ఆ టేపులూ సాక్ష్యాలే: సుప్రీం | Karnataka Congress urges SC to take on record audio clip Yediyurappa | Sakshi
Sakshi News home page

ఆ టేపులూ సాక్ష్యాలే: సుప్రీం

Published Tue, Nov 5 2019 5:36 AM | Last Updated on Tue, Nov 5 2019 5:44 AM

Karnataka Congress urges SC to take on record audio clip Yediyurappa - Sakshi

కాంగ్రెస్‌–జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 17 మంది కాంగ్రెస్‌–జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేల అనర్హత కేసు మలుపు తిరిగింది. తమపై అనర్హత విధించడం సబబు కాదని ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణలో ఉండటం తెల్సిందే. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తామే ముంబైకి పంపించామని సీఎం యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ టేపులనూ సాక్ష్యాలుగా తీసుకుంటామని సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. దీనికి ముందు ఈ టేపులను తీర్పు సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ వాదించింది. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌–జేడీఎస్‌ల ప్రభుత్వాన్ని కూల్చారని సుప్రీంకు  కాంగ్రెస్‌ కర్ణాటక విభాగం నివేదించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement