విజయవాడ: వైస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుపై నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి మరింత గడువు కావాలని కోరారు.
స్పీకర్ ఎదుట విచారణ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలు మెమో దాఖలు చేశారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు, పేపర్, వీడియో క్లిప్పింగుల నిజనిర్ధారణకు సమయం అవసరమని, పిటిషన్ దాఖలు తర్వాత రిప్లైకి 30 రోజుల సమయం కావాలని కోరామని తెలిపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్‌తో భేటీ తర్వాత తెలిపారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల కొత్త సాకులు
స్పీకర్‌తో విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త కారణాలను తెరమీదికి తెచ్చారు
- ఉండవల్లి శ్రీదేవి : నాకు కోవిడ్ వచ్చింది, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇంకా సెలైన్ పెట్టుకుంటూనే ఉన్నాను. కోవిడ్ తగ్గే దాకా సమాధానం ఇవ్వడానికి సమయం కావాలి
- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి : నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. వైద్యుల నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు, విప్ ఉల్లంఘించామనడానికి ఉన్న ఆధారాలేమిటి?
- ఆనం రాంనారాయణ : నోటీసులిచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమనడం సరికాదు, అసలు నాకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయా?
కాగా పార్టీ ఫిరాయించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారిస్తుండగా.. ఎమ్మెల్సీలను శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు విచారించారు.
దీ చదవండి: చెప్పింది చేయకపోవడం బాబు నైజం
Comments
Please login to add a commentAdd a comment