
బెంగళూర్ : కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌కు చిక్కులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా చేశారు. బేగ్ రాజీనామాతో కాంగ్రెస్, జేడీఎస్‌లను వీడిన రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. ఇప్పటివరకూ 10 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.
మరోవైపు పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించిన రెబెల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అసంతృప్త ఎమ్మెల్యేలు గోవాకు మకాం మార్చడంతో వారితో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో 8 మంది రాజీనామాలు ఫార్మాట్‌కు అనుగుణంగా లేవని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ వాటిని తిరస్కరించారు.
మిగిలిన ఎమ్మెల్యేలు తనతో వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాతే వాటిపై ఓ నిర్ణయం తీసుకుంటానని గవర్నర్‌కు రాసిన లేఖలో స్పీకర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment