Rebel MLAs
-
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన బీజేపీ
ఢిల్లీ:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఐదు జాబితాను విడుదల బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. తాజాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎంపీ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. అనంతరం హిమాచల్ కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. తాజాగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో వారు చోటు సంపాధించుకున్నారు. సుధీర్‌శర్మ- ధర్మశాల, రవి ఠాకుర్- లాహౌల్ అండ్ స్పితి, రాజిందర్ రానా- సుజన్పూర్, ఇందర్ దత్ లకాన్ పాల్- బర్సార్, చైతన్య శర్మ- గాగ్రేట్, దేవిందర్ కుమార్ భుట్టో- కుట్లేహర్ స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. ఈ ఆరు స్థానాలకు ఏడు విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అదే రోజు హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాకుల కూడా పోలింగ్ జరగనుంది. అదే విధంగా గుజరాత్లో ఐదు స్థానాలు, కర్ణాటకలో ఒక స్థానం, పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రకటించింది. BJP releases a list of candidates for upcoming by-elections in Gujarat, Himachal Pradesh, Karnataka and West Bengal pic.twitter.com/xiZsleW91d — ANI (@ANI) March 26, 2024 -
కాంగ్రెస్ రెబల్స్‌కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఆరుగురు శాసనసభ్యులు ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అనర్హత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణ జరిపింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కార్యాలయానికి నోటీసు పంపింది. పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున అసెంబ్లీ కార్యకలాపాలతోపాటు ఓటింగ్‌లోనూ పాల్గొనరాదని ఆరుగురికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు మే 7 ఆఖరు తేదీ. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్!
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు.. వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ ఇంకో అవకాశం ఇచ్చారు. అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని మరోసారి ఆయన నోటీసులు జారీ చేశారు. అయితే.. నోటీసుల్లో ఇదే తుది విచారణగా పేర్కొనడం గమనార్హం. వైఎస్సార్సీపీ నుంచి నెగ్గి.. పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలకు ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అయితే సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ.. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో 19వ తేదీన మధ్యాహ్నాం విచారణ ఉంటుందని.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం ఉంటుందని నోటీసుల్లో అసెంబ్లీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే.. అనర్హత పిటిషన్ వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణ లకు సైతం శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణకు హాజరయ్యే విషయమై వీళ్లంతా నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మరో ఛాన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖ రాశారు. ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకు ముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు లేఖ పంపించారు. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు నోటీసులు పంపించారు. ఇదీ చదవండి: CM Jagan: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు -
నేడు విచారణకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్
-
వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. తమకు అనర్హత వేటు నోటీసులు పంపడాన్ని తప్పుబడుతూ.. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదుల్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తూనే.. తదుపరి విచారణను వచ్చే నెల 26వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ -
RS Elections: వేడెక్కిన ఏపీ రాజకీయం
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం.. పెద్దల సభకు జరగబోయే ఎన్నికలు. తద్వారా రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు అయ్యే అవకాశం. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠా నెలకొంది. సాధారణ ఎన్నికలకు ముందే రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు కానుంది. కారణం ఉన్న ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల పదవీకాలం పూర్తి కానుంది. దీంతో ఉన్న ఒక్క సీటు కూడా దూరం కానుంది. ఇక ఎమ్మెల్యే సంఖ్యా బలంతో వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలు దక్కించుకుంటామనే ధీమాతో ఉంది వైఎస్సార్సీపీ. ఈ తీవ్ర ఆందోళనల నడుమే దుష్ట రాజకీయానికి తెర లేపినట్లు స్పష్టమవుతోంది. ఎందుకు.. ఏప్రిల్ 2తో వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ సభ్యుడు కనకమేడల పదవీకాలం ముగియనుంది. సంఖ్యాబలాన్ని బట్టి ఈ మూడూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్సీపీ పరం కానున్నాయి. తద్వారా రాజ్యసభలో ఉనికే లేకుండాపోనుంది టీడీపీ. అదే జరిగితే.. 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి కానుంది. ఇదీ చదవండి: రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదల వ్యూహ-ప్రతివ్యూహాలు రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యే ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో ఎన్నికలు జరగనున్న 3 స్థానాలకు షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ-ప్రతివ్యూహాలతో అప్రమత్తమయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలనూ గెలుచుకుంటామని వైఎస్సార్సీపీ ధీమాతో ఉండగా.. ఒక్క సీటుకు పోటీ పెట్టాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. ప్రస్తుతం స్పీకర్ ముందు నలుగురు వైసీపీ రెబల్స్, మరో నలుగురు టీడీపీ రెబల్స్ అనర్హత పిటిషన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక సీటు గెలవాలంటే దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. గంటా రాజీనామా ఆమోదం ద్వారా టీడీపీ కి ఒక సీటు తగ్గింది. మళ్లీ అదే బాటలో బాబు.. తెలుగుదేశం అనగానే గుర్తొచ్చేది పార్టీ ఫిరాయింపులు. తెలంగాణలో ఓటుకు కోట్లు అయినా.. ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల డబ్బు వ్యవహారం అయినా.. ఫిరాయింపులకు టీడీపీ బ్రాండ్‌గా మారింది. మరోసారి అదే అస్త్రంపై నమ్మకం పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. బలం లేకున్నా... పోటీకి అభ్యర్థిని పెట్టడం.. ఆ పార్టీకి వస్తోన్న అనవాయితీ. ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లోనూ ఒక స్థానానికి వర్లరామయ్య, కోనేరు సురేష్ పేరు పరిశీలిస్తున్నట్టు టీడీపీ లీకులిస్తోంది. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 18కి తగ్గే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల ద్వారా నెలపాటు స్పీకర్‌ను గడువు కోరడం వెనుక చంద్రబాబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
AP: పార్టీ ఫిరాయించారు.. వేటేనా?
విజయవాడ: వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుపై నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి మరింత గడువు కావాలని కోరారు. స్పీకర్ ఎదుట విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు మెమో దాఖలు చేశారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు, పేపర్, వీడియో క్లిప్పింగుల నిజనిర్ధారణకు సమయం అవసరమని, పిటిషన్ దాఖలు తర్వాత రిప్లైకి 30 రోజుల సమయం కావాలని కోరామని తెలిపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్‌తో భేటీ తర్వాత తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కొత్త సాకులు స్పీకర్‌తో విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త కారణాలను తెరమీదికి తెచ్చారు ఉండవల్లి శ్రీదేవి : నాకు కోవిడ్ వచ్చింది, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇంకా సెలైన్ పెట్టుకుంటూనే ఉన్నాను. కోవిడ్ తగ్గే దాకా సమాధానం ఇవ్వడానికి సమయం కావాలి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి : నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. వైద్యుల నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు, విప్ ఉల్లంఘించామనడానికి ఉన్న ఆధారాలేమిటి? ఆనం రాంనారాయణ : నోటీసులిచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమనడం సరికాదు, అసలు నాకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయా? కాగా పార్టీ ఫిరాయించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారిస్తుండగా.. ఎమ్మెల్సీలను శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు విచారించారు. దీ చదవండి: చెప్పింది చేయకపోవడం బాబు నైజం -
రేపు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు సోమవారం హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. రేపు(సోమవారం) ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకానున్నారు. అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ముందుకు వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరై, వివరణ ఇవ్వనున్నారు. ఇక.. వైఎస్సార్సీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు చేసిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై విచారణకు 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. చదవండి: గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్! -
Maharashtra political crisis: రాజ్యాంగపరమైన ప్రశ్నలెన్నో!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన, రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లు పార్టీల్లో చీలిక, విలీనం, ఫిరాయింపులు, అనర్హత తదితరాలకు సంబంధించి పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వీటన్నింటినీ విస్తృత ధర్మాసనం లోతుగా మదింపు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలేందుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి ఉద్ధవ్, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై జస్టిస్ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వాదనలు సాగాయి. సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ఉద్ధవ్ వర్గం తరఫున, హరీశ్ సాల్వే తదితరులు షిండే వర్గం తరఫున వాదనలు వినిపించారు. ప్రజా తీర్పుకు విలువేముంది: సిబల్ మహారాష్ట్రలో జరిగినట్టు అధికార పార్టీని ఇష్టానుసారం చీలుస్తూ పోతే ప్రజా తీర్పుకు విలువేముందని సిబల్ ప్రశ్నించారు. ‘‘ఫిరాయింపులను నిరోధించే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌కు కూడా విలువ లేకుండా పోతుంది. వేరే పార్టీలో విలీనానికే తప్ప ఇలాంటి చీలికలకు ఫిరాయింపుల నుంచి రక్షణ వర్తించబోదు. అలా కాదని మెజారిటీ సూత్రాన్నే అంగీకరించాల్సి వస్తే దేశంలో ఎన్నికైన ప్రతి ప్రభుత్వాన్నీ సులువుగా కూలదోయవచ్చు. పార్టీల్లో చీలికలను నిషేధిస్తున్న రాజ్యాంగ రక్షణకు అర్థమే ఉండదు. ఇదో ప్రమాదకరమైన పోకడకు దారితీస్తుంది’’ అన్నారు. బీజేపీ నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి ఓటేసినందుకు షిండే వర్గానికి చెందిన 40 మంది సేన ఎమ్మెల్యేలపై పదో షెడ్యూల్లోని రెండో పేరా ప్రకారం అనర్హత వేటు పడ్డట్టేనని వాదించారు. అంతేగాక వివాదం సుప్రీంకోర్టులో ఉండగా గవర్నర్ కొత్త ప్రభుత్వంతో ప్రమాణస్వీకారం చేయించడమూ సరికాదన్నారు. సీఎంను మారిస్తే కొంపలేమీ మునగవు: సాల్వే సిబల్ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కొంపలు మునగవన్నారు. నాయకున్ని మార్చాలని పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటే అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఒక్కటై ప్రధానిని కూడా వద్దు పొమ్మని చెప్పవచ్చు. కాబట్టి మహారాష్ట్ర ఉదంతానికి సంబంధించినంత వరకు ప్రజాస్వామ్య సంక్షోభం తదితరాల్లోకి పోకుండా స్పీకర్ ఎన్నిక చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్నదానికే వాదనలు పరిమితం కావాలి’’ అని సూచించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ రమణ స్పందిస్తూ మహారాష్ట్ర ఉదంతం పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తిందన్నారు. ‘‘10వ షెడ్యూల్లో మూడో పేరా తొలగింపు తర్వాత పార్టీలో చీలికకు గుర్తింపు లేకుండా పోయింది. దీని తాలూకు పరిణామాలెలా ఉంటాయో ఆలోచించాల్సి ఉంది. పార్టీ చీలికను గుర్తించే విధానం లేకపోవడం, పార్టీలో మైనారిటీలో పడ్డ నాయకునికి చట్టసభల్లోని తమ పార్టీ నేతను తొలగించే అధికారముందా వంటివన్నీ లోతుగా చర్చించాల్సన అంశాలు. ఇరుపక్షాల వాదనలూ విన్నాక, వీటిలో పలు అంశాలను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి నివేదిస్తాం. అందుకే ఏయే అంశాలపై విచారణ జరపాలో ఇరు వర్గాలూ ఆలోచించుకుని జూలై 27కల్లా మా ముందుంచాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. బలపరీక్ష, స్పీకర్ ఎన్నిక సందర్భంగా పార్టీ విప్‌ను ఉల్లంఘించినందుకు ఉద్ధవ్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న షిండే వర్గం విజ్ఞప్తిపై అప్పటిదాకా ఏ చర్యలూ చేపట్టొద్దని స్పీకర్‌ను ఆదేశించారు. -
థాక్రేకు మళ్లీ నిరాశే.. షిండే వర్గానికి ఆగస్టు 1వరకు గడువిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. పార్టీపై ఆధిపత్యం కోసం థాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటిలోగా ఏక్నాథ్ షిండే వర్గం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల అనర్హత విషయానికి సంబంధించి స్పీకర్ కూడా అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో థాక్రే వర్గానికి మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ పిటిషన్లలోని కొన్ని విషయాలను పరిశీలిస్తే.. వీటి విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం అవుతుందని బలంగా నమ్ముతున్నట్లు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచనప్రాయంగా తెలిపారు. దీంతో ఈ పిటిషన్ల కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మానాన్ని ఏర్పాటు చేసే అవకాశం కన్పిస్తోంది. షిండే వర్గం చేసిన పనిని సమర్థిస్తే దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలన్నీ కూలిపోయే పరిస్థితి వస్తుందని థాక్రే వర్గం తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. మరోవైపు షిండే వర్గం తరఫున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అనర్హత వేధింపుల వల్ల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని కోర్టుకు చెప్పారు. థాక్రే వర్గం పిటిషన్లపై తాము అఫిడవిట్ దాఖలు చేసేందుకు కాస్త గడువు కావాలని, కేసును వచ్చేవారం వాయిదా వేయాలని కోరారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయం పెండింగ్‌లో ఉండగానే.. షిండే వర్గాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతించడాన్ని థాక్రే వర్గం సవాల్ చేసింది. పార్టీ విప్‌ను దిక్కరించి కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారని, వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. మరోవైపు షిండే వర్గం మాత్రం.. శివసేన పార్టీ తమదే అని వాదిస్తోంది. 20మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతివ్వని వ్యక్తిని కోర్టుల సాయంతో అధికారంలో కూర్చోబెట్టే దుస్థితిలో మనం ఉన్నామా అంటూ షిండే తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. చదవండి: షిండే మంత్రివర్గంలో చోటుకు రూ.100 కోట్లు.. ఆ ఎమ్మెల్యేకు ఆఫర్! -
Maharashtra political crisis: ముంబైకి రెబల్ ఎమ్మెల్యేలు
ముంబై: మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్నిక, సభలో ప్రభుత్వ బలనిరూపణకు రంగం సిద్ధమయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆదివారం, సోమవారాల్లో రెండు రోజులపాటు జరుగనున్నాయి. గోవాలో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో ముంబైకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉదయమే గోవాకు వెళ్లి, రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి తిరిగివచ్చారు. వారు ముంబైలోని ఓ హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం వారంతా హోటల్ నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరుతారు. ఉద్ధవ్ లేఖను సవాలు చేస్తాం: రెబల్ వర్గం ‘శివసేన నేత’ పదవి నుంచి షిండేను తొలగిస్తూ ఉద్ధవ్ ఠాక్రే జారీ చేసిన లేఖను సవాలు చేస్తూ సరైన వేదికను ఆశ్రయిస్తామని రెబల్ వర్గం ఎమ్మెల్యే దీపక్ కేసార్కర్ శనివారం చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణాలతో షిండేను శివసేన నేత పదవి నుంచి తప్పిస్తూ ఉద్ధవ్ ఠాక్రే జూన్ 30 తేదీతో లేఖ విడుదల చేశారు. షిండే అదేరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ లేఖ మహారాష్ట్ర ప్రజలను అవమానించేలా ఉందని దీపక్ కేసార్కర్ విమర్శించారు. తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిగా షిండేను ఎన్నుకున్నారని గుర్తుచేశారు. -
నాకూ ఆఫర్ ఇచ్చారు.. అందుకే వద్దన్నా: సంజయ్ రౌత్
ముంబై: తిరుగుబాటు వర్గం నుంచి తనకు కూడా ఆఫర్ వచ్చినట్టు శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. గువాహటిలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చేతులు కలిపేందుకు వచ్చిన అవకాశాన్ని తాను తిరస్కరించినట్టు ఆయన చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను ఏ తప్పు చేయలేదని కాబట్టే నిర్భయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్నాను. అందుకే 10 గంటల పాటు నన్ను విచారించినా బయటకు రాగలిగాను. నేను కూడా గువాహటి వెళ్ళవచ్చు కానీ నేను బాలాసాహెబ్ సైనికుడిని. నిజం మనవైపు ఉన్నప్పుడు, ఎందుకు భయపడాల’ని సంజయ్ రౌత్ అన్నారు. ఏక్నాథ్ షిండే శివసేన ముఖ్యమంత్రి కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ముంబైలో శివసేన బలాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగానే ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కట్టబెట్టిందని ఆరోపించారు. శివసేన పార్టీని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ వ్యూహం ప్రకారం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. తమదే నిజమైన శివసేన అని ఏక్నాథ్ షిండే వర్గం ప్రచారం చేసుకోవడం ఇందులో భాగమని తెలిపారు. శివసేన ఎంపీలంతా తమవైపే ఉన్నారని.. నిజమైన శివసైనికులు ఎలాంటి ప్రలోభాలకు లొంగరని పేర్కొన్నారు. అసలైన శివసేన ఉద్ధవ్ ఠాక్రేతో ఉందని సంజయ్ రౌత్ దీమా వ్యక్తం చేశారు. కాగా, మనీ ల్యాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు 10 గంటల పాటు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. (క్లిక్: ఏక్నాథ్ షిండే శివసేన సభ్యత్వం తొలగింపు) -
గోవా హోటల్లో చిందులు.. రెబెల్ ఎమ్మెల్యేలపై సీఎం షిండే అసంతృప్తి..
