ్ చేశారు. అంతేకాక సస్పెండ్ చేసిన రోజే ఆగమేఘాలపై కథ నడిచింది. మరి ఆర్జేడీ శేషాద్రివాసును సస్పెండ్ చేసినప్పుడు ఇంతే వేగంగా ఎందుకు ఉత్తర్వులు డీఈఓ కార్యాలయం ఇవ్వలేదో వారికే తెలియాలి. కొంత జాప్యం జరిగినందుకు ఆర్జేడీ పార్వతి గూడూరు డిప్యూటీ ఈఓ వెంకటేశ్వరరావుకు మెమో కూడా ఇచ్చింది. పరంధామయ్య సస్పెండ్‌ను రద్దు చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌ను ఏం చేశారని ‘న్యూస్‌లైన్’ డీఈఓ రామలింగాన్ని వివరణ కోరగా ఇదొక్కటే కాదని, ఇలాంటికొంతమందికి సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని చెప్పారు. అన్నీ కలెక్టర్ వద్దకు పంపిస్తానని డీఈఓ తెలిపారు.