thammineni seetha ram
-
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మరో ఛాన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖ రాశారు. ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకు ముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు లేఖ పంపించారు. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు నోటీసులు పంపించారు. ఇదీ చదవండి: CM Jagan: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు -
AP: పార్టీ ఫిరాయించారు.. వేటేనా?
విజయవాడ: వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుపై నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి మరింత గడువు కావాలని కోరారు. స్పీకర్ ఎదుట విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు మెమో దాఖలు చేశారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు, పేపర్, వీడియో క్లిప్పింగుల నిజనిర్ధారణకు సమయం అవసరమని, పిటిషన్ దాఖలు తర్వాత రిప్లైకి 30 రోజుల సమయం కావాలని కోరామని తెలిపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్‌తో భేటీ తర్వాత తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కొత్త సాకులు స్పీకర్‌తో విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త కారణాలను తెరమీదికి తెచ్చారు ఉండవల్లి శ్రీదేవి : నాకు కోవిడ్ వచ్చింది, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇంకా సెలైన్ పెట్టుకుంటూనే ఉన్నాను. కోవిడ్ తగ్గే దాకా సమాధానం ఇవ్వడానికి సమయం కావాలి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి : నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. వైద్యుల నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు, విప్ ఉల్లంఘించామనడానికి ఉన్న ఆధారాలేమిటి? ఆనం రాంనారాయణ : నోటీసులిచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమనడం సరికాదు, అసలు నాకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయా? కాగా పార్టీ ఫిరాయించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారిస్తుండగా.. ఎమ్మెల్సీలను శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు విచారించారు. దీ చదవండి: చెప్పింది చేయకపోవడం బాబు నైజం -
ఆమదాలవలసలో ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన
-
సీఎం వైఎస్ జగన్ కు స్వామివారి ఆశీస్సులు ఉండేలా చూడాలని కోరుకున్నా: తమ్మినేని సీతారాం
-
పాఠశాలలను ప్రారభించిన స్పీకర్ తమ్మినేని
-
ఆ కల నెరవేరే రోజు వచ్చింది: తమ్మినేని
సాక్షి, బుర్జ(శ్రీకాకుళం): మండలంలోని పలు గ్రామాలు పర్యంచిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పలు అభివృద్ధి పనులకు శంకస్థాపన చేశారు. గుత్తావళ్లి గ్రామంలో సుమారు 60 లక్షల నిధులతో పిహెచ్సీ కాంపౌండ్ గోడకు శంకుస్థాపన చేసి అనంతరం నాడు-నేడు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం పనులను శనివారం పరిశీలించారు. కళపర్తి గ్రామంలో 7.50 లక్షల నిధులతో ఇటీవల నిర్మించిన అంగన్వాడి భవనం కూడా ప్రారంభించారు. తరువాత సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేందద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన గుత్తావళి సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధిని ఈరోజు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఈ గ్రామంలో 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 4.77 లక్షలు రూపాయలు సంక్షేమ పథకాల కింద ఈ ఊరుకి కేటాయించామని, జల జీవన మిషన్ ద్వారా ఇంటింటికి కొళాయిల ద్వారా నీరు అందించేందుకు 67 లక్షల రూపాయల నిధులు ఖర్చుచేయనున్నట్టు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అవినీతి లేని పాలన ప్రజలకు అందిస్తున్నారని, వ్యవస్థలలో పారదర్శకతను తీసుకువచ్చారన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి యువత ఉద్యోగం కోసం కలలు కంటూనే ఉన్నారని, ఇప్పుడు ఆ కల నెరవేరే రోజు వచ్చిందన్నారు. అధికారం ఇవ్వండి ఉద్యోగ సునామీ సృష్టిస్తానని పాదయాత్రలో సీఎం వైఎస్ జగన్ అన్నారని, ఇవాళ ఉద్యోగ విప్లవం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. నాయకుడికి ప్రజల్ని ఆదుకోవాలనే సంకల్పం ఉండాలని, అత్యంత శక్తివంతమైన వ్యవస్థ పౌర వ్యవస్థని వాళ్ళ శక్తికి ప్రభుత్వాలే కులాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాడే వాడే నిజమైన నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖండాపు గోవిందరావు, గుమ్మడి రాంబాబు, బెజ్జివరపు రామారావు, సింగపూరపు కోటేశ్వరరావు, బొడ్డేపల్లి నాగరాజు, బోడ్డేపల్లి నారాయణమూర్తి తదితర వైఎస్సార్ సీసీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. -
సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)/ఆమదాలవలస: కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు స్పీకర్ తమ్మినేని సీతారాం, వాణీ సీతారాంలు కలిసి రూ.35లక్షలు విరాళం సీఎం జగన్మోహన్రెడ్డికి అందజేశారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈ చెక్కును ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమదాలవలసలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస ప్రాజెక్ట్ నిర్మాణాలను గురించి ప్రస్తావించారు. సీఎంను కలిసిన మంతి కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కలిశారు. జిల్లాలోని పరిస్థితులు, పలు అభివృద్ధి పనులను వివరించారు. ఈ నెల 8న చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం చేసిన స్థలాల వివరాలను తెలియజేశారు. తిలక్ రూ.50 లక్షల విరాళం టెక్కలి: టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజల తరఫున వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఆర్అండ్బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో సీఎం జగన్మోహన్రెడ్డికి క్యాంపు కార్యాలయంలో విరాళం అందజేశారు. టెక్కలిలో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంతబొమ్మాళి, కోటబొమ్మాళిలో మండలాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు, ఆఫ్‌షోర్ రిజర్వాయర్ సమస్య, రావివలస మెట్కోర్ పరిశ్రమ కార్మికుల సమస్య, నందిగాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులు, గెస్ట్ లెక్చరర్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ 1108 జీఓ రద్దు చేసి ఉద్యమంలో కేసుల బారిన పడిన వారిని విముక్తి చేయాలని కోరారు. -
చంద్రబాబును యువత క్షమించదు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో నిరుద్యోగ యువతను నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు మోసం చేశారని, ఇందుకు ఆయనను యువత ఎన్నటికీ క్షమించదని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై హామీలిచ్చిన చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు తప్ప ఇంకెవరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతికి సవాలక్ష ఆంక్షలు విధించి అర్హులకు పరీక్ష పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు 5.39 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే స్క్రూటినీ చేసి 1.62లక్షల మందిని అర్హులుగా గుర్తించడం దారుణమన్నా రు. చంద్రబాబు మాటలు నమ్మి యువత మోసపోయారని అన్నారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి ఇవ్వడం వంటి అనేక అంశాలు సాధ్యం కాదని అప్పుడే వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్‌కి అఫిడవిట్ ఇస్తే దానిపై ఎలాంటి పరిశీలన చేయకుండా వదిలేశారన్నారు. రాష్ట్రం లో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరోక్షంగా నిర్వీ ర్యం చేసేందుకు గత నాలుగేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాల మూ సేస్తున్నారన్నారు. ఎంతసేపూ విదేశాలు తిరుగుతూ కాలం గడిపేస్తున్నారే తప్ప రాష్ట్రంలో ఎన్ని ఖాళీలున్నాయో కూడా సీఎంకు తెలీదన్నారు. అబద్ధాలతో ఉన్న ఎన్నికల మ్యాని ఫెస్టోను అధికారికంగా ఉన్న వెబ్సైట్లోంచి తొలగించేయడం సరికాదన్నారు. హామీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచీ పోరాడుతున్న ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. సమావేశంలో పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, పార్టీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయరావు, తమ్మినేని చిరంజీవినాగ్ (నాని), మండవిల్లి రవి, కోరాడ రమేష్, టి.కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నేడు, రేపు 48 గంటలు ధర్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబుకి వ్యతిరేకంగా అక్టోబర్ 2, 3 తేదీల్లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ విద్యార్థి విభాగం జిల్లా ఇన్చార్జి మెంటాడ స్వరూప్ తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో వైఎస్సార్ కూడలి ఏడురోడ్లు కూడలి వద్ద ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమానికి జిల్లాలో అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు హాజరవ్వాలని కోరారు. -
ప్రజల్లోకి వైఎస్సార్ సీపీ ఆశయాలు
శ్రీకాకుళం అర్బన్/శ్రీకాకుళం సిటీ: రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిపాలన, అన్యాయాలు, అక్రమాలను సమర్థంగా ఎదుర్కొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. నాలుగు రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని ఆనందమయి కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన బూత్‌స్థాయి కన్వీనర్లకు, జిల్లా మహిళా విభాగం నాయకురాళ్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. గతంలో సామాన్యులు, పేదల జోలికి ఎవరూ వెళ్లేవారు కాదని, ఇపుడు వారిని కూడా హింస పెట్టే పరిస్థితి దాపురించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాలు రౌడీయిజం, వ్యాపారమయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి రాజకీయాలను దారిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు గౌరవం లేకుండా పోయిందని, జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో వారికే అధికారాలు కట్టబెట్టడం దారుణమన్నారు. శ్రీకాకుళం బలహీన వర్గాలకు చెందిన జిల్లా అని పేరు ఉందని, ఇక్కడి ప్రజలు మాత్రం బలహీనులు కారన్నారు. పోలింగ్ స్టేషన్లో ప్రతి ఓటరుపై, ఓటర్ల జాబితాపై పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలన్నారు. ఒక పవిత్ర ఆశయం కోసం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని, ఆ పోరాటానికి మనమంతా అండగా ఉండాలన్నారు. కార్యక్రమానికి ముందు పార్టీ జెండాను పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఎగురవేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వి.పద్మావతి, చల్లా రవి, కె.ఎల్.ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, జిల్లా అధికార ప్రతినిధులు శిమ్మ రాజశేఖర్, రొక్కం సూర్యప్రకాశరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, నేతలు ధర్మాన పద్మప్రియ, పిలక రాజ్యలక్ష్మి, టి.కామేశ్వరి, పితాని బాలకృష్ణ, గొండు రఘురాం, పొన్నాడ రుషి, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ళ తాతబాబు, యజ్జల గురుమూర్తి, కోరాడ రమేష్, పడపాన సుగుణారెడ్డి, గుంట జ్యోతి, పి.సౌజన్య, కృష్ణవేణి, జె.ఎం.శ్రీనివాస్, మూకళ్ల సుగుణ, ఇఛ్చాపురం నియోజకవర్గ పార్టీ నేతలు కాళ్ల దేవరాజ్, పిఎం తిలక్, మంగి గణపతి, ఇప్పిలి లోలాక్షి, కడియాల ప్రకాష్, పులకల శ్రీరాములు, బద్దాన శ్రీకృష్ణ, తడక జోగారావు తదితరులు పాల్గొన్నారు. మహోన్నత వ్యక్తి వైఎస్సార్ రక్తంలోని ఆవేశం, వ్యక్తిత్వంలోని ఆలోచన, మాటల్లోని వాక్సుద్ధి, తనచుట్టూ ఉన్న పరిసరాల్లో ఏ ఒక్కరూ కష్టాలు, ఇబ్బందులూ పడకుండా చూడాలనే మనసున్న మహోన్నత వ్యక్తి వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన ఆలోచనలతో తెరచిన పుస్తకమే ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’. ఇది అధికార లాలసతోనో, పదవీ కాంక్షతోనో, ధనార్జన కోసమో ఏర్పాటు చేసింది కాదు. ఏ మహానుభావుడైతే తన ఆలోచనలను, ఆశయాలను, సిద్ధాంతాలను వదిలాడో వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన తనయుడిగా జగన్మోహన్రెడ్డి ముందుకు వచ్చారు. ప్రజల ఆరోగ్యం బాగు చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ, మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు పావలా వడ్డీకే రుణాలు అందించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. అంతకు ముందు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రూ.900 కోట్లు అందజేస్తే ఐదున్నరేళ్ల వైఎస్ పాలనలో రూ.5లక్షల 30వేల కోట్లు రుణాలు మంజూరు చేశారు. లక్షలాది ఇళ్లు కట్టించి ఆపద్బాంధవుడయ్యాడు. రైతులను ఆదుకునేందుకు బృహత్తర నీటి ప్రాజెక్టులు తెచ్చి అపరభగీరథుడుగా ఖ్యాతి పొందారు. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో కార్పొరేట్ వైద్యం అందజేశారు. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం పొందారు. శ్రీకృష్ణుని మరణం ఏవిధంగా అయితే పాండవులను కుంగదీసిందో వైఎస్ మరణం ప్రపంచంలోని 15 కోట్ల తెలుగుప్రజలను అంతలా కుంగదీసింది. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేశారు. శత్రువులను సైతం అక్కున చేర్చుకుని సహాయం చేసే గుణమే వైఎస్సార్సీపీ భావజాలం. స్వార్థం కోసమో, పదవుల కోసమో పనిచేయకుండా ప్రజల అభివృద్ది, సంక్షేమమే ద్యేయంగా పనిచేయడమే పార్టీ సిద్ధాంతం. రానున్న ఎన్నికల్లో మహిళలే ముఖ్య భూమిక పోషించి పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయాలి. – భూమన కరుణాకరరెడ్డి,శ్రీకాకుళం–విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఎన్నికలకు సిద్ధంకావాలి రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకం. గతంలో మహిళలకు ఓటు లేదు. ఇపుడు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణ, పోలింగ్‌బూత్ కన్వీనర్ల పాత్ర ఎంతో కీలకం. క్షేత్రస్థాయి నుంచి పార్టీ జెండా, దాని ఆవశ్యకత, జెండాలోని 9 అంశాల ప్రాముఖ్యతను బూత్‌స్థాయి కన్వీనర్లకు విశదీకరించి, వాటిని గ్రామీణస్థాయిలో ప్రజలకు తెలియజేయాలి. రాబోయే ఎన్నికల సంగ్రామంలో పోరాడేందుకు బూత్‌స్థాయి కన్వీనర్లకు, సభ్యులకు ఈ శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయి.– ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ సోషల్ మీడియా పాత్ర చాలా కీలకం రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర కీలకం. ప్రస్తుతం ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండదేమోగానీ, సెల్‌ఫోన్ లేని ఇళ్లంటూ ఉండదు. 2010 నుంచి సోషల్ మీడియా ప్రాముఖ్యత చాలా ఎక్కువైంది. 15 నుంచి 40 ఏళ్లమధ్య వయస్సు ఉన్న వారు 90 శాతం మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాను ఉపయోగించి మంచి ఫలితాలు సాధించింది. 2016లో కేరళలో జరిగిన ఎన్నికల్లో 60శాతం ఓట్లను సోషల్ మీడియా ప్రభావితం చేసింది. సోషల్ మీడియా బృందానికి తగిన శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. సమచార హక్కు చట్టంపై కూడా సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. దీని ద్వారా అధికారులు, ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికితీయవచ్చు.– ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి, శిక్షకుడు మహిళల పాత్రే కీలకం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళలదే కీలకపాత్ర. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్న చంద్రబాబు హామీని నమ్మి మహిళలంతా మోసపోయారు. ఇప్పుడు వారంతా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ పాలనలో చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రేషన్ డిపోల్లో 9 నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు. ఇప్పుడు కేబియ్యం తప్ప మరే ఇతర వస్తువులూ అందడం లేదు. రాజధాని నిర్మాణమంటూ 57వేల ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 2018–19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు మంజూరు చేయని దుస్థితి. ఒకవేళ నిధులు మంజూరు చేస్తే అవి ఎక్కడ బాబు జేబులోకి వెళ్లిపోతాయోనని కేంద్రపెద్దల ఆలోచన. ఆరు నెలలుగా బీదలకు ఉపాధిహామీ వేతనాలు అందని దుస్థితి. – ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ జగన్‌తోనే సంక్షేమ రాజ్యం సాధ్యం ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ రాజ్యం సాధ్యం. జనంలో పార్టీ బలంగా ఉంది. దీనిని బూత్‌స్థాయికి తీసుకువెళ్లాలి. జగన్ తనశక్తి, యుక్తులతో ప్రజాసంకల్ప పాదయాత్ర చేపడుతున్నారు. ఈ పాదయాత్రకు వస్తున్న జనాలను ఓటర్లుగా మలచుకుని బూత్‌వద్దకు తీసుకువచ్చే గురుతర బాధ్యత మనందరిపైనా ఉంది. గడచిన ఎన్నికల్లో మన పార్టీ వైఫల్యాలను విశ్లేషించుకున్నాం. వైఎస్సార్ ఆశయాలు, సిద్ధాతాల సాధనే ధ్యేయంగా వచ్చిన జగన్‌ను గెలిపించుకుంటేనే ఆయన లక్ష్యాన్ని నెరవేర్చినవారమవుతాం. పార్టీ బూత్‌స్థాయి కన్వీనర్లు సైనికుల్లా తయారవ్వాలి. జగన్‌పై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి. క్షేత్రస్థాయినుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకే ఈ శిక్షణా తరగతులు.– తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదు ‘దేశంలో ఉండే ప్రజలకు న్యాయం జరిగేందుకు అనేక చట్టాలు ఉన్నా అమలు అంతంతమాత్రమే. రాజకీయాల్లో కులం, మతం అధిక పాత్ర పోషిస్తున్నాయి. ఇళ్లు, పింఛన్, రేషన్‌కార్డులు, రుణాలను వైఎస్ ఇచ్చారని, వాటన్నింటినీ చంద్రబాబు తీసివేశారు. ప్రశ్నిస్తే పసుపుచొక్కా వేసుకుంటేనే ఇస్తామని చెప్పడం విడ్డూరం. ఇదేనా సామాజిక న్యాయం. – బొడ్డేపల్లి నర్సింహులు, సీనియర్ దళిత నాయకులు -
'మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్న చంద్రబాబు'
శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు పాల్పడుతున్నారని వికిలీక్స్ పత్రిక వెల్లడించిందని, దీన్ని ఆయన కాదనగలరా అని ప్రశ్నించారు. రూ. 7.5 కోట్లతో ట్యాపింగ్ పరికరాలు కొనుగోలుకు యత్నిస్తూనