బెంగళూర్ : అనర్హత వేటుకు గురైన రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. డిసెంబర్ 5న జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వారిని బీజేపీ తమ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిపింది. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనర్హులుగా స్పీకర్ ప్రకటించిన క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక జేడీఎస్, కాంగ్రెస్ రెబెల్స్ మహేష్ కుమతల్లి, శ్రీమంతగౌడ పాటిల్, రమేష్ జర్కిహోలి, శివరాం హెబ్బర్, బీసీ పాటిల్, ఆనంద్ సింగ్, కే సుధాకర్, భైరతి బసవరాజ్, ఎస్‌టీ సోమశేఖర్, కే గోపాలయ్య, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారాయణ గౌడ, హెచ్ విశ్వనాధ్‌లు ఈసారి బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు.
వీరిపై అనర్హత వేటును సుప్రీం కోర్టు గురువారం సమర్ధిస్తూ 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెబెల్ ఎమ్మెల్యేలపై నిషేధం విధించిన స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఉత్తర్వులను తోసిపుచ్చింది. కోర్టు నిర్ణయం వెలువడిన మరుక్షణమే తాము బీజేపీలో చేరుతామని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎన్నికలు జరిగే 15 స్ధానాల్లో బీజేపీ గెలుపొందుతుందని వీరంతా కాబోయే ఎమ్మెల్యేలు, మంత్రులని వీరి త్యాగాల ఫలితంగానే తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిందని ముఖ్యమంత్రి యడియూరప్ప పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment