న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఆరుగురు శాసనసభ్యులు ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అనర్హత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణ జరిపింది.
నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కార్యాలయానికి నోటీసు పంపింది. పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున అసెంబ్లీ కార్యకలాపాలతోపాటు ఓటింగ్‌లోనూ పాల్గొనరాదని ఆరుగురికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు మే 7 ఆఖరు తేదీ.
Comments
Please login to add a commentAdd a comment