సాక్షి, ముంబై: శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తమ నాయకుడు సీఎం అవ్వబోతున్నారని తెలిసి పట్టరాని సంతోషంగా గోవాలోని ఓ హోటల్లో బస చేస్తున్న రెబెల్ నాయకులంతా డ్యాన్స్ చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు మరాఠీ పాటలకు ఉత్సాహంగా చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎమ్మెల్యేల తీరుపై పలువురు విమర్శలు గుప్పించారు. అంతేగాక గోవాలోని హోటల్లో తన వర్గం ఎమ్మెల్యేలు డ్యాన్స్ చేయడంపై ఏక్నాథ్ షిండే అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం శుక్రవారం ఉదయం షిండే గోవాలోని హోటల్‌కు తిరిగి వెళ్లారు. ఎమ్మెల్యేలు డ్యాన్స్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకోసారి అలాంటివి జరగొద్దని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. చదవండి: కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన కాగా రెబెల్ నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ మాట్లాడుతూ.. అలా డ్యాన్స్ చేయడం పొరపాటని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు అలా చేయడం మంచిది కాదని అన్నారు. సంతోషంలో అలాంటి తప్పు జరిగిపోయిందని, అలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. తామంతా బీజేపీతో కలిసి మహారాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. చదవండి: మాజీ సీఎం.. తాజాగా డిప్యూటీ సీఎం.. ఫడ్నవీస్ పేరిట ఓ రికార్డు -
ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు?
సాక్షి, ముంబై: వేగంగా మారుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్ధానాలు 288 ఉండగా అందులో శివసేనకు 55 ఉన్నాయి. అందులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి 16, ఏక్నాథ్ షిందే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా మొత్తం 36 జిల్లాల్లో ఏక్నాథ్ షిందేకు 18 జిల్లాల్లో 39 మంది ఎమ్మెల్యేలున్నారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి తొమ్మిది జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే ఉద్ధవ్‌కు 25 శాతం జిల్లాల్లో, షిందే వర్గానికి 50 శాతం జిల్లాల్లో ఎమ్మెల్యేలున్నారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఏం జరగవచ్చు? ►288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత మెజారిటీ మార్కు 143. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణం వాస్తవ బలం 168. కానీ 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో కనీసం 39 మంది తిరుగుబాట పట్టడం, 10 మందికి పైగా స్వతంత్రులు వారితో చేతులు కలపడంతో కూటమి మైనారిటీలో పడ్డట్టు ఇప్పటికే స్పష్టమైంది. ►బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. షిండే వర్గం మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు దానికి నల్లేరుపై నడకే. అయితే 2019లో ఎన్నికల తర్వాత ఎన్సీపీ చీలిక వర్గంతో హడావుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తలకు బొప్పి కట్టించుకుని మూడు రోజుల్లోనే తప్పుకున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ జాగ్రత్త పడుతోంది. తనకు చెడ్డ పేరు రాకుండా సంకీర్ణాన్ని గద్దె దించడంపైనే దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభం.. ఇంతకు ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు? ►షిండే వర్గం గురువారం ముంబై తిరిగొస్తే నేరుగా గవర్నర్‌ను కలిసి సంకీర్ణానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చెప్పడంతో పాటు బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా కోరవచ్చు. అదే జరిగితే సంకీర్ణం కుప్పకూలినట్టే. ►అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో షిండే వర్గం చేతులు కలుపుతుందన్నది ఒక వాదన. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయంటున్నారు. 9 దాకా మంత్రి పదవులిస్తామని బీజేపీ చెబుతోందని, షిండే ఉప ముఖ్యమంత్రి పదవి పట్టుబడుతున్నారని సమాచారం. ►ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై శివసేన దాడుల నేపథ్యంలో శాంతిభద్రతలను కారణంగా చూపి రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేసే ఆస్కారం లేకపోలేదనీ అంటున్నారు. అదే జరిగితే అంతిమంగా అసెంబ్లీ ఎన్నికలకు దారి తీయవచ్చు. చదవండి: మహారాష్ట్ర గవర్నర్ రఫెల్ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్ రౌత్ సెటైర్లు -
మహారాష్ట్ర సంక్షోభం.. ఇంతకు ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు?
సాక్షి, ముంబై: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదరడంతో ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. దీంతో ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో అంతుచిక్కడం లేదు. ఎవరికి వారే బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప కచ్చితమైన ఎమ్మెల్యేల సంఖ్య ఎవరూ బయటపెట్టడం లేదు. శివసేనలో మొత్తం 55 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో 15–20 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం చెబుతోంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం తమకే ఉందని ఉద్ధవ్ మద్దతుదార్లు ప్రకటనలు చేస్తున్నారు. కానీ మా వెంట 40 మంది శివసేన ఎమ్మెల్యేలున్నారని, ఇతరులతో కలిపి మొత్తం 50–55 మంది మద్దతుదారులున్నారని ఏక్నాథ్ షిందే వర్గం ప్రకటిస్తోంది. దీంతో ఏ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారనే దానిపై ఇటు ప్రజల్లో అటు మహావికాస్ ఆఘాడినేతల్లో అయోమయ పరిస్ధితి నెలకొంది. చదవండి: మహారాష్ట్ర గవర్నర్ రఫెల్ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్ రౌత్ సెటైర్లు రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్ధానాలు 288 ఉండగా అందులో శివసేనకు 55 ఉన్నాయి. అందులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి 16, ఏక్నాథ్ షిందే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా మొత్తం 36 జిల్లాల్లో ఏక్నాథ్ షిందేకు 18 జిల్లాల్లో 39 మంది ఎమ్మెల్యేలున్నారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి తొమ్మిది జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే ఉద్ధవ్‌కు 25 శాతం జిల్లాల్లో, షిందే వర్గానికి 50 శాతం జిల్లాల్లో ఎమ్మెల్యేలున్నారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. -
అప్పుడు కుక్కలు, పందులని.. ఇప్పుడు రమ్మని అడుగుతున్నారా?.. షిండే ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజులుగా సాగుతున్న ఎమ్మెల్యేల తిరుగుబాటు వ్యవహారం కొలిక్కి రాలేదు. అయితే, తాజాగా ఈ వివాదం కోర్టుకెక్కడంతో త్వరలోనే సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేన రెబల్ ఎమ్మెల్యేలంతా గువాహటిలోని ఓ హోటల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఉద్ధవ్‌పై ఏక్నాథ్ షిండే మండిపాటు ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెబెల్ ఎమ్మెల్యే తిరిగి ముంబై రావాలని సీఎం ఉద్ధవ్ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన ఏక్నాథ్ కౌంటర్ అటాక్ చేశారు. ఈ మేరకు ట్విటర్లో విరుచుపడ్డారు. ‘ఓ వైపు ఆదిత్య ఠాక్రే మమ్మల్ని కుక్కలు, పందులు, మేకలు అని తిడుతూనే.. మరోవైపు తిరిగి రావాలని విజ్ఙప్తి చేస్తున్నారు. మా ఆత్మలు నశించాయని, వట్టి దేహాలే ఉన్నాయని ఒకరు.. ముంబై ఎలా వస్తారో చూస్తామని మరికొందరు శివసేన నేతలు బెదిరించారు. ఇప్పుడే సమస్యలు పరిస్కరించుకుందాం రండి అని పిలుస్తున్నారు’ అని ఏక్నాథ్ షిండే ట్వీట్ చేశారు. సంబంధిత వార్త: రెబెల్స్ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ భావోద్వేగ లేఖ! एका बाजूला आपल्या पुत्राने व प्रवक्त्याने वंदनीय बाळासाहेबांच्या शिवसैनिकांना डुकरं,नाल्याचीघाण,रेडा,कुत्रे,जाहील व मृतदेह म्हणायचे,त्यांचा बाप काढायचा तर दुसऱ्या बाजूला मात्र हिंदूविरोधी मविआसरकार वाचवण्यासाठी याच आमदारांना समेटाची हाक द्यायची,याचा अर्थ काय?#donttrickmaharashtra — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 28, 2022 దయచేసి ముంబై తిరిగి రండి: ఉద్దవ్ శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మంగళవారం భావోద్వేగ లేఖ రాశారు. రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకు తిరిగి వచ్చి తనతో మాట్లాడాలని కోరారు. సమయం ఇంకా మించి పోలేదని, రెబెల్ ఎమ్మెల్యేలను శివసేన వదులుకోలేదని, ముంబైకు వస్తే చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని కోరారు. శివసేన ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదని అన్నారు. ‘మీకు సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుందాం తప్ప ఇది సరైన దారి కాదు. గత కొద్ది రోజులుగా గౌహతిలో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేల గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. శివసేన కుటుంబ అధినేతగా నేను మీ మనోభావాలను గౌరవిస్తాను, ముందుగా ఈ గందరగోళం నుంచి బయటపడండి. మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు, దాని నుంచి బయటపడాలి. అందరం కలిసి ఒక పరిష్కారం కనుగొద్దాం’ అని ఠాక్రే ఆ లేఖలో సూచించారు. చదవండి: వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే? -
వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే?
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, తిరుగుబాటు నేత, మంత్రి ఏక్నాథ్ షిండే వర్గం మధ్య రోజరోజుకూ రాజకీయ వివాదం ముదురుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ముంబై పోలీసు కమిషనర్ నగరంలో 144 సెక్షన్ అమలుచేయడమే గాకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంవల్ల ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. ఒకపక్క ఉద్దవ్ మద్దతుదార్లు, మరోపక్క షిండే వర్గం మద్దతుదార్లు పోటాపోటీగా ర్యాలీలు, ఆందోళనలు, బలప్రదర్శనలు చేస్తూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. దీనికితోడు తిరుగుబాటు మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలకు కేంద్రం భద్రత మరింత పటిష్టం చేయడంతో ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఎవరికి, ఎలాంటి భద్రత కల్పించారో అధ్యయనం చేస్తున్నట్లు పోలీసు శాఖకు చెందిన సీనియర్ అధికారులు తెలిపారు. సంబంధిత వార్త: రెబెల్స్ ఎమ్మెల్యేలను రప్పించేందుకు సీఎం ఉద్దవ్ ఠాక్రే చివరి ప్రయత్నం! శాంతి భద్రతలపైనే దృష్టి... వారం రోజులుగా జరుగుతున్న ఎమ్మెల్యేల తిరుగుబాటు బెడద ఇంతవరకు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఈ వివాదం చట్టపరంగా తేలాలంటే కోర్టుకెక్కే ప్రమాదం ఉంది. ఏదేమైనా షిండే శిబిరంలో తలదాచుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కచ్చితంగా ముంబైకి రావల్సిందే. కేవలం మద్దతుదారులతో కూడిన లేఖ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి పంపిస్తే సరిపోదు. కోశ్యారీ ఎదుట లేదా మంత్రిమండలిలో షిందే తన బలాన్ని నిరూపించాలంటే తన వర్గంలోని ఎమ్మెల్యేందరూ హాజరు కావాల్సిందే. వీరంతా ఒకేసారి ముంబైకి వస్తే శివసైనికులు, ఇతర పార్టీల కార్యకర్తలు వారిపై దాడి చేయడం లేదా వారికి వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళనలు కచ్చితంగా చేస్తారు. అదే సమయంలో శివసైనికులు, షిండే వర్గం కార్యకర్తలు పరస్పరంగా ఎదురుపడితే అప్పుడు పరిస్ధితి ఏంటి.. శాంతి, భద్రతలు కచ్చితంగా అదుపు తప్పే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఇలాంటి క్లిష్ట పరిస్ధితుల్లో శాంతి, భద్రతలు అదుపు తప్పకుండా ఉండాలంటే ముంబై పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అందుకు ముంబై పోలీసు శాఖ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమైంది. ముంబై పోలీసు కమిషనర్ సంజయ్ పాండే ఇదివరకే రెండుసార్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. తాజా పరిస్ధితులపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాజాగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించడంతో ఇప్పట్లో ఈ వివాదం సద్దుమణిగే వాతావరణం కనిపించడం లేదు. చదవండి: Maharashtra Crisis: ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు.. రాజకీయ వివాదం సద్దుమణిగేదాకా ఈ పరిస్ధితి ఇలాగే ఉంటుందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుదారులు ముంబైకి వస్తే శాంతి, భద్రతల అంశం తెరమీదకు రానుంది. ముంబైలో పరిస్ధితులు అదుపుతప్పి అల్లర్లకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పాండే నిర్ధేశించినట్లు తెలిసింది. అవసరమైతే అదనంగా వివిధ భద్రతా బలగాలను సమకూర్చునేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. -
Maharashtra Crisis: ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు..
మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ హస్తీనా చేరుకున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిషాతో ఫడ్నవీస్ భేటీ కానున్నారు. మరోవైపు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే కూడా గౌహతి నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే భేటీ అయ్యే అవకాశముంది. అయితే రెబెల్స్‌తో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారనే చర్చ జరుగుతోంది. అదే విధంగా సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం సాయంత్రం 5 గంటలకు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఏదేమైనా నేడు ఢిల్లీలో జరిగే సమావేశం అత్యంత కీలకంగా మారనుంది. Maharashtra former CM and BJP leader Devendra Fadnavis arrives at Delhi airport #MaharashtraPoliticalCrisis pic.twitter.com/x7ZA1LjbmO — ANI (@ANI) June 28, 2022 కాగా మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలకు ఏక్నాథ్ షిండే కౌంటర్ ఇచ్చారు. గౌహతి క్యాంప్‌లో ఎవరూ అసంతృప్తిగా లేరని ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. తనతోపాటు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ఉద్దవ్ ఠాక్రేతో ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే వారి పేర్లు బయటపెట్టాలని షిండే సవాల్ విసిరారు. చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో ‘డబుల్’ ట్విస్ట్ ప్రభుత్వం చేసిన తప్పేంటి? అంతకముందు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై ఆదిత్య ఠాక్రే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం చేసిన తప్పేంటో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వేళ అసెంబ్లీలో అవిశాస్వ తీర్మాణం జరిగితే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బల పరీక్షకంటే ముందు నైతిక పరీక్ష జరగాలన్నారు. వాళ్లు రెబెల్స్ కాదని, ద్రోహులని అన్నారు. తిరుగుబాటు చేయాలనుకుంటే ఇక్కడే ఉండి చేయొచ్చని, ఇలాంటి వారు ఎప్పటికీ గెలవలేరన్నారు. -
సుప్రీం కోర్టులో ఊరట! ఏక్నాథ్ షిండే రియాక్షన్ ఇదే...
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఓవైపు శివసేన నేృత్వంలోని సంకీర్ణ కూటమి మహా వికాస్ అగాడీ అసెంబ్లీలో మెజార్టీ కోల్పోయింది. మరోవైపు ఏక్నాథ్ షిండే క్యాంపులో తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే విధంగా మహారాష్ట్రలో తమదే అధికారమంటూ బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజులు మాత్రమే తాము ప్రతిపక్ష హోదాలో ఉండబోతున్నట్లు పేర్కొంటున్నారు. ఇక మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. తాజాగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించడంపై ఏక్నాథ్ షిండే హర్షం వ్యక్తం చేశారు. ఇది బాలా సాహెబ్ ఠాక్రే విజయమని అన్నారు. ఈ మేరకు ఏక్నాథ్ షిండే ట్విటర్లో స్పందించారు. ‘ఇది హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వ విజయం. ధర్మవీర్ ఆనంద్ దిఘే ఆలోచనల విజయం’ అని షిండే మరాఠీలో ట్వీట్ చేశారు. దీనికి #realshivsenawins అనే హ్యష్‌ట్యాగ్ జతచేశారు. हा वंदनीय हिंदुहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या हिंदुत्वाचा आणि धर्मवीर आनंद दिघे साहेबांच्या विचारांचा विजय..!#realshivsenawins — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 27, 2022 కాగా 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేయడంతోపాటు శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడాన్ని సవాల్ చేస్తూ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అనర్హత పిటిషన్లపై జూలై 12 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శివసేన శాసనసభా పక్షనేత అజయ్ చౌదరితోపాటు డిప్యూటీ స్పీకర్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయిదు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని మహా సర్కార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. చదవండి: రెబల్స్ మంత్రులకు షాక్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన నిర్ణయం! -
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక మలుపు తీసుకుంది. డిప్యూటీ స్పీకర్ తమపై ఇచ్చిన అనర్హత వేటు నోటీసులను సవాల్ చేస్తూ.. షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్ నోటీసుతో పాటు.. శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడంపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ.. రెండు పిటిషన్ల దాఖలు చేసింది. చదవండి: ‘మహా’ ట్విస్ట్: పోలీస్ శాఖతో గవర్నర్ చర్చలు.. రాష్ట్రపతి పాలన తప్పదా? సోమవారం ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. కాగా.. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు వ్యక్తిగతంగా తమ వద్దకు వచ్చి అనర్హత నోటీసుపై వివరణ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించడంతో.. షిండే న్యాయపోరాటానికి దిగారు. మహారాష్ట్ర శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమించాలన్న శివసేన ప్రతిపాదనను డిప్యూటీ స్పీకర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ లేఖను శివసేన కార్యాలయ కార్యదర్శికి డిప్యూటీ స్పీకర్ కార్యాలయం పంపింది. రెబల్ ఏక్ నాథ్ షిండే స్థానంలో ఆయన ఉండనున్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండేకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. తాజాగా మరో మంత్రి సైతం ఆయన గూటికి చేరనున్నట్లు తెలిసింది. విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామంత్ సైతం గౌహతికి బయలుదేరినట్లు సమాచారం. ఆయన సైతం షిండే వర్గంలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. -
Maharashtra Crisis: గౌహతి హోటల్లో రెబల్ ఎమ్మెల్యేల ఖర్చెంతో తెలుసా?
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే క్యాంపు రాజకీయాలకు తెరలేపిన విషయం తెలిసిందే. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలగాలని, బీజేపీతో జట్టు కట్టాలని ఏక్నాథ్ షిండే డిమాండ్ చేస్తున్నారు. అయితే గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా 24 గంటల్లో ముంబై వచ్చి సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చిస్తే ఎమ్వీఏ కూటమి నుంచి వైదొలిగే ఆలోచన చేస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. 70 గదులు బుకింగ్ దాదాపు 42 ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ప్రస్తుతం గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్లో బస చేస్తున్నారు. హోటల్ పేరు రాడిసన్ బ్లూ. ఆ హోటల్లో మొత్తం 196 గదులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఏడు రోజులకుగానూ 70 గదులు బుక్ చేసుకున్నట్లు హోటల్ వర్గాలు, స్థానిక రాజకీయ నాయకుల ద్వారా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు తొలుత బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ హోటల్లో బస చేశారు. అనంతరం మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలోని గౌహతికి బుధవారం మకాం మార్చారు. చదవండి: Maharashtra Political Crisis: హాట్ టాపిక్‌గా మారిన నెంబర్ గేమ్! రోజుకు రూ. 8 లక్షలు రాడిసన్ బ్లూ హోటల్లోని 70 గదులకు ఏడు రోజులకు రూ. 56 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అంటే ఒక్క రోజు గది, ఆహారం ఇతర అవసరలకయ్యే ఖర్చు రూ.8 లక్షలు అన్నమాట. అయితే హోటల్లోని మొత్తం 196 గదుల్లో ఇప్పటికే 70 బుక్ చేసుకోవడంతో ఇక ఎమ్మెల్యేలకు కొత్తగా రూమ్‌లు కేటాయించేది లేదంటూ హోటల్ యాజమాన్యం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. హోటల్లోని బాంక్వేట్ హాల్‌ను కూడా మూసేసింది. హోటల్లో బస చేసే వారికి మినహా రెస్టారెంట్ కూడా మూసివేశారు. మరి ఆ ఖర్చుల సంగతేంటి? ఇవే కాక మొత్తం ‘ఆపరేషన్’ ఖర్చులో చార్టర్డ్ ఫ్లైట్లు, ఇతర రవాణా ఖర్చుల సంగతేంటి అనేది కూడా తెలీదు. అంతేగాక హోటల్లో ఉంటున్న ఎమ్మెల్యేల ఖర్చు తడిచి మోపడవుతోంది. మరి వీటన్నింటిని ఎవరూ చెల్లిస్తున్నారనేది కూడా ప్రశ్నర్థకమే. అయితే అసోంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అండ్ రాడిసన్ దగ్గర అసోం బీజేపీ మంత్రులే పహారా కాస్తున్నారు. దీంతో క్యాంపు ఖర్చంతా కమలం ఖాతాలోనే పడే అవకాశాలూ లేకపోలేదు. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: ప్రాణాలకు తెగించి కాపాడాడు.. కొంచెం ఆలస్యమైనా ఎంత ఘోరం జరిగేదో.. ఇదిలా ఉండగా గౌహతి హోటల్ నుంచి తాజాగా విడుదల చేసిన వీడియో ప్రకారం ఏక్నాథ్ షిండే వర్గంలో ప్రస్తుతం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే గురువారం ఉదయం తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిత్య ఠాక్రేతో సహా 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. దీంతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన శివసేన పార్టీలో చీలిక దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. -
మీడియాకు చిక్కిన ఏక్నాథ్ షిండే.. పరుగే పరుగు!
ముంబై: మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును కూలదోయడానికి ప్రయత్నిస్తున్న శివసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే (58) మీడియా కంటపడ్డారు. గుజరాత్‌లోని సూరత్ విమానాశ్రయంలో ఆయన మీడియాకు చిక్కారు. తమ మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి అసోంలోని గువాహటికి వెళుతుండగా వారిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్ పోలీసులు, కేంద్ర బలగాలు వారికి రక్షణగా నిలిచాయి. ఏక్నాథ్ షిండేతో సహా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు విలేకరులు విఫలయత్నం చేశారు. మీడియాను తప్పించుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు పరుగందుకున్నారు. అయితే తమకు మెజారిటీ ఉందని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, శివసేన ఎమ్మెల్యేలను గొర్రెల మందను తరలించినట్టుగా సూరత్ విమానాశ్రయం నుంచి గుజరాత్ పోలీసులు తరలించారని ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీ ట్వీట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ ఈ కామెంట్ చేశారు. Gujarat Police herding the Maharashtra Shivsena MLAs like sheep at Surat airport! https://t.co/Kts1SbzoJL — Prashant Bhushan (@pbhushan1) June 22, 2022 మనసు మార్చుకున్న ఎమ్మెల్యేపై దాడి శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు మనసు మార్చుకుని సూరత్ హోటల్ నుండి బయలుదేరడానికి ప్రయత్నించాడని సీనియర్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది ట్వీట్ చేశారు. అతడిని దాడి చేయాలని ఇతర ఎమ్మెల్యేలను ఏక్నాథ్ షిండే ఉసిగొల్పారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన గుజరాత్ పోలీసుల రక్షణలో ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. స్వాతి చతుర్వేది ట్వీట్‌పై ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను సూరత్ హోటల్లో బంధించడం కిడ్నాప్ కంటే తక్కువేమీ కాదని వ్యాఖ్యానించారు. అధికార క్రీడలో ఎమ్మెల్యేలు అమ్ముడుపోడమే కాదు.. అపహరణకూ గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (క్లిక్: ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వెనక బలమైన కారణాలు!) -
ఎన్నికల వేళ: మాయావతికి ఎదురుదెబ్బ
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అపుడు ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీఎన్నికలకుముందు బీఎస్పీ అధినేత మాయావతికి భారీ ఎదురు దెబ్బ తగల నుందా? పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు పార్టీనుంచి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో లక్నోలో భేటీ పలు ఊహాగానాలకు తెర తీసింది. ఎమ్మెల్యేలు హకీమ్ లాల్ బింద్ (హండియా), వందన సింగ్ (సాగ్రి), రామ్‌వీర్ ఉపాధ్యాయ (సదాబాద్), అనిల్ కుమార్ సింగ్ (పూర్వా), అస్లాం రైనీ (భింగా), అస్లాం అలీ (ధోలానా), ముజ్తాబా సిద్దిఖీ (ప్రతాపూర్), హర్గోవింద్ భార్గవ సిధౌలి) సుష్మా పటేల్ (ముంగ్రా బాద్షాపూర్) అఖిలేష్‌లను కలిశారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. త్వరలోనే వీరంతా సమాజ్ వాదీ పార్టీకి మారవచ్చనే వాదనలు ఊపందుకున్నాయి. కాగా 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ19 సీట్లు గెలుచుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సిద్దమవుతోంది. గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఏడుగురు, లాల్జీ వర్మ, రామ్ అచల్ సహా మొత్తం 11మంది ఎమ్మెల్యేలను మాయావతి బహిష్కరించిన సంగతి తెలిసిందే. 2019లో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో ఇపుడు 7 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. చదవండి: ట్విటర్‌కు మరోసారి నోటీసులు -
వెనక్కి రండి.. గెహ్లాత్ రాజీమంత్రం
జైసల్మీర్/జైపూర్ : రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు మానుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రధాని మోదీని అభ్యర్థించారు. సచిన్ పైలట్ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలను హైకమాండ్ క్షమిస్తే వారిని అక్కున చేర్చుకుంటానని చెప్పారు. ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జైసల్మీర్‌లోని సూర్యగఢ్ రిసార్టుకి తరలించిన విషయం తెలిసిందే. వారితో పాటు ఒక రోజంతా గడిపిన గహ్లోత్ జైపూర్‌కి వెనక్కి తిరిగి రావడానికి ముందు విలేకరులతో మాట్లాడారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తే సాదరంగా ఆహ్వానిస్తానన్న గహ్లోత్ హైకమాండ్‌దే తుది నిర్ణయమని చెప్పారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్‌లు ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రలో ఉన్నారని ఆరోపించారు. నైతిక విలువలకు కట్టుబడి షెకావత్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు 19 మంది సహా కాంగ్రెస్ బలం 107 కాగా, బీజేపీకి 72 స్థానాలున్నాయి. -
హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వొచ్చు
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కొంత ఊరట లభించింది. వారిపై అనర్హత వేటు వేసే ప్రక్రియను ప్రారంభిస్తూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసును వ్యతిరేకిస్తూ వారంతా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో అనర్హత చర్యల విషయంలో జూలై 24 వరకు స్పీకర్‌ను నిరోధిస్తూ రాజస్తాన్ హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ స్పీకర్ సి.పి.జోషి సుప్రీంకోర్టులో బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవై, జస్టిస్ కృష్ణ మురారీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 19 మంది ఎమ్మెల్యేల వినతిపై తదుపరి ఉత్తర్వు ఇవ్వడానికి రాజస్తాన్ హైకోర్టుకు అనుమతి మంజూరు చేసింది. అయితే, ఈ ఉత్తర్వు స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఉత్తర్వు ఇవ్వకుండా హైకోర్టును తాము అడ్డుకోలేమని వెల్లడించింది. అంతేకాకుండా అనర్హత వేటు విషయంలో తనను నిరోధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే ఇవ్వాలన్న స్పీకర్ వినతిని ధర్మాసనం తోసిపుచ్చింది. అసమ్మతి గొంతు నొక్కేయలేం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం చట్ట సభల సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని స్పీకర్ సి.పి.జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. స్పీకర్ ముఖ్యమైన ప్రశ్నలను లెవనెత్తారని, దీనిపై మరింత విచారణ జరగాల్సి ఉందని తేల్చిచెప్పింది. స్పీకర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, వారు సొంత ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీనిపై ధర్మాసనం బదులిస్తూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసమ్మతి స్వరాన్ని నొక్కేయలేమని వ్యాఖ్యానించింది. స్పీకర్ పిటిషన్‌పై విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. 19 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌పై రాజస్తాన్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వు జారీ చేయనుంది. షెకావత్‌పై విచారణ జరపండి సంజీవని క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హస్తం ఉందని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదుపై విచారణ జరపాలని జైపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టు రాజస్తాన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సొసైటీలో వేలాది మంది సొమ్ము మదుపు చేశారు. సొసైటీ నిర్వాహకులు ఇందులో రూ.900 కోట్లను మింగేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) దర్యాప్తు చేస్తోంది. 2019 ఆగస్టు 23న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఇందులో షెకావత్ పేరును చేర్చలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గులామ్సింగ్, లాబూ సింగ్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు. సహకార సొసైటీ కుంభకోణంలో పాత్రదారులైన కేంద్ర మంత్రిని, మరికొందరిని ఎస్ఓజీ ఉద్దేశపూర్వకంగానే రక్షిస్తోందని ఫిర్యాదుదారులుఆరోపిస్తున్నారు. టేపులను విదేశాలకు పంపిస్తాం: గహ్లోత్ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కుట్ర పన్నారని సీఎం గహ్లోత్ మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఆయన మాట్లాడినట్టుగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులు ముమ్మాటికీ నిజమైనవేనని ఉద్ఘాటించారు. ఫోరెన్సిక్ టెస్టు కోసం వాటిని విదేశాల్లోని సైన్స్ ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు. షెకావత్ ఏ తప్పూ చేయకపోతే స్వర నమూనా ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వానికి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సచిన్ పైలట్ వర్గం కోర్టును ఆశ్రయించడంపై ఆయన స్పందిస్తూ.. వారంతా కోర్టుకు వెళ్లి తప్పు చేశారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంతో న్యాయస్థానానికి సంబంధం లేదని గుర్తుచేశారు. -
అనర్హతపై కోర్టు జోక్యమా?
న్యూఢిల్లీ: స్పీకర్ ముందు పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ఎప్పుడూ ఊహించలేనిదని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పేర్కొన్నారు. ఇది అంతిమంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే విషయంలో ఈనెల 24వరకు తనను నిరోధిస్తూ రాష్ట్రహైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 21న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే విధించాలని కోరారు. తమ పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో ఉన్న ఆర్టికల్ 212లో పేరా 6(2) ప్రకారం స్పీకర్ తీసుకునే చర్యల్లో(చట్టసభ సభ్యులపై అనర్హత వేటుకు సంబంధించి) న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది స్పీకర్ అధికారాలను తగ్గించి వేయడమే అవుతుందన్నారు. స్పీకర్ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జూలై 23న విచారణకు వచ్చే పిటిషన్ల జాబితాలో దీన్ని చేర్చింది. ఈ సమాచారాన్ని తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. స్పీకర్ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు రాజస్తాన్ శాసన సభ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై తన వాదన, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేల వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కోర్టులో కేవియెట్ దాఖలు చేశారు. జోషి పిటిషన్‌పై ఇప్పుడే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని, తమ వాదన సైతం వినాలని సచిన్ పైలట్ కోరుతున్నారు. తప్పుడు ఆరోపణలపై క్షమాపణ చెప్పు బీజేపీలో చేరాలంటూ తనకు రూ.కోట్లు ఎర చూపారని సంచలన ఆరోపణలు చేసిన రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్ మాలింగకు మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బుధవారం తన అడ్వొకేట్ ద్వారా నోటీసు జారీ చేశారు. మాలింగ అబద్ధాలకోరు అని దుయ్యబట్టారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను ప్రసార మాధ్యమాల సమక్షంలో లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని, ఒక రూపాయి చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై వారం రోజుల్లోగా స్పందించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 2019 డిసెంబర్లో సచిన్ పైలట్ నివాసంలోనే తనను ప్రలోభాలకు గురి చేశారని గిరిరాజ్‌సింగ్ మాలింగ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, 7 నెలలుగా ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారో, ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. మాలింగ ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ క్యాంపులో ఉన్నారు. సచిన్ పైలట్ నుంచి తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసు రాలేదని, దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని మాలింగ చెప్పారు. మోదీకి గహ్లోత్ లేఖ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని సీఎం గహ్లోత్ ఆరోపించారు. కుట్రదారుల్లో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తూ ఆదివారం ఒక లేఖ రాశారు. ‘ఇదంతా మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ, కొందరు మమ్మిల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేయాలనుకోవడం ప్రజాతీర్పును అపహాస్యం చేయడం, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే అవుతుందన్నారు. గత ఏడాది కాలంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి అనుచిత ఘటనలే చోటుచేసుకున్నాయని అశోక్ గహ్లోత్ గుర్తుచేశారు. గహ్లోత్ సోదరుడి నివాసాలపై ఈడీ దాడులు 2007–09 నాటి ఎరువుల కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడు, విత్తనాలు, ఎరువుల సంస్థ ‘అనుపమ్ కృషి’ వ్యవస్థాపకుడు అగ్రసేన్ గహ్లోత్ నివాసాలతోపాటు దేశవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బధవారం దాడులు నిర్వహించింది. అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. జోద్పూర్ జిల్లాలోని మాందోర్ ప్రాంతంలో ఉన్న అగ్రసేన్ ఇల్లు, ఫామ్‌హౌస్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్ల రక్షణ మధ్య ఈ సోదాలు జరిగాయి. అగ్రసేన్తో సంబంధాలున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ నివాసం, ఇద్దరు రాజస్తాన్ కాంగ్రెస్ నాయకులు, మరో వ్యాపార సంస్థపైనా ఈడీ దాడులు జరిగాయి. రాజస్తాన్‌లో 6 ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్లో 2, గుజరాత్లో 4, ఢిల్లీలో ఒక ప్రాంతంలో దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రాజస్తాన్‌లో 2007– 09లో మారియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ)ను రైతులపై రాయితీపై సరఫరా చేశారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, రూ.60 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఈడీ ఫిర్యాదు మేరకు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద(పీఎంఎల్ఏ) కేసు నమోదైంది. దాడులతో బెదిరించలేరు: సూర్జేవాలా మోదీ దేశంలో దాడుల రాజ్యం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బుధవారం మండిపడ్డారు. ఈ దాడులకు తమ పార్టీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ఎమ్మెల్యేలు, ప్రజలు బీజేపీలో పన్నిన ఉచ్చులో చిక్కుకోలేదని పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడి నివాసంపై దాడులు ప్రారంభించారని ఆరోపించారు. -
సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట
-
రాజస్తాన్: సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన అసమ్మతి నేత సచిన్ పైలట్‌కు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 24 వరకు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్‌ను ఆదేశించింది. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన అనంతరం ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇక రాజస్తాన్ మంత్రివర్గం కాసేపట్లో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కాగా, అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసన సభా పక్షం రెండు భేటీలకూ వారు హాజరు కాలేదు. దాంతో సచిన్ సహా 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హతన వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విప్ ధిక్కరణపై స్పీకర్ సీపీ జోషి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, నిబంధనలు అనుసరించకుండా తమకు నోటీసులు ఇచ్చారని పేర్కొంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు కోర్టు మెట్లెక్కారు. (చదవండి: అసమర్థుడు.. పనికిరాని వాడు!) (ఛత్తీస్‌గఢ్ సీఎంపై మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా) -
హైకోర్టుకు సచిన్ వర్గం
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ పంపిన ‘అనర్హత’ నోటీసులపై కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గమైన 18 మంది ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. సీఎల్పీ భేటీలకు హాజరుకావాలన్న పార్టీ విప్‌ను ధిక్కరించడంతో పాటు పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ సచిన్ సహా 19 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి స్పీకర్ సీపీ జోషిని కోరడంతో.. ఆయన ఆ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై శుక్రవారం లోగా స్పందించాలని వారిని ఆదేశించారు. అయితే, ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్ సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మాత్రమే పార్టీ విప్‌లకు విలువ ఉంటుందని పైలట్ వర్గం అందులో పేర్కొంది. ఈ పిటిషన్ మొదట గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. పైలట్, సహ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే పిటిషన్లో పలు మార్పులు చేయాల్సి ఉందని, మరో పిటిషన్ దాఖలుకు సమయం కావాలని కోరారు. దాంతో జడ్జి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. మార్పులు చేసిన పిటిషన్‌ను దాఖలు చేసిన తరువాత.. విచారణను ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్‌కు బదిలీ చేశారు. డివిజన్ బెంచ్ నేడు (శుక్రవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు విచారించనుంది. అనర్హత పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు పైలట్ వర్గానికి స్పీకర్ ఇచ్చిన సమయం కూడా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటే కావడం గమనార్హం. అనర్హులుగా ప్రకటిస్తే.. ఈ 19 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తే.. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. అప్పుడు మెజారిటీకి అవసరమైన సభ్యుల సంఖ్య 91కి తగ్గుతుంది. సీఎం గహ్లోత్‌కు ఇది మరింత ప్రయోజనకరమవుతుంది. ‘అనర్హత’పై మళ్లీ చర్చ న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే విషయంలో స్పీకర్‌కున్న అధికారాలు రాజస్తాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా పలు విభిన్న తీర్పులను ప్రకటించింది. ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని ఒక సందర్భంలో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. మరో సందర్భంలో స్పీకర్ స్థానాన్ని తామే తీసుకుని ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించింది. 2011లో కర్ణాటకకు సంబంధించిన ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సచిన్ పైలట్ వర్గానికి అనుకూలంగా ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. నాడు, అప్పటి సీఎం యెడియూరప్పను వ్యతిరేకించిన 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన బెట్టింది. ఈ తీర్పును ప్రస్తావిస్తూ.. ‘పైలట్, ఆయన సహచర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం కానీ, చేరుతామని ప్రకటించడం కానీ చేయలేదు. అందువల్ల అనర్హత నోటీసుల జారీ అన్యాయం. రాజ్యాంగవిరుద్ధం’ అని రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు, సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది పేర్కొన్నారు. సభాధ్యక్షుడిగా అనర్హత నోటీసులు జారీ చేసే హక్కు, అధికారం స్పీకర్‌కు ఉంటాయని మరో సీనియర్ న్యాయవాది అజిత్ సిన్హా వ్యాఖ్యానించారు. అయితే, స్పీకర్‌కున్న ఈ అధికారాల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు చాలా సందర్భాల్లో ఆచితూచి వ్యవహరించాయి. -
ఎమ్మెల్యేలను నిర్బంధించవద్దు
భోపాల్/న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వేదికగా మధ్యప్రదేశ్ రాజకీయం బుధవారం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగాయి. కమల్‌నాథ్ ప్రభుత్వం మనుగడ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల చేతుల్లో ఉందని కోర్టు అంగీకరిస్తూనే.. బలపరీక్షను నిర్ణయించే అసెంబ్లీ కార్యకలాపాల్లోకి తాము రాదల్చుకోలేదని స్పష్టంచేసింది. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలు వారి ఇష్టప్రకారం స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఎలాంటి పరిస్థితులు కల్పిస్తారని ప్రశ్నించింది. ‘రెబెల్ ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లాలా లేదా అనేది వారి ఇష్టం. వారిని నిర్బంధంలో ఉంచారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వారు స్వేచ్ఛగా ఉన్నారా లేదా అనేది మేము చూడాలి. వారిని నిర్బంధంలో ఉంచకూడదు’అని స్పష్టంచేసింది. రెబెల్ ఎమ్మెల్యేలను గురువారం జడ్జి చాంబర్లో హాజరుపరుస్తామని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చింది. వారు నిర్బంధంలో లేరని ఎలా నమ్మాలో చెప్పాలంటూ చౌహాన్ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీని అడిగింది. అయితే వారు స్వచ్ఛందంగానే బెంగళూరులో ఉన్నారని, నిర్బంధంలో లేరని ఆయన సమాధానం ఇచ్చారు. రెబెల్ ఎమ్మెల్యేల లాయర్ మణిందర్ సింగ్ కల్పించుకొని, స్పీకర్ ముందుకు తమ ఎమ్మెల్యేలు రాబోవడం లేదని, కొందరి రాజీనామాలను స్వీకరించి మరికొందరివి ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచిందని, వారిని కలిసేందుకు అనుమతించేలా కేంద్రానికి, కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేయగా.. రాజ్యాంగపరంగా ఎదురయ్యే అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేగానీ.. కాంగ్రెస్ నేతలతో కలవబోమని తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాదించారు. బీజేపీ హిట్లర్ పోకడ: కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలున్న∙రిసార్ట్ వద్ద ఆ పార్టీ నేత దిగ్విజయ్‌సింగ్ ఆందోళనకు దిగగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిగ్విజయ్‌ను అరెస్ట్ చేయడం బీజేపీ హిట్లర్ తరహా నియంతృత్వ పోకడలకు నిదర్శనమని సీఎం కమల్‌నాథ్ అన్నారు. ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్.. అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతిని కొనియాడారు. -
అమృతహల్లి పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ సింగ్
-
దిగ్విజయ్, శివకుమార్ అరెస్ట్!
బెంగళూరు : మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరపాలన్న విషయంపై వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా బెంగళూరులో మకాం వేసిన 21మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రమాడ హోటల్లో తలదాచుకున్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బెంగళూరు వెళ్లారు. కర్ణాటక కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు శివ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారు హోటల్ దగ్గరకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లటానికి వీళ్లేదంటూ బయటే ఆపేశారు. దీంతో ఆగ్రహించిన దిగ్విజయ్ హోటల్ బయట ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్, శివకుమార్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలను అమృతహల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ( రిసార్టు రాజకీయాలకు కేరాఫ్ కర్ణాటక ) అంతకు క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిని. ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. మా ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేశారు. వాళ్లు నాతో మాట్లాడాలనుకుంటున్నారు. వారి ఫోన్లను లాక్కున్నారు. పోలీసులు కూడా నన్ను వారితో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారు. వాళ్లు వెనక్కు తిరిగి వస్తారని అనుకున్నాం. కానీ, వాళ్లను వెనక్కు రానీయటంలేదు. వారి కుటుంబసభ్యుల దగ్గరినుంచి సందేశాలు వస్తున్నాయి. నేను ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడాను. వారిని నిర్భందంలో ఉంచారని చెప్పారు. సెల్ఫోన్లు దొంగలించారట! ప్రతి రూము దగ్గర పోలీసు బందోబస్తు ఉంది. ప్రతి నిమిషం వారి వెన్నంటే ఉంటున్నార’’ని చెప్పారు. ( బలపరీక్షపై వైఖరేంటి? ) -
ఆ 22 మందికి నోటీసులు
భోపాల్/న్యూఢిల్లీ/బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కల్లా తన ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. స్వచ్ఛందంగానా లేక.. ఎవరి ఒత్తిడితోనైనా రాజీనామా చేశారా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని వారిని కోరారు. ఆ తర్వాతే సభలో బల పరీక్ష చేపడతామని స్పీకర్ తెలిపారు. బల నిరూపణకు సిద్ధమని సీఎం కమల్‌నాథ్ ఇంతకుముందే తెలిపారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, పార్టీని వీడిన ఆరుగురు మంత్రులు సహా 22 మంది సభ్యుల రాజీనామాల విషయం తేలాకే బలపరీక్ష ఉంటుందన్నారు. రాజీనామాలు చేసిన వారంతా స్పీకర్‌ను ఎందుకు కలుసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి బీజేపీయే కారణమన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో భోపాల్ చేరుకున్న జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ కార్యకర్తలు, సింధియా అనుచరులు ఘనస్వాగతం పలికారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోకి ఆయన్ను మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సింధియా మీడియాతో మాట్లాడుతూ..బీజేపీలోకి చేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. బెంగళూరులో హైడ్రామా బెంగళూరు పోలీసులు తమ మంత్రులను ఇద్దరిని అరెస్టు చేశారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీ, న్యాయవాది అయిన వివేక్ తంఖా మాట్లాడుతూ.. ‘బెంగళూరు రిసార్టులో ఉన్న ఎమ్మెల్యే మనోజ్ చౌదరితో మాట్లాడేందుకు ఆయన తండ్రితో కలిసి మంత్రులు జితు పట్వారీ, లఖన్ సింగ్ వెళ్లారు. బెంగళూరు పోలీసులు వారిని రిసార్టులోపలికి వెళ్లనివ్వలేదు. వారిపై దాడి చేసి, అరెస్టు చేశారు. మనోజ్ తన తండ్రితో కలిసి భోపాల్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, రానివ్వడం లేదు. దీనిపై మేం సుప్రీంకోర్టుకు వెళతాం’ అని ఆయన వెల్లడించారు. కాగా, పట్వారీ అక్కడి పోలీసులతో వాదులాడుతున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. రాజీనామా చేసిన 22 మందిలో 19 మంది బెంగళూరులోనూ మిగతా వారు మధ్యప్రదేశ్‌లోనూ ఉన్నట్లు సమాచారం. బల పరీక్షకు బీజేపీ డిమాండ్ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో అసెంబ్లీలో సర్కారు బలం నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అందుకే, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నెల 16వ తేదీన సభలో బల నిరూపణ జరపాలని స్పీకర్‌ను, గవర్నర్‌ను కోరతాం’ అని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తు గురించి భయపడ్డారు: రాహుల్ తన రాజకీయ భవిష్యత్తు గురించి భయపడుతున్నందునే సింధియా నమ్ముకున్న సిద్ధాంతాలను మర్చిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘ఆయన బయటకు చెప్పే దానికి వాస్తవ కారణాలకు చాలా తేడా ఉంది. ఆయన నా చిరకాల మిత్రుడు. కాలేజీ రోజుల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. తన రాజకీయ భవిష్యత్తు గురించిన భయం వల్లే సిద్ధాంతాలను పక్కనబెట్టి ఆర్ఎస్ఎస్(బీజేపీ)లోకి వెళ్లారు. అయితే, ఆయనకు అక్కడ గౌరవం లభించదు. ఆ పార్టీలో ఆయన సంతృప్తికరంగా ఉండలేరు’ అని అన్నారు. -
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ కండువా
సాక్షి, బెంగళూరు: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కన్నడనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. అనర్హుల్లో రోషన్ బేగ్ తప్ప అందరూ అధికార బీజేపీలో చేరారు. వీరు డిసెంబరులో జరిగే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేల్లో 17 మందికి గాను 16 మందికి గురువారం బెంగళూరులో బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యడియూరప్ప కాషాయ కండువా కప్పారు. బెంగళూరు శివాజీనగర కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను బీజేపీలోకి ఆహ్వానించలేదు. టికెట్ కూడా ఇవ్వలేదు. కాగా, కొత్త నేతల రాకను బీజేపీ స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బుజ్జగించడం యడ్యూరప్ప ముందున్న ప్రధాన కర్తవ్యంగా మారింది. -
కర్ణాటకం : రెబెల్స్‌కు బంపర్ ఆఫర్
బెంగళూర్ : అనర్హత వేటుకు గురైన రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. డిసెంబర్ 5న జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వారిని బీజేపీ తమ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిపింది. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనర్హులుగా స్పీకర్ ప్రకటించిన క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక జేడీఎస్, కాంగ్రెస్ రెబెల్స్ మహేష్ కుమతల్లి, శ్రీమంతగౌడ పాటిల్, రమేష్ జర్కిహోలి, శివరాం హెబ్బర్, బీసీ పాటిల్, ఆనంద్ సింగ్, కే సుధాకర్, భైరతి బసవరాజ్, ఎస్టీ సోమశేఖర్, కే గోపాలయ్య, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారాయణ గౌడ, హెచ్ విశ్వనాధ్‌లు ఈసారి బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. వీరిపై అనర్హత వేటును సుప్రీం కోర్టు గురువారం సమర్ధిస్తూ 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెబెల్ ఎమ్మెల్యేలపై నిషేధం విధించిన స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఉత్తర్వులను తోసిపుచ్చింది. కోర్టు నిర్ణయం వెలువడిన మరుక్షణమే తాము బీజేపీలో చేరుతామని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎన్నికలు జరిగే 15 స్ధానాల్లో బీజేపీ గెలుపొందుతుందని వీరంతా కాబోయే ఎమ్మెల్యేలు, మంత్రులని వీరి త్యాగాల ఫలితంగానే తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిందని ముఖ్యమంత్రి యడియూరప్ప పేర్కొన్నారు. -
అనర్హులే.. కానీ పోటీ చేయొచ్చు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని బుధవారం సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆ ఎమ్మెల్యేలు రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొంటూ స్పీకర్రమేశ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు పోటీ చేసే అవకాశం లేదన్న భాగాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నికల్లో గెలిస్తే వారు మంత్రులూ కావచ్చని పేర్కొంది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో జూలై నెలలో యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఎమ్మెల్యేలు నేడు(గురువారం) బీజేపీలో చేరనున్నారని సీఎం యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ద్వారా సంక్రమించిన అధికారాలను స్పీకర్ ఉపయోగించిన విషయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ‘ఎంత కాలం అనర్హులుగా ప్రకటించాలనే విషయంలో కానీ, ఎన్నికల్లో పోటీ చేయరాదనే విషయంలో కానీ స్పీకర్‌కు అధికారం లేదు’ అని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న రాజ్యాంగ ధర్మానికి వ్యతిరేకంగా స్పీకర్లు వ్యవహరించడం ఎక్కువైందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అవినీతికి పాల్పడటం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం వంటి చర్యల వల్ల పౌరులు స్థిర ప్రభుత్వాన్ని పొందే హక్కును కోల్పోతున్నారని పేర్కొంది. ‘ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, వారు స్వచ్చంధంగానే చేశారా? అనే విషయాన్ని మాత్రమే స్పీకర్ పరిగణనలోకి తీసుకుని, ఆ రాజీనామాను ఆమోదించడమో, లేక తిరస్కరించడమో చేయాలి’ అని కోర్టు పేర్కొంది. ‘స్వచ్చంధంగానే రాజీనామా చేసినట్లు తేలితే, ఆ రాజీనామాను ఆమోదించడం మినహా స్పీకర్‌కు మరో మార్గం లేదు. ఆ రాజీనామాను ఆమోదించే విషయంలో సంబంధం లేని ఇతర అంశాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగపరంగా ఆమోదనీయం కాదు. స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు అర్హమైనదే’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేలు మొదట హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టునే ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టును ఆశ్రయించి, ఆ తీర్పుపై సంతృప్తి చెందనట్లయితేనే, సుప్రీంకోర్టును ఆశ్రయించడం çసరైనదని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 5న ఉప ఎన్నికలు తమను అనర్హ ఎమ్మెల్యేలుగా స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తాజా తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లకు డిసెంబర్ 5వ తేదీని ఉప ఎన్నికలు జరగనున్నాయి. 18 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ‘ఆ’ ఎమ్మెల్యేలపై కఠిన విధానం సరికాదు పార్టీ ధిక్కరణకు పాల్పడే చట్ట సభల సభ్యులపై కఠినమైన అనర్హత విధానాన్ని తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దానివల్ల న్యాయమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఆటంకం కలుగుతుందని కాబట్టి అది ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. పార్టీ విధానాన్ని ధిక్కరించే, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఒక కఠిన విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు జారీ చేయలన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. కర్ణాటకకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవేళ అలాంటి విధానమేదైనా తీసుకురావాలన్నా.. అది శాసన వ్యవస్థ చేయాల్సిన విధి. ఆ పని కోర్టులు చేయలేవు’ అని పేర్కొంది. విశ్వాస పరీక్షకు ముందే... జూలై 23న కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నేపథ్యంలో... విప్‌ను వ్యతిరేకించే అవకాశమున్న కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. తరవాత జరిగిన విశ్వాస పరీక్షలో గెలవకపోవడంతో కుమార స్వామి రాజీనామా చేశారు. జూలై 29న∙విశ్వాస పరీక్షలో నెగ్గి, యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతతో అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య 225 నుంచి 208కి తగ్గింది. మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 105కి చేరింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, తమ 105 మంది ఎమ్మెల్యేల మద్దతుతో యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. -
కర్ణాటకం : బీజేపీ గూటికి ఆ 17 మంది ఎమ్మెల్యేలు
బెంగళూర్ : అనర్హత వేటుకు గురైన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం బీజేపీలో చేరతారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో వారికి బీజేపీ టికెట్లను కట్టబెట్టనున్నారు. పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదించి వారికి టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సమర్ధించిన సుప్రీం కోర్టు డిసెంబర్ 5న జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారు అర్హులేనని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును స్వాగతించిన యడియూరప్ప రెబెల్ ఎమ్మెల్యేలు కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని చెప్పారు. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే 15 నియోజకవర్గాల్లో గురువారం నుంచి ఎన్నికల ప్రచారం చేపడతామని యడియూరప్ప తెలిపారు. అన్ని సీట్లలో తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా బీజేపీకి ఏమాత్రం నైతిక విలువలు మిగిలిఉన్నా అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరాదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు వ్యాఖ్యానించారు. మరోవైపు తామంతా గురువారం బీజేపీలో చేరతామని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే రమేష్ జర్కిహోలి ధ్రువీకరించారు. ఇక కర్ణాటక ఉప ఎన్నికల నామినేషన్ల గడువును పెంచినట్టు ఈసీ పేర్కొంది, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీం తీర్పు నేపథ్యంలో వారు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తూ ఈ వెసులుబాటు కల్పించింది. ఈనెల 18 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారని ఈసీ పేర్కొంది. -
రెబల్ ఎమ్మెల్యేలపై సంచలన తీర్పు
-
అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ: కర్ణాకటకు చెందిన 17మంది ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్‌కుమార్ విధించిన అనర్హత వేటును సమర్థిస్తూ సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించినప్పటికీ.. వారిపై స్పీకర్ విధించిన అనర్హతకాలాన్ని కొట్టివేసింది. ప్రస్తుత అసెంబ్లీ కాలం 2023 సంవత్సరం ముగిసేవరకు అనర్హత ఎమ్మెల్యేలు పోటీ చేయరాదని స్పీకర్ నిబంధన విధించగా.. ఈ నిబంధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో అనర్హతకు గురైన 17మంది ఎమ్మెల్యేలు రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ‘ఆర్టికల్ 193ని చర్చించిన అనంతరం అనర్హత అంశంలో మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అనర్హత అనేది.. చర్య జరిగిన కాలానికి మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి కొంతకాలంపాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చే అధికారం స్పీకర్‌కు లేదు’ అని న్యాయస్థానం అభిప్రాయపడింది. స్పీకర్ విధించిన అనర్హత వేటును మేం సమర్థిస్తున్నాం. అయితే, అనర్హత కాలాన్ని మాత్రం కొట్టివేస్తున్నాం’ అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ వ్యవహారంలో స్పీకర్ ‘క్వాసీ జ్యుడీషియల్ ఆథారిటీగా వ్యవహరించారని, అయితే ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా, లేదా? అన్నది మాత్రమే స్పీకర్ పరిధిలోకి వస్తుందని, ఈ విషయంలో స్పీకర్ అధికార పరిధి పరిమితమని ధర్మాసనం అభిప్రాయపడింది. గత జూలై నెలలో అప్పటి కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 17మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీనిపై సదరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ కృష్ణమురారీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి.. అక్టోబర్ 25న తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. -
కర్ణాటకలో ఉప ఎన్నికల నగారా
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. ఫలితాలు అదే నెల 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో సంజీవ్ కుమార్ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 19న నామినేషన్ల పరిశీలన, 21 వరకు ఉపసంహరణ ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలతో సహా జిల్లాల్లో కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ నియమావళి పోటీ చేసే అభ్యర్థులతో పాటు, రాజకీయ పార్టీలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. గత జూలైలో సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేసిన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్‌కుమార్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈసీ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. రాజరాజేశ్వరినగర, మస్కి నియోజకవర్గాలపై కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ ఎన్నికలు జరపడం లేదు. -
ఆ టేపులూ సాక్ష్యాలే: సుప్రీం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత కేసు మలుపు తిరిగింది. తమపై అనర్హత విధించడం సబబు కాదని ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉండటం తెల్సిందే. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తామే ముంబైకి పంపించామని సీఎం యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ టేపులనూ సాక్ష్యాలుగా తీసుకుంటామని సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. దీనికి ముందు ఈ టేపులను తీర్పు సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వాదించింది. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్–జేడీఎస్‌ల ప్రభుత్వాన్ని కూల్చారని సుప్రీంకు కాంగ్రెస్ కర్ణాటక విభాగం నివేదించింది. -
తిరుగుబాటు వ్యూహం అమిత్షాదే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకపాత్ర పోషించిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. దీనికి సంబంధించి యడియూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ 17 మంది విశ్వాస పరీక్షకు హాజరుకాకుండా ముంబైలోని ఓ స్టార్ హోటల్‌కు తరలించడం సహా అన్ని ఏర్పాట్లను బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా పర్యవేక్షించారని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ 17 మంది ఎమ్మెల్యేలు తమ కుటుంబాలను వదిలి రెండు మూడు నెలల పాటు ముంబైలో ఉన్నారు. వారంతా మన ప్రభుత్వ ఏర్పాటుకు సహాయం చేశారు. నన్ను నమ్మి వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. వాళ్లకు అన్యాయం చేసి సీఎం అయ్యి నేరం చేశాననే భావన నాలో కలుగుతుంది. మీకు ఈ విషయాలన్నీ తెలియవు. మనం వాళ్లకి అండగా ఉండాలి’అని యడియూరప్ప వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా: కుమారస్వామి యడియూరప్ప వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని కుమారస్వామి ఆరోపించారు. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో యడియూరప్ప తనంతట తానే వాస్తవాలను బయటపెట్టారని అన్నారు. ఈ విషయంలో వీడియో క్లిప్పింగుల ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని శనివారం చెప్పారు. -
కర్ణాటక ఫోన్‌ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ షురూ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు తెలిపారు. మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందంటూ పలువులు రెబెల్ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం కూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్ణాటకలోని 300 మందికి పైగా నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఎమ్మెల్యేలు ఆరోపించడంతో యడియూరప్ప ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణ కోరింది. ఇలా ఉండగా, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. రెండోరోజు రాత్రి 8.30 గంటల తర్వాత కూడా విచారించారు. -
ముగ్గురు రెబెల్స్‌పై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని స్పష్టం చేశారు. ప్రస్తుత శాసనసభ కాలం ముగిసే వరకూ (2023) వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, సభలో పదవులు చేపట్టేందుకు అనర్హులని తేల్చిచెప్పారు. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవటం తెలిసిందే. తన నిర్ణయంపై రెబెల్స్ కోర్టులకు వెళ్లే అవకాశముందన్నారు. ఆర్థిక బిల్లుకు గనక ఈ నెల 31లోగా ఆమోదం లభించకపోతే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు అసెంబ్లీని సస్పెండ్ చేయడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని చెప్పారాయన. మరోవైపు తమ రాజీనామాలపై స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు కావాలని రెబెల్స్ కోరారు. యెడ్డీ జోరుకు షా బ్రేక్.. బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప, నేతలు జగదీశ్ షెట్టర్, అరవింద్ లింబావలి, మధుస్వామి, బసవరాజ్ బొమ్మై గురువారం ఢిల్లీ చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అయితే మిగిలిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ తుది నిర్ణయం తీసుకున్న తరవాతే ముందుకెళ్లాలనీ, అప్పటివరకూ ఓపికపట్టాలని యడ్యూరప్పకు షా సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
కర్ణాటకం : అదే చివరి అస్త్రం..
బెంగళూర్ : కన్నడ రాజకీయాలు నాటకీయ మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల వినతిని స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ తోసిపుచ్చడంతో రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును చేపట్టేందుకు సంకీర్ణ నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితి ఫిరాయింపు నిరోధక చట్టం అమలుకు అనువుగా ఉందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు అన్నారు. అనర్హత పిటిషన్‌పై తమ తరపున తమ న్యాయవాది స్పీకర్ ఎదుట పదునైన వాదన వినిపించారని చెప్పారు. రెబెల్ ఎమ్మెల్యేలకు తమకు ద్రోహం తలపెట్టి అనర్హత వేటుకు గురయ్యేందుకు అర్హులయ్యారని అన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించేందుకు ఇది సరైన ఉదంతమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు విశ్వాస తీర్మానంపై ఓటింగ్ గండంపై ఆందోళనతో కాంగ్రెస్ నేత, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ వేదాంత ధోరణిలో మాట్లాడారు. బీజేపీ తీరును ఎండగడుతూ అందరం ఎప్పటికైనా తనువు చాలించాల్సిందేనని, మహా అయితే కొందరు రాత్రికి మరో రెండు పెగ్గులు అదనంగా తీసుకుంటారని అధికార దాహం తగదనే రీతిలో వ్యాఖ్యానించారు. ఇక విశ్వాస పరీక్షపై ఓటింగ్‌కు సంబంధించి స్పీకర్‌కు తాము ఆదేశాలు ఇవ్వలేమని రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం కోర్టు పేర్కొంది. బలపరీక్ష రెండ్రోజుల్లో జరుగుతుందని భావిస్తున్నామని, రేపు పిటిషన్‌పై విచారణను చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. -
‘ఏదో ఓ రోజు అందరం చావాల్సిందే’
బెంగళూరు: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై మంగళవారం తనకు వివరణ ఇవ్వాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించగా, అందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబెల్స్‌ని బుజ్జగించడానికి రంగంలోకి దిగిన ట్రబుల్షూటర్ డీకే శివకుమార్ తొలిసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం కూడా విశ్వాసపరీక్ష పూర్తయ్యేలా కనిపించకపోవడంతో శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘నేను ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా ఆపలేకతున్నానని భావిస్తున్నారా.. ప్రస్తుతం మీ పక్కన చేరిన ఎంటీబీ నాగరాజుకు టికెట్ ఇప్పించిందే నేనే. ఆ విషయం మర్చిపోకండి’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శివకుమార్ వేదాంత ధోరణిలో మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు వెన్నుపోటు పొడిచిన నా మిత్రులు.. రేపు బీజేపీకి కూడా వెన్నుపోటు పొడుస్తారు. ఏదో ఓ రోజు మనమంతా చావాల్సిన వాళ్లమే కదా. మధ్యలో వచ్చే ఈ టెన్షన్స్ను తట్టుకోవడానికి మహా అయితే రాత్రికి రెండు పెగ్గులు వేసి పడుకుంటాను అంతే. ఇంకేం చేస్తాను’ అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు శివకుమార్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు తమను కలవాల్సిందిగా నన్ను కోరారు. దాంతో నేను, కుమార స్వామి ముంబై వెళ్దామని భావించాం. కానీ అధికారులు సీఎం ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదన్నారు. దాంతో నేను, మరి కొందరితో కలిసి ముంబై వెళ్లాను. రెబెల్ ఎమ్మెల్యేలున్న హోటల్లోనే ఓ గది బుక్ చేశాను. కానీ నన్ను హోటల్లోకి అనుమతించలేదు. కనీసం స్నానం కూడా చేయకుండా ఆదరాబాదరా ముంబై వెళ్లాను. కానీ ఎమ్మెల్యేలు నన్ను కలవలేదు. పైగా వారంతా నా మీద కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా చూసి నేను షాక్ అయ్యాను’ అన్నారు. ‘ఈ ఎమ్మెల్యేలంతా లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా నాతో కలిసి పని చేశారు. నా అడుగుజాడల్లోనే నడుస్తామన్నారు. కానీ చివరకిలా చేశారు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్లో కూర్చోవడం చూశాను. అప్పుడే అక్కడికి వెళ్లి వారి రాజీనామాలను చింపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ అలా చేయలేకపోయాను’ అని వాపోయారు శివకుమార్. అయితే ఏదేమైనా ఇవాళ బలపరీక్ష నిర్వహిస్తానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకల్లా చర్చ ముగించాలని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి వచ్చిన సీఎం కుమార స్వామి తన ఛాంబర్‌లోనే ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎంకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ వెల్లడించారు. -
కర్నాటకంలో కాంగ్రెస్ సీఎం!
బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్ణాటకలో రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ తీరునచ్చకే తాము రాజీనామా చేస్తున్నామని పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో శివకుమార్ ఈ ప్రకటన చేశారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నాతో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర, సీఎల్పీ నేత సిద్దరామయ్యల్లో ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా తమకు అభ్యంతరం లేదని జేడీఎస్ నేతలు చెప్పారు. మా ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానికి అప్పగించారు’ అని చెప్పారు. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారంతో ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: రెబెల్స్ ముంబైలోని రినైసెన్స్ హోటల్లో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేలు శివకుమార్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ మేరకు రెబెల్ ఎమ్మెల్యేలు ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య అనుచరుడు, ఎమ్మెల్యే బైరాతి బసవరాజ్ మాట్లాడుతూ..‘‘సంకీర్ణ ప్రభుత్వంలో మా ఆత్మగౌరవం దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు సిద్దరామయ్యను సీఎం చేసినా మేం రాజీనామాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఎవ్వరూ నిర్బంధించలేదు. ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉంటున్నాం. మేం డబ్బు లేదా వేరేవాటి కోసం ఇక్కడకు రాలేదు. కుమారస్వామి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే వచ్చాం. పరిస్థితులు సద్దుమణిగాక బెంగళూరుకు తిరిగివెళ్లిపోతాం’ అని తెలిపారు. కలవరపెట్టిన బీఎస్పీ ఎమ్మెల్యే.. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ సంకీర్ణ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు వెళ్లొద్దని పార్టీ అధినేత్రి మాయావతి తనను ఆదేశించారని మహేశ్ తెలిపారు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్పందించిన మాయావతి, కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా ఆదేశించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరులోని ‘తాజ్వివంత హోటల్’లో, బీజేపీ నేతలు ‘హోటల్ రమద’లో సమావేశమై చర్చించారు. ‘సుప్రీం’లో స్వతంత్రుల పిటిషన్.. బీజేపీకి ఇటీవల మద్దతు ప్రకటించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్లు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయమై స్వతంత్ర ఎమ్మెల్యేల న్యాయవాది మాట్లాడుతూ..‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేయబోతున్నట్లు చెప్పారు. కాగా, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారమే విచారించే అవకాశముందని సమాచారం. సర్కారుకు ఆఖరిరోజు: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నేడే ఆఖరిరోజని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య, స్పీకర్ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ చేపడతామని చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం రేపటికల్లా ఓ ముగింపుకొస్తుందని విశ్వాసంతో ఉన్నా. సోమవారమే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు అవుతుందని నాకు నమ్మకముంది’ అని యడ్యూరప్ప చెప్పారు. దయచేసి వెనక్కి రండి: సీఎం ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసిన రెబెల్స్ అంతా వెనక్కు రావాలని సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ‘నైతికత గురించి మాట్లాడే బీజేపీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోంది.ఈ విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలా చేసేందుకే అసెంబ్లీలో చర్చకు సమయం కోరాను. మీరంతా(రెబెల్స్) వెనక్కురండి. సమస్యలను మనం కలిసి కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరై బీజేపీ అసలు రూపాన్ని బట్టబయలు చేయండి’ అని కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఎవరి బలమెంత? కర్ణాటక అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ప్రస్తుతం 117 ఎమ్మెల్యేలు(స్పీకర్, నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని) ఉండగా, వీరిలో 15 మంది పదవు లకు రాజీనామా చేశారు. అదేసమయంలో 105 స్థానాలున్న బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో 107కు చేరుకుంది. ఒకవేళ 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం సభకు రాకపోయినా లేక వారిపై అనర్హత వేటుపడ్డా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 210కి చేరుకుంటుంది. అప్పుడు ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం 103కు తగ్గిపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. దీంతో ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది. -
ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఈ 15 మందిని విశ్వాసపరీక్షకు హాజరుకావాల్సిందిగా ఆదేశించలేరని సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. విశ్వాసపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది ఎమ్మెల్యేల ఇష్టమంది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో స్పీకర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 190, 208 కర్ణాటక అసెంబ్లీ నియమ నిబంధనలు (రెడ్‌విత్ 202ను) అనుసరించి నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. ఈ వ్యవహారంలో స్పీకర్ తన విచక్షణాధికారం మేరకు, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనీ, నిర్ణీత కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని తాము ఆదేశించబోమనితేల్చిచెప్పింది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఆ వివరాలను స్పీకర్ తమకు సమర్పించాలని ఆదేశించింది. స్పీకర్ తొలుత రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలా? లేక రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలా?లేక రెండింటిని ఒకేసారి పరిశీలించాలా? అనేది తర్వాతి దశలో విచారణ చేపడతాం’ అని కోర్టు తెలిపింది. అసెంబ్లీలో అడుగుపెట్టబోం: ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ విషయమై రెబెల్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ మాట్లాడుతూ.. ‘రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మేం విశ్వాసపరీక్ష కోసం గురువారం అసెంబ్లీలో అడుగుపెట్టబోం’ అని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పును తప్పుపట్టిన కాంగ్రెస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రజాతీర్పును తుంగలోతొక్కిన ఎమ్మెల్యేలకు రక్షణ కవచంలా సుప్రీం తీర్పుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. ఈ ఉత్తర్వులతో రాజకీయ పార్టీలు జారీచేసే విప్‌లు చెల్లకుండాపోతాయనీ, దేశంలోని కోర్టుల ముందు ప్రమాదకరమైన ఉదాహరణను అత్యున్నత న్యాయస్థానం ఉంచిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఓటేస్తా: రామలింగారెడ్డి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటాననీ, గురువారం జరిగే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ రామలింగారెడ్డి ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు వెళ్లలేదు. తీర్పును స్వాగతిస్తున్నా: స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ తెలిపారు. ‘అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు నాపై అదనపు భారాన్ని ఉంచింది. రాజ్యాంగంలోని నియమనిబంధనలకు అనుగుణంగా>, బాధ్యతతో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాను’ అని స్పీకర్ చెప్పారు. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మద్దతును కూడగట్టుకునేందుకు విశ్వాసపరీక్షను కొద్దికాలం వాయిదావేయాలని కోరినట్లు సమాచారం. కాగా, ఈ భేటీ అనంతరం బీజేపీ నేతలు బోపయ్య, మధుస్వామి తదితరులు స్పీకర్‌ను కలుసుకుని విశ్వాసపరీక్షను వాయిదా వేయొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే గురువారం బలపరీక్ష జరుగుతుందనీ, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. విశ్వాస పరీక్ష నేడే కర్ణాటక అసెంబ్లీలో నేడు విశ్వాసపరీక్ష జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు వెనక్కిరాకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కొనసాగడంపై నీలినీడలు అలుముకున్నాయి. 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా, ఇటీవల ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో అది 107కు చేరుకుంది. ప్రస్తుతం రామలింగారెడ్డిని మినహాయించి 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు గైర్హాజరైనా అసెంబ్లీలో అధికార కూటమి బలం 102కి పడిపోనుంది. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. -
రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై రేపు సుప్రీం తీర్పు
బెంగళూర్ : కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి దారితీసిన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌కు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహరంపై సర్వోన్నత న్యాయస్ధానంలో మంగళవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును బుధవారానికి రిజర్వ్ చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు న్యాయస్ధానం తీర్పు వెలువరించనుంది. రెబెల్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఎమ్మెల్యేలు తమకు తాముగా రాజీనామాలు చేసి స్వయంగా స్పీకర్‌ను కలిసి వివరించినా వారి రాజీనామాలను ఆమోదించలేదని, వారిపై అనర్హత వేటు వేసేందుకే స్పీకర్ కాలయాపన చేస్తున్నారని అన్నారు. నిబంధనల ప్రకారం నిర్ణయం సత్వరమే తీసుకోవాలని , తమ ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీకి రావాలని కోరే హక్కు స్పీకర్‌కు లేదని కోర్టుకు నివేదించారు. రాజీనామా చేయడం ఎమ్మెల్యేల ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోకుండా విశ్వాస పరీక్షలో తాము విధిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేలా స్పీకర్ వ్యవహరిస్తున్నారని రెబెల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఇక స్పీకర్ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత, రాజీనామాలపై స్పీకర్ బుధవారం నిర్ణయం తీసుకోనున్నందున వీరి రాజీనామాలపై న్యాయస్ధానం గతంలో విధించిన యథాతథ స్ధితిని సమీక్షించాలని కోరారు. ఇక బల పరీక్షకు సంబంధించిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్, చర్చల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదని గురువారం అసెంబ్లీలో దీనిపై పూర్తి స్థాయి చర్చ ఉంటుందని, ఆయా ఎమ్మెల్యేలు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కర్ణాటక సీఎం కుమారస్వామి తరపున న్యాయవాది రాజీవ్ ధావన్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూలదోసి ఉద్దేశంతో రాజీనామాలు చేస్తే వాటిపై కచ్చితంగా స్పీకర్ విచారణ చేసి నిర్ణయం తీసుకుంటారని, ఈ అంశాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే న్యాయపరిధి లేదని వాదించారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటుపై రేపు ఓ నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఆర్ సురేష్ కుమార్ సుప్రీం కోర్టుకు తెలిపారు. -
18న బలపరీక్ష
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నెల 18న(గురువారం) ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఈ మేరకు సోమవారం విధానసౌధలో ప్రకటించిన స్పీకర్..విశ్వాసపరీక్షకు వీలుగా సభను గురువారానికి వాయిదా వేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘పూర్తి నమ్మకంతో ఉన్నా. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?’ అని మీడియాను ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యడ్యూరప్ప బీఏసీ సమావేశం సోమవారం సహృద్భావ వాతావరణంలో సాగిందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తాము ప్రకటించడంతో, ప్రభుత్వం బలపరీక్షకు తేదీని ఖరారు చేసిందని వ్యాఖ్యానించారు. ‘విశ్వాసపరీక్ష జరిగేవరకూ ఎలాంటి సభా కార్యకలాపాలు కొనసాగరాదని మేం స్పీకర్‌ను కోరాం. మా విజ్ఞప్తి మేరకు ఆయన సభను గురువారానికి వాయిదా వేశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. రాబోయే 3–4 రోజుల్లోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకకు అత్యుత్తమ పాలన అందిస్తుంది’ అని తెలిపారు. అసెంబ్లీలో మంచి ప్రసంగం ఒకటి ఇచ్చాక సీఎం కుర్చీ నుంచి కుమారస్వామి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. విచారణకు ఇద్దరు రెబెల్స్ డుమ్మా.. స్పీకర్ ముందు విచారణకు ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజీనామాల విషయంలో తమ వాదనల్ని వినిపించేందుకు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యలను స్పీకర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసుకు ఫోన్‌చేసిన ఇద్దరు నేతలు, విచారణకు తాము రాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విచారణకు మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే వీరి విజ్ఞప్తిపై స్పీకర్ స్పందించలేదు. పోలీస్ కమిషనర్‌కు రెబెల్స్ లేఖ.. తమను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, ఆజాద్‌లు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఈ 15 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ‘ ఖర్గే లేదా ఆజాద్ లేదా మరో కాంగ్రెస్ నేతను కలుసుకునే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ నేతల రాక నేపథ్యంలో మా భద్రతపై ఆందోళనతో ఉన్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నేతలు మమ్మల్ని కలుసుకోకుండా నిలువరించండి’ అని లేఖలో కోరారు. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరుకాబోరని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సిట్ విచారణకు ఎమ్మెల్యే బేగ్ గైర్హాజరు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు గైర్హాజరయ్యారు. ఐఎంఏ జువెల్స్ అధినేత మన్సూర్ ఖాన్ నుంచి రూ.400 కోట్లు పుచ్చుకున్న కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీచేసింది. ముఖ్యమైన పనిపడటంతో తాను విచారణకు రాలేకపోతున్నానని రోషన్ బేగ్ తెలిపారు. ఈ నెల 25న విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని సిట్.. జూలై 19న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ రెండోసారి నోటీసులు జారీచేసింది. బేగ్ తన దగ్గర రూ.400 కోట్లు పుచ్చుకుని తిరిగివ్వడం లేదని మన్సూర్ ఖాన్ ఓ వీడియో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సుప్రీం ఓకే స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకం గానే ఆమోదించడంలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తమ పిటిషన్‌ను మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారించాలన్న రెబెల్ ఎమ్మెల్యేల విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ 15 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ గుప్తాల బెంచ్ తెలిపింది. కర్ణాటకకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోర్టు ఇంతకుముందు స్పీకర్ రమేశ్‌ను ఆదేశించడం తెల్సిందే. ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హత పిటిషన్‌పైనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అనే విషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. -
సంకీర్ణానికి నాగరాజ్ ఝలక్
బెంగళూరు/ముంబై: కర్ణాటకలో రాజకీయం ఆదివారం అనూహ్య మలుపు తిరిగింది. రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు చేసిన విజ్ఞప్తికి తొలుత సానుకూలంగా స్పందించిన రెబెల్ ఎమ్మెల్యేల ఎంటీబీ నాగరాజ్ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ నేత ఆర్.అశోక్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం బెంగళూరు నుంచి ముంబైలోని రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకొస్తానని చెప్పి ముంబైలో దిగగానే మాటమార్చారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ నేతల ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. అయితే రెబెల్ ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు మరికొందరిని ఒప్పించి వెనక్కు తీసుకొచ్చేందుకే నాగరాజ్ ముంబైకి వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో విశ్వాసపరీక్ష నాటికి అన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇప్పటివరకూ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. రాజీనామా వెనక్కి తీసుకోను: నాగరాజ్ ముంబైకి వెళ్లేముందు నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘సుధాకర్ గత రెండ్రోజులుగా తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఆయనతో మాట్లాడి ఒప్పించి వెనక్కి తీసుకొస్తాను. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే చెప్పాను’ అని తెలిపారు. కానీ ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు చేరుకున్న వెంటనే నాగరాజ్ మాటమార్చారు. ‘మేమంతా(రెబెల్ ఎమ్మెల్యేలు) ఒకేసారి రాజీనామా చేశాం. ఇప్పుడు రాజీనామా విషయంలో నేను పూర్తి స్పష్టతతో ఉన్నాను. నా రాజీనామాను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మా వెనుక బీజేపీ లేదు. బీజేపీ నేత అశోక్‌తో కలిసి నేను ముంబైకి వచ్చినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అని వెల్లడించారు. మరో రెబెల్ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ స్పందిస్తూ.. నాగరాజ్ తమతో కలవడానికే ముంబై వచ్చారనీ, ఎమ్మెల్యే సుధాకర్‌ను వెనక్కి తీసుకెళ్లడానికి కాదన్నారు. నాగరాజ్ చేరికతో ముంబైలో మకాం వేసిన రెబెల్స్ సంఖ్య 15కు చేరుకుంది. రామలింగారెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ.. ఎమ్మెల్యే నాగరాజ్ చాకచక్యంగా ముంబైలోని రెబెల్స్ క్యాంప్‌కు చేరుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రెబెల్ నేత రామలింగారెడ్డితో కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్ ఖంద్రే, సీఎల్పీ నేత సిద్దరామయ్య, సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి సమర్పించిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు. అనంతరం ఖంద్రే మీడియాతో మాట్లాడుతూ..‘రామలింగారెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం చాలాఉంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. కాబట్టి రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరాం‘’ అని తెలిపారు. మరోవైపు రామలింగారెడ్డి స్పందిస్తూ.. స్పీకర్ రమేశ్‌కుమార్‌తో సోమవారం సమావేశమయ్యేవరకూ తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీఎల్పీ సోమవారం సమావేశం కానుంది. 2–3 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం: యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మరోసారి డిమాండ్ చేశారు.‘కుమారస్వామి నిజంగా నిజాయితీపరుడైతే, ఆయనకు ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవముంటే వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రికి నేను ఇదే సూచిస్తాను. రెబెల్ ఎమ్మెల్యేలు వెనక్కు రాబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకో 2–3 రోజుల్లో కర్ణాటక ప్రజలకు సేవలందించే సదవకాశం బీజేపీకి లభిస్తుంది’ అని చెప్పారు. కాంగ్రెస్‌పై కుమారస్వామి చిందులు.. సాక్షి, బెంగళూరు: కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో సీఎం కుమారస్వామి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నేత సిద్దరామయ్యతో సమావేశమయ్యారు. బెంగళూరులోని కుమారకృప గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి చిందులు తొక్కారు. ‘మా పార్టీ నుంచి కేవలం ముగ్గురే వెళ్లారు. కానీ కాంగ్రెస్ నుంచి ఏకంగా 13 మంది రాజీనామాలు చేశారు. మీ ఎమ్మెల్యేలను కూడా మీరు బుజ్జగించలేరా?’ అని అసహనం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన కమల్‌నాథ్ కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అప్రమత్తమయ్యారు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్న వేళ ఎమ్మెల్యేలు జారిపోకుండా బుధవారం విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 230 స్థానాలున్నమధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందాయి. అయితే స్వతంత్రులు(4), బీఎస్పీ(2) ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, కాంగ్రెస్ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో బలాబలాలు 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 118 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 16 మంది రాజీనామా చేయగా, మరో ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఒకవేళ స్పీకర్ ఈ 16 రాజీనామాలను ఆమోదిస్తే కూటమి బలం 100కు పడిపోతుంది. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కు చేరుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 105 అవుతుంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగినందున ఆ పార్టీ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. -
రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా : కర్ణాటక స్పీకర్
బెంగళూర్ : రాజీనామా చేసిన జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని, తొందరపాటుతో నిర్ణయం తీసుకోనని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ సురేష్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం రెబెల్ ఎమ్మెల్యేలు తనను కలుసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేశానని సాగిన ప్రచారం బాధించిందని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పదకొండు మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించారు. కాగా, తనకు గతంలో 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించగా, వారిలో 8 మంది ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్లో రాజీనామా చేయలేదని, ఇక వారిలో చిత్తశుద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాజా రాజీనామాలపై అసెంబ్లీ విధివిధానాలు, నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇక సంకీర్ణ సర్కార్ అసంతృప్త ఎమ్మెల్యేలు స్పీకర్‌తో భేటీ నేపథ్యంలో కర్ణాటక విధానసౌధ వద్ద హైడ్రామా నెలకొంది. రాజీనామా చేసిన పదకొండు మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ సురేష్ కుమార్‌ను కలుసుకుని రాజీనామాలపై వివరణ ఇచ్చారు. అంతకుముందు ముంబై హోటల్లో బస చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో బెంగళూర్ చేరుకున్నారు. మరోవైపు రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు తనకు మరికొంత సమయం కావాలని కోరుతూ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. అసంతృప్త ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా, ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా అనేది వారిని కలిసి స్వయంగా చర్చించాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. ఎమ్మెల్యేలకు కాంగ్రెస్, జేడీఎస్ విప్ జారీ కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో శుక్రవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటం రాజకీయ వేడి రగిలిస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండటంతో సభ్యులు విధిగా సభకు హాజరు కావాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశాయి. -
కన్నడ సంక్షోభం; సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈరోజే నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు స్పీకర్‌ను కలవాల్సిందిగా రెబల్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా వీరంతా స్పీకర్‌ను కలిసే సమయంలో భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రేపటిలోగా స్పీకర్ తన నిర్ణయాన్ని తెలియజేయాలని పేర్కొంది. కాగా శాసనసభ స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది రోహత్గి కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో గురువారం అత్యవసరంగా పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. -
కర్ణాటకానికి క్లైమాక్స్ ఏంటి?
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందని స్పీకర్ మంగళవారం చెప్పారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ కావాలనే తాత్సారం చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంక్షోభ నివారణకు చర్య తీసుకోవాలని బీజేపీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను నయానో, భయానో వెనక్కి రప్పించడానికి కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయి. శుక్రవారం నుంచి శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారాలేమిటన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాల ఆమోదం 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడం. అదే జరిగితే కాంగ్రెస్ కూటమి బలం 100 కి పడిపోతుంది. దాంతో శాసన సభలో బలం నిరూపించుకోవాలని స్పీకర్ కుమార స్వామిని ఆదేశించవచ్చు. 16 మంది ఎమ్మెల్యేలు తగ్గిపోవడంతో శాసన సభలో మొత్తం సభ్యుల సంఖ్య 209 అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 105 మంది ఉంటే సరిపోతుంది. బీజేపీకి సొంతంగా 105 మంది ఉన్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ,ఒక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతిస్తున్నందున వారి బలం 108కి పెరుగుతుంది..కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఆ పార్టీ డిమాండు చేసే అవకాశం ఉంది. రాజీనామాల తిరస్కరణ ఒకవేళ స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తే దానిపై వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లేందుకు వీలవుతుంది. ఫలితంగా సంక్షోభం మరింత కాలం కొనసాగవచ్చు.పది మంది తిరుగుబాటుఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోమని కోర్టు స్పీకర్‌కు సూచించవచ్చు. లేదా శాసన సభలో బల నిరూపణకు ఆదేశించవచ్చు. ఎమ్మెల్యేలు వెనక్కి రావడం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో పలువురు తిరిగి వస్తారని కాంగ్రెస్,జేడీఎస్ నేతలు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. తిరుగుబాటు నేతలకు మంత్రిపదవులివ్వడం కోసం ప్రస్తుత మంత్రివర్గం రాజీనామా కూడా చేసింది. ఆ ఆశతోనైనా కొందరు తిరిగొస్తారని భావిస్తున్నారు. ముందు నలుగురైదుగురు వెనక్కి వస్తే..తర్వాత మిగతావాళ్లు ఆ దారినే వస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు అన్నారు. అది జరగని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు కొంత మంది రాజీనామా చేసేలా కూటమి నేతలు వ్యూహం పన్నవచ్చు. ఫిరాయింపు నిరోధక చట్టం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అయితే, చట్ట ప్రకారం అది చెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం శాసన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ఆ సభ్యుడు పార్టీ విప్‌ను ధిక్కరించాలి. లేదా స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేయాలి. ఇక్కడ ఈ రెండూ జరగలేదు. కాబట్టి వీరికి ఫిరాయింపు చట్టం వర్తించదు. -
సుప్రీంకు చేరిన కర్ణాటకం
న్యూఢిల్లీ: శాసనసభ స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం అత్యవసర విచారణకు వచ్చేలా చూస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది రోహత్గి కోర్టుకు తెలిపారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కావాలనే తమ రాజీనామాలను ఆమోదించడం లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పిటిషన్లో ఆరోపించారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని వారు ధర్మాసనాన్ని కోరారు. అంతేకాకుండా తమను అనర్హులుగా ప్రకటించకుండా స్పీకర్‌ను నిరోధించాలని కూడా వారు కోరారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు పిటిషన్ సమర్పించిందని వారు పేర్కొన్నారు. తమను అనర్హులుగా ప్రకటించడం పూర్తిగా చట్టవిరుద్దమన్నారు. రాజ్యసభలో రభస కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో రాజ్యసభలో వరసగా రెండో రోజు బుధవారం కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.భోజన విరామం తర్వాత బడ్జెట్‌పై చర్చ మొదలవగానే కాంగ్రెస్ ఎంపీలు సభ మధ్యకు దూసుకొచ్చి నినాదాలు చేశారు. చర్చను ప్రారంభించాల్సిన కాంగ్రెస్ నేత చిదంబరం ఈ గొడవ కారణంగా మాట్లాడలేకపోయారు. గందరగోళం మధ్య చర్చించలేమంటూ సమాజ్‌వాదీ ఎంపీలు వాకౌట్ చేశారు. గందరగోళం కారణంగా సభ మూడు సార్లు వాయిదా పడింది. తర్వాత అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుకుని గురువారం బడ్జెట్‌పై చర్చను కొనసాగించాలని నిర్ణయించారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ఉపాధ్యక్షుడు హరివంశ్ ప్రకటించారు. -
సంక్షోభం ముదిరింది
బెంగళూరులో మొదలైన కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వ సంక్షోభం ముదిరి ముంబై, ఢిల్లీలకూ విస్తరించింది. బెంగళూరులో కాంగ్రెస్ నేత, మంత్రి నాగరాజ్, ఎమ్మెల్యే సుధాకర్‌లు బుధవారం రాజీనామా సమర్పించడంతో హైడ్రామా మొదలైంది. రాజీనామావేళ ఎమ్మెల్యే సుధాకర్‌ను కాంగ్రెస్–జేడీఎస్ నేతలు నిర్బంధించగా, గవర్నర్ జోక్యంతో బయటపడ్డారు. ముంబైలోని 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన మంత్రి శివకుమార్‌ను పోలీసులు హోటల్ గేటు వద్దే అడ్డుకున్నారు. అనంతరం బలవంతంగా బెంగళూరుకు వెళ్లే విమానం ఎక్కించారు. మరోవైపు స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించట్లేరంటూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో, కన్నడ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముంబై: కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలు ఉంటున్న ముంబైలోని రినైసన్స్ హోటల్ వద్ద బుధవారం హై డ్రామా నడిచింది. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వచ్చిన కర్ణాటక మంత్రి, కాంగ్రెస్‌లో కీలక నేత డీకే శివకుమార్‌ను హోటల్ లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని కొన్ని గంటల అనంతరం బలవంతంగా బెంగళూరుకు పంపారు. అంతకుముందు హోటల్ బయట శివకుమార్ మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు ఆయనను పక్కకు లాగేసినంత పనిచేసి, వ్యానులో కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు. తాను ఆ హోటల్లో రిజర్వేషన్ చేసుకున్నాననీ, తనను లోపలకు వెళ్లనివ్వాలని శివకుమార్ కోరినా ముంబై పోలీసులు పట్టించుకోలేదు. శివకుమార్‌ను కలిసేందుకు హోటల్ వద్దకు వచ్చిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు మిలింద్ దేవరా, నసీం ఖాన్‌లను కూడా పోలీసులు శివకుమార్తోపాటే అదుపులోకి తీసుకుని, వారు ముగ్గురినీ కలీనా ప్రాంతంలోని ఓ అతిథి గృహానికి తరలించారు. కొద్దిసేపటి అనంతరం దేవరా, ఖాన్‌లను విడిచిపెట్టి, శివకుమార్‌ను నేరుగా ముంబై విమానాశ్రయానికి బలవంతంగా తీసుకెళ్లి బెంగళూరు విమానం ఎక్కించారు. కాగా, రినైసన్స్ హోటల్లో మొత్తం 12 మంది కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఏడుగురు కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఉదయం 8.20 గంటలకే శివకుమార్ హోటల్ వద్దకు చేరుకోగా, ఆయనను లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, శివకుమార్‌ల నుంచి తమకు ప్రాణహాని ఉందనీ, వారిని హోటల్ లోపలకు రానివ్వద్దంటూ రెబెల్ ఎమ్మెల్యేలు తమను కోరారని పోలీసులు చెప్పారు. హోటల్ బయట ఉన్నవాళ్లు ‘శివకుమార్ వెనక్కు వెళ్లిపోవాలి’ అంటూ నినాదాలు కూడా చేశారు. హోటల్ బయట, ఆ మార్గంలో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మహారాష్ట్ర ప్రభుత్వం మోహరించింది. హోటల్ సెక్యూరిటీ గార్డులు, కెమెరాల సిబ్బంది, విలేకరులు, పార్టీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. వెనక్కి తీసుకెళ్లగలననే నమ్మకంతో వచ్చా.. పోలీసులు తనను అదుపులోకి తీసుకోడానికి ముందు శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను రెబెల్ ఎమ్మెల్యేలతో శాంతంగా చర్చలు జరపడం కోసమే వచ్చానన్నారు. తన వద్ద ఏ ఆయుధమూ లేదనీ, భద్రతా సిబ్బందిని కూడా వెంట తెచ్చుకోలేదనీ, కేవలం మాట్లాడేందుకే ఇక్కడకు వచ్చానని ఆయన వెల్లడించారు. లోపల ఉన్న ఎమ్మెల్యేలంతా గత 40 ఏళ్లుగా తనకు మిత్రులనీ, వారితో కలిసి కాఫీ తాగుతూ మాట్లాడటానికి ఇక్కడకు వచ్చాననీ, అయినా తనను లోపలకు వెళ్లనివ్వడం లేదని శివకుమార్ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుండకపోతే తనను ఎందుకు లోపలకు వెళ్లనివ్వడం లేదనీ, ఏ ఆయుధమూ లేకుండానే తన మిత్రులకు తానెలా హాని తలపెట్టగలనని ఆయన ప్రశ్నించారు. వారితో మాట్లాడితే తాను వారిని కర్ణాటకకు వెనక్కి తీసుకెళ్లగలనన్న నమ్మకం తనకు ఉందని శివకుమార్ చెప్పారు. ఎమ్మెల్యేలను కలవనీయకుండానే శివకుమార్‌ను పోలీసులు వెనక్కు పంపేశారు. బీజేపీ ప్రజాస్వామ్యం గొంతునులుముతోంది: చవాన్ కర్ణాటక ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనీ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ద్వారా ప్రజాస్వామ్యం గొంతును ఆ పార్టీ నులుముతోందని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ ఆరోపించారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి చేటని ఆయన అన్నారు. చవాన్ మాట్లాడుతూ కర్ణాటకలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడాన్ని మహారాష్ట్ర సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రోత్సహిస్తున్నారనీ, రెబెల్ ఎమ్మెల్యేలను ముంబైలోని హోటల్లో బంధించారని చవాన్ మండిపడ్డారు. గతంలో గోవా, మణిపూర్‌ల్లోనూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందని చవాన్ అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలేననీ, కానీ వారిని కలిసేందుకు కాంగ్రెస్ నాయకులనే లోపలకు అనుమతించని విషయాన్ని అందరూ గుర్తించాలని చవాన్ కోరారు. శివకుమార్ మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు ఆయనను పక్కకు లాగేసినంత పనిచేయడం గర్హనీయమన్నారు. -
సుప్రీంకు చేరిన కర్ణాటక సంక్షోభం
న్యూఢిల్లీ/ముంబై : కర్ణాటక రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరింది. తమ రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆమోదించకపోవడంపై కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. రెబల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టేందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అంగీకరించారు. కర్ణాటకకు చెందిన 14 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు సమర్పించగా.. వాటిలో ఐదు మాత్రమే ఫార్మట్ ప్రకారం ఉన్నాయని స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ నిర్ణయంపై రెబల్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్పీకర్ రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వహించడంలేదని విమర్శించారు. ముంబైలో శివకుమార్‌కు చుక్కెదురు.. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద బుధవారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్‌ను పోలీసులు లోనికి అనుమతించలేదు. మరోవైపు సీఎం కుమారస్వామి, డీకే శివకుమార్ వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాయడంతో హోటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పూటకో మలుపు.. కర్ణాటక రాజకీయం పూటకో ములుపు తిరుగుతోంది. కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలోకి జారిపోయింది. సంకీర్ణ ప్రభుత్వంపై అసమ్మతితో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ముంబై స్టార్ హోటల్లో మకాం వేశారు. దీంతో రంగంలో దిగిన కాంగ్రెస్, జేడీఎస్ ముఖ్య నేతలు రాజీనామా చేసిన ఎమ్మేల్యేలను బుజ్జగించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాజకీయ సంక్షోభంతో తమకేలాంటి సంబంధం లేదని చెబుతున్న బీజేపీ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అంతర్గత ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లోనుకావద్దని.. త్వరలోనే పరిస్థితి సర్దుకుంటుందని చెబుతున్నారు. చదవండి: కర్నాటకంలో కొత్త ట్విస్ట్ రెబల్ ఎమ్మెల్యేల క్యాంప్ వద్ద హైడ్రామా -
కర్నాటకంలో కొత్త ట్విస్ట్
సాక్షి, బెంగళూరు/ ముంబై: కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుందని, తప్పుడు నిర్ణయంతో చరిత్రలో ద్రోహిగా మారడం ఇష్టం లేదని స్పీకర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తనకు అందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖల్లో 5 మాత్రమే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయని ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్ కూడా రెబెల్స్ జాబితాలో చేరిపోగా, సర్కారు మనుగడ ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. బేగ్ రాజీనామా లేఖ అందింది ‘నేను జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదు. భవిష్యత్ తరాలు నన్నో అపరాధిగా చూస్తాయి’అని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ అన్నారు. మంగళవారం విధాన సౌధలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనపై ఆయన స్పందిస్తూ.. రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఈ నెల 11వ తేదీలోగా ఆధారాలను చూపాలని కోరానని, సమాధానాన్ని బట్టి చర్యలుంటాయని వివరించారు. రాజీనామా చేసిన 14 మందిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలున్నారని వెల్లడించారు. రాజీనామాలను ఆమోదించాలా లేక మరే ఇతర చర్యలు చేపట్టాలా అనే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు, రూల్‌బుక్ ప్రకారం నడుచుకుంటానన్నారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ‘ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా లేఖ ఈ రోజే అందింది. దానిని ఇంకా పరిశీలించలేదు. ఇప్పటికే అందిన అధికార కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 ఎమ్మెల్యేల రాజీనామా పత్రాల్లో ఐదుగురివే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయి. మిగతా వారికి ఈ మేరకు సమాచారం అందించాం. వారు మరోసారి రాజీనామా పత్రాలు అందజేస్తే పరిశీలిస్తా’అని స్పష్టం చేశారు. సీఎల్పీ భేటీకి రాని 20 మంది మంగళవారం ఉదయం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. పదవులకు రాజీనామా చేసిన వారితోపాటు మొత్తం 20 మంది ఈ భేటీకి గైర్హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను కలిశారు. తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానం ప్రతిని వారు స్పీకర్‌కు అందజేశారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాజీనామాలు చేసి, బీజేపీతో చేతులు కలిపిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాం. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’అని వెల్లడించారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎల్పీ నేత సిద్దరామయ్య హెచ్చరించారు. ‘రాజ్యాంగం పదో షెడ్యూల్లోని ఫిరాయింపుల చట్టంలోని నిబంధనలు తెలియకనే వారంతా రాజీనామా చేశారు. బీజేపీ వలలో చిక్కుకున్న ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీతో చేతులు కలిపారు. మోదీ, అమిత్ షా ఈ వ్యవహారంలో తలదూరుస్తున్నారు’ అని అన్నారు. అంతకుముందు విధానసౌధ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బీకే హరిప్రసాద్ బెంగళూరుకు చేరుకుని ఎమ్మెల్యేలు, నేతలతో చర్చలు ప్రారంభించారు. రెబెల్స్ మళ్లీ ముంబైకి.. కర్ణాటక తిరుగుబాటు శాసనసభ్యులు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరి మార్గమధ్యంలో సతారా సమీపంలో ఆగిపోయారు. తమ రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం వారు అక్కడే మంగళవారం ఎదురు చూశారు. కొందరి ఎమ్మెల్యేల రాజీనామాలు నిర్దేశిత నమూనా ప్రకారం లేవని స్పీకర్ ప్రకటించడంతో తిరిగి ముంబై వెళ్లారు. రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలలతో సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు. నగర శివార్లలోని ఒక రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లోనుకావద్దని, మరో నాలుగు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు. హెచ్చరికలకు లొంగని రెబెల్స్ రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామంటూ కాంగ్రెస్ హెచ్చరికలు పంపినప్పటికీ వారు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. ‘రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదు. స్వచ్ఛందంగా రాజీనామాలు ఇచ్చాం. ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సోమశేఖర్ మీడియాతో వ్యాఖ్యానించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇటీవల సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్ మంగళవారం రాజీనామా సమర్పించినట్లు ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికే.. ఐఎంఏ గ్రూప్ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే బేగ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఐఎంఏ గ్రూప్ ముఖ్య నిర్వాహకుడు, ఐఎంఏ జ్యుయెల్లర్స్ అధినేత మొహమ్మద్ మన్సూర్ ఖాన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. రోషన్‌బేగ్ తన వద్ద నుంచి రూ.400 కోట్లు తీసుకుని, ఎగనామం పెట్టాడని ఆయన విడుదల చేసిన ఆడియోలో ఆరోపించడం కలకలం రేపింది. -
15కు చేరిన రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య
బెంగళూర్ : కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌కు చిక్కులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా చేశారు. బేగ్ రాజీనామాతో కాంగ్రెస్, జేడీఎస్‌లను వీడిన రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. ఇప్పటివరకూ 10 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మరోవైపు పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించిన రెబెల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అసంతృప్త ఎమ్మెల్యేలు గోవాకు మకాం మార్చడంతో వారితో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో 8 మంది రాజీనామాలు ఫార్మాట్‌కు అనుగుణంగా లేవని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ వాటిని తిరస్కరించారు. మిగిలిన ఎమ్మెల్యేలు తనతో వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాతే వాటిపై ఓ నిర్ణయం తీసుకుంటానని గవర్నర్‌కు రాసిన లేఖలో స్పీకర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. -
మంత్రులంతా రాజీనామా
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్నాటకం రోజుకో మలుపు తిరుగుతూ మరింత ఉత్కంఠ రేపుతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్–జేడీఎస్ ముఖ్యనేతలు సోమవారం చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. అసంతృప్త నేతలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ నుంచి 21 మంది మంత్రులు, జేడీఎస్‌కు చెందిన 9 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. మరోవైపు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకం మరింత రంజుగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంట్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు, జేడీఎస్ ప్రతినిధులు ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరతో సమావేశమైన సీఎం కుమారస్వామి రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మంత్రుల రాజీనామా నేపథ్యంలో వీలైనంత త్వరగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతామని అధికారిక వర్గాలు తెలిపాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొత్తం 34 మంత్రి పదవులకు గానూ కాంగ్రెస్ 22, జేడీఎస్ 12 మంత్రి పదవులను తీసుకునేలా ఇరుపార్టీల మధ్య అంగీకారం కుదిరింది. అయితే తమకు న్యాయం జరగలేదంటూ 13 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. కాగా, ఈ రాజీనామాలను ఆమోదించవద్దని కాంగ్రెస్ న్యాయవిభాగం స్పీకర్ రమేశ్‌కుమార్‌ను కోరింది. ఈ ఎమ్మెల్యేలు నియమ నిబంధనల మేరకు, స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించలేదని స్పష్టం చేసింది. ఇద్దరు మంత్రుల రాజీనామా కర్ణాటకలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధికార కూటమికి మరో షాక్ తగిలింది. ఇటీవల కుమారస్వామి కేబినెట్లో మంత్రులుగా నియమితులైన స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్లు తమ మంత్రి పదవులకు రాజీనామా సమర్పించారు. సోమవారం ఉదయం బెంగళూరులోని రాజ్‌భవన్‌కు చేరుకున్న నగేశ్, గవర్నర్ వజూభాయ్‌వాలాకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు నగేశ్ లేఖలో తెలిపారు. ఒకవేళ గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. అలాగే మంత్రి ఆర్.శంకర్ కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం బీజేపీకి బహిరంగంగా మద్దతు పలికారు. మరోవైపు తన సమస్యలను పరిష్కరించకుంటే అధికార కూటమిని వీడుతానని మంత్రి రహీమ్ మహమూద్ ఖాన్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తనను అవమానించిందనీ, అందుకే త్వరలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతానని బహిష్కృత ఎమ్మెల్యే రోషన్ బేగ్ ప్రకటించారు. మంగళవారం జరిగే సీఎల్పీ భేటీని తాను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. తుది నిర్ణయం అధిష్టానానికే పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ‘సోమవారం మేం మంత్రులతో భేటీ అయ్యాం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలిపెట్టారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీని నిలువరించేందుకు మంత్రులు చేసిన త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బీజేపీ ఇప్పటికే ఐదుసార్లు మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించి విఫలమైంది’ అని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన నేతలు తిరిగివస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయమై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. ‘పార్టీపై మాకు పూర్తి విశ్వాసముంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. కాంగ్రెస్ మంత్రులు శివనదా పాటిల్, ఆర్వీ దేశ్‌పాండేలు వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి హాజరుకాకపోయినా రాజీనామాకు తమ సమ్మతిని తెలియజేశారు. సామాజిక న్యాయం, ప్రాంతం, అర్హతల ఆధారంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది’ అని తెలిపారు. నేను దేనికీ భయపడను: కుమారస్వామి కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై సీఎం కుమారస్వామి తొలిసారి నోరువిప్పారు. తాను దేనికీ భయపడబోననీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తాను ఏమాత్రం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పరి పాలించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడంపైనే నేను దృష్టి సారించా. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నేను దృష్టి సారించలేదు. అంత అవసరం కూడా నాకు లేదు’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్‌వాలా ఎమ్మెల్యేల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర ఆరోపించారు. గోవాకు రెబెల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్–జేడీఎస్‌కు చెందిన 13 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరారు. 10 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు గోవాకు చేరుకోనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బీజేపీ ముంబై యువమోర్చా అధ్యక్షుడు మోహిత్ వీరితో ఉన్నట్లు వెల్లడించాయి. వీరంతా గోవా శివార్లలోని ఓ రిసార్టులో బస చేస్తారని పేర్కొన్నాయి. నేటి నుంచి బీజేపీ ఆందోళన కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనీ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కుమారస్వామి రాజీనామా చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ఆందోళనలు చేపడతామని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప హెచ్చరించారు. కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు: రాజ్‌నాథ్ కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి తొలుత మాట్లాడుతూ..‘కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. అందులో భాగంగానే మా ఎమ్మెల్యేలను ముంబైలోని స్టార్ హోటల్‌కు తరలించారు. ఎమ్మెల్యేలు గవర్నర్ వజూభాయ్‌వాలాను కలిసిన వెంటనే అప్పటికప్పుడు కార్లు, విమానాలు, హోటల్ సదుపాయాలు ఏర్పాటైపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. 303 మంది లోక్‌సభ ఎంపీలున్నప్పటికీ మీ కడుపు నిండలేదు. ఇప్పుడు మీ(బీజేపీ) కడుపు, ఢిల్లీ గేటు ఒకేలా కనిపిస్తున్నాయి’ అని దుయ్యబట్టారు. దీంతో రాజ్‌నాథ్ స్పందిస్తూ..‘కర్ణాటకలో ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ పార్టీలో పెద్దపెద్ద నేతలే(రాహుల్ గాంధీ, సింధియా తదితరులు) రాజీనామాలు చేస్తున్నారు. దీన్ని రాహుల్ గాంధీయే ప్రారంభించారు’ అని తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదాలున్న ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ఎంత నగదు వెచ్చించారో చెప్పాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లను కాంగ్రెస్ ట్విట్టర్లో డిమాండ్ చేసింది. 12 మందికి యెడ్డీ కేబినెట్లో చోటు! సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యడ్యూరప్ప నేతృత్వంలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడం ఖాయమని బీజేపీవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 13 మంది ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప మంత్రివర్గంలో చోటు దక్కుతుందని వెల్లడించాయి. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ..‘13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసినందున వారికి విప్ జారీ వర్తించదు. వీరి రాజీనామాలపై నిర్ణయాన్ని స్పీకర్ ఆలస్యం చేయగలరే తప్ప తిరస్కరించలేరు’ అని స్పష్టం చేశారు. ప్రభు త్వం పడిపోకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాలను వాయిదావేయడం లేదా రద్దుచేసే చాన్సుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. స్పీకర్ నిర్ణయమే కీలకం.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు మంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజీనామాలన్నీ పద్దతి ప్రకారం, నిర్ధిష్ట నమూనాలో ఉంటే వాటిని ఆమోదించడం తప్ప స్పీకర్ మరో ప్రత్యామ్నాయం ఉండదు. అయితే, ఆమోదానికి కొంత వ్యవధి తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పించవచ్చు. లేదా బలపరీక్షకు సిద్ధంకావాలని సీఎం కుమారస్వామిని ఆదేశించవచ్చు. స్పీకర్ గనుక రాజీనామాలను ఆమోదిస్తే ఆ క్షణమే కుమారస్వామి సర్కారు మైనారిటీలో పడిపోతుంది. కుమార స్వామి బలపరీక్షకు ఒప్పుకోకపోతే బీజేపీ అవిశ్వాస తీర్మానాస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. అంతేకాకుండా స్పీకర్‌ను తొలగించాలని కూడా ఆ పార్టీ డిమాండు చేయవచ్చు. అదే జరిగితే సభలో బలపరీక్ష తప్పదు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం సరిగా లేదని భావిస్తే ఇరు పక్షాల్లో ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. బలాబలాలు ఇలా... 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. రాజీనామాల ముందు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి 118 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేళ స్పీకర్ రమేశ్ కుమార్ 13 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 211కు తగ్గిపోతుంది. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. అదే సమయంలో అధికార జేడీఎస్–కాంగ్రెస్ కూటమి బలం 103కు పడిపోతుంది. ఇదే జరిగితే 105 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ఇద్దరు స్వతంత్రుల మద్దతు (107) తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది. మీడియాతో మాట్లాడుతున్న సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, దినేశ్ గుండూరావు -
‘ఆ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్’
బెంగళూర్ : కర్ణాటకలో పాలక జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌ను ఇరకాటంలో పడేసిన 11 మంది అసంతృప్త ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు వారికి సంకీర్ణ సర్కార్‌లో మంత్రి పదవులను ఆఫర్ చేసినట్టు సమాచారం. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలోకి చేరకుండా నిరోధించేందుకు కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే సహా అధిష్టాన పెద్దలు సైతం రంగంలోకి దిగారు. ముంబైలోని సోఫిటెల్ హోటల్లో బసచేసిన కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఎహెచ్ విశ్వనాధ్, రమేష్ జర్కిహోలి, సోమశేఖర్, రామలింగారెడ్డి, ప్రతాప గౌడ పాటిల్, గోపాలయ్య, బీసీ పాటిల్, మహేష్ కుంతహల్లి, నారాయణ గౌడ, బసవరాజ్, శివరాం హెబ్బర్‌లతో ఆ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు పాలక సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో పడటంతో విదేశీ పర్యటనలో ఉన్న సీఎం హెచ్డీ కుమారస్వామి ఆదివారం సాయంత్రానికి బెంగళూర్‌కు చేరుకోనున్నారు. ఇక సంకీర్ణ సర్కార్ స్ధానంలో అసంతృప్త ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన ముంబై హోటల్లో ఆ పార్టీ నేత ప్రహ్లాద్ జోషీ కనిపించడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. -
మెహబూబా ముఫ్తీకి భారీ షాక్
-
కశ్మీర్ రాజకీయాల్లో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ: పీడీపీ అధినేత్రి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి భారీ షాక్ తగిలింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)లో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీతో బ్రేకప్ను జీర్ణించుకోలేని ముగ్గురు పీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ, మహ్మద్ అబ్బాస్ వానీ, వీరిద్దరితోపాటు మరో సీనియర్ నేత అబిద్ అన్సారీ.. మెహబూబాకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. మరికొందరిని కూడగలుపుకుని ఈ రెబల్స్ కొత్త పార్టీ ఏర్పాటు నిర్ణయానికి వచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది. మెహబూబాపై వ్యతిరేకగళం... సీనియర్ నేత అబిద్ అన్సారీ.. మెహబూబా ముఫ్తీ నాయకత్వంపై తొలి నుంచే వ్యతిరేకిస్తున్నారు. దీనికితోడు తాజా రాజకీయ పరిణామాలు ఆయన స్వరాన్ని పెంచేశాయి. మరోవైపు మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ కూడా సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పీడీపీని సమర్థవంతంగా నడపటంలో మెహబూబా దారుణంగా విఫలం అయ్యారు. అంతేకాదు తండ్రి ముఫ్తీ మెహబూబా కలలను కూడా ఆమె నాశనం చేశారు. పైగా ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైపోయింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీని కాస్త ఫ్యామిలీ డెమొక్రటిక్ పార్టీగా మార్చేశారు’ అని మాజీ మంత్రి ఇమ్రాన్ పేర్కొన్నారు. కాసేపటికే మరో ఎమ్మెల్యే మహ్మద్ అబ్బాస్ వానీ కూడా ఇమ్రాన్‌కు మద్ధతు ప్రకటించారు. బీజేపీతో విడిపోవటం.. ప్రభుత్వం కుప్పకూలిపోయి ముఫ్తీ రాజీనామా... మెహబూబా వైఫల్యాలని వారిద్దరూ బహిరంగంగా ప్రకటించారు. మరికొందరు అసంతృప్త నేతలతో కలిసి పీడీపీ, ఎన్సీ(నేషనల్ కాన్ఫరెన్స్) పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమిని వీరు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. (ఆ అలవాటును మానుకోండి: బీజేపీ ఘాటు కౌంటర్) బీజేపీతో టచ్‌లో?... అయితే మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ మాత్రం బీజేపీ అధినాయకత్వానికి టచ్‌లో ఉన్నట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ‘ఇమ్రాన్ బీజేపీ చీఫ్ అమిత్ షాతో టచ్‌లో ఉన్నారు. మరికొందరు అసంతృప్త నేతలతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళిక వేస్తున్నారు. మరోవైపు ఎన్సీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించేందుకు బీజేపీ యత్నిస్తోంది’ అని ఆ కథనం సారాంశం. అయితే ఇమ్రాన్ మాత్రం ఆ కథనాన్ని తోసిపుచ్చారు. కశ్మీర్లో ఉగ్రవాదం పెరుగుదల, శాంతి భద్రతల హీనతను సాకుగా చూపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలటంతో.. ప్రభుత్వం కుప్పకూలి ముఫ్తీ మెహబూబా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొత్తం 89 మంది సభ్యులున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, పీడీపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన సభ్యుల సంఖ్య 45. -
జేడీ(ఎస్) రెబల్ ఎమ్మెల్యేలపై కొరడా
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటెయ్యడం ద్వారా ధిక్కారస్వరం వినిపించిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై జేడీ(ఎస్) కొరడా ఝుళిపించింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. నోటీసులు కూడా జారీ చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి ఎం. ఫారూక్ ఓటు వేయకుండా వీరంతా క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో ఈ చర్య తీసుకుంది. జమీర్ అహ్మద్‌ఖాన్, చలువరాయస్వామి, బాలకృష్ణ, ఇక్బాల్ అన్సారి, అఖండ శ్రీనివాసమూర్తి, బండిసిద్దేగౌడ, గోపాలయ్య, భీమేగౌడలు అధినాయకత్వం పై ధిక్కారస్వరం వినిపించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో కాంగ్రెస్ మూడో అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. కాంగ్రెస్ నుంచి జైరాం రమేశ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ రామ్మూర్తి గెలుపొందారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గిలిచారు. బీజేపీ ఇద్దరు స్వతంత్రులు మద్దతు పలికారు. -
అనర్హత వేటు వేయండి
ఫిరాయింపుదారులపై నేడు మండలి చైర్మన్, స్పీకర్లకు టీడీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎనిమిది మంది ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు వేయాలని కోరు తూ మంగళవారం శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్లను కలవాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక పార్టీ గుర్తుపై ప్రజాప్రతినిధిగా గెలిచి మరో పార్టీలో చేరితే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దవుతుందని, ఈ మేరకు పార్టీ పరంగా ఫిర్యా దు చేస్తామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం మీడియాకు చెప్పారు. టీఆర్ఎస్కు అసెంబ్లీలో మెజారిటీ ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ‘ఐదేళ్ల దాకా మేమైతే దింపం. అల్లుడు(హరీశ్‌రావు) గుంజేస్తాడని భయమేమో’ అని దయాకర్‌రావు ఎద్దేవా చేశారు. నేడు ఇందిరాపార్కు వద్ద రైతులతో ధర్నా రైతుల ఆత్మహత్యలను నిలువరించలేని ప్రభు త్వ వైఖరికి నిరసనగా మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అనంతరం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేస్తామన్నారు. -
'కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరిస్తే వేటు తప్పదు'
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురాజేస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరిస్తూ రెబెల్స్ ఎన్నికల బరిలో దిగుతుండగా, వారికి కొందరు ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తున్న ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండ్రు మురళి చెప్పారు. రాజ్యసభ ఎన్నికలు, తిరుగుబాటు దారులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారిస్తోందని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే నాయకులపై వేటుతప్పదని మురళి హెచ్చరించారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా టీ సుబ్బిరామి రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా చైతన్య రాజు, ఆదాల ప్రభాకర రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మరో నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. -
రెబల్స్ బెడద
చెన్నై, సాక్షి ప్రతినిధి : డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్‌కు రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీని ధిక్కరించడమేగాక సవాల్‌కు ప్రతిసవాల్ విసరడం విజయకాంత్‌ను సందిగ్ధంలో పడవేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో గెలుపొందింది. డీఎంకే కంటే ఎక్కువ స్థానాలు దక్కడంతో విజయకాంత్ ప్రతిపక్ష నేత హోదాను దక్కించుకున్నారు. ఈ హోదాకు సైతం సీఎం జయలలిత సహకరించారు. అయితే క్రమేణా అన్నాడీఎంకేకు దూరమైన డీఎండీకే అమ్మపాలనను విమర్శిం చడం ద్వారా ప్రతిపక్ష పాత్రను పోషించింది. బహిరంగ సభల్లో సైతం అన్నాడీఎంకే పాలనను విజయకాంత్ దుమ్మెత్తిపోయడం అదే పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలకు రుచించలేదు. ఏ పార్టీ అండతో ఎమ్మెల్యేలుగా గెలిచామో అదే పార్టీని విమర్శించడం సహించలేని ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకరొకరుగా అమ్మ పంచన చేరారు. ముందుగా మధురై సెంట్రల్ ఎమ్మెల్యే ఆర్ సుందరరాజన్ అమ్మకు జై కొట్టారు. ఆ తరువాత వరుసగా పాండియరాజ న్, తమిళలగన్, సురేష్, మైకేల్ రాయప్పన్, శాంతి, అరుణ్‌పాండియన్ అమ్మ ఆశీర్వాదం పొందారు. నియోజ కవర్గ అభివృద్ధి పనుల కోసం అమ్మను కలిసినట్లు వారు సమర్థించుకున్నారు. డీఎండీకేను ధిక్కరించి అన్నాడీఎంకేతో కలిసి తిరుగుతున్న రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా అని డీఎండీకే అధినేత విజయకాంత్ శుక్రవారం సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన రెబల్ ఎమ్మెల్యే ఆర్ సుందరరాజన్ శనివారం ప్రతిసవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయూలని కోరడానికి విజయకాంత్ ఎవరని ప్రశ్నించారు. ఏళ్లతరబడి ప్రజలకు సేవచేసినందుకే ఓటర్లు తమను ఎమ్మెల్యేలుగా గెలిపించారని ఆయన అన్నారు. తమ గెలుపునకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు సైతం కృషి చేశారని తెలిపారు. పార్టీని ధిక్కరిస్తున్నామని కెప్టెన్ భావిస్తున్నట్లయితే రెబల్ ఎమ్మెల్యేలను పార్టీ నుండి డిస్మిస్ చేయడం మంచి మార్గమని పేర్కొన్నారు. తమను డిస్మిస్ చేసే దమ్ముందా అని తాము ప్రశ్నిస్తున్నట్లు సుందరరాజన్ సవాల్ చేశారు. తమిళనాడు ప్రజలకు ఏమీ చేయని విజయకాంత్ ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపడం హాస్యాస్పదమని అన్నారు. తమను వెంటనే డిస్మిస్ చేయూలని, లేకుంటే తమ గురించి ఇకపై మాట్లాడరాదని విజయకాంత్‌కు ఆయన హితవు పలికారు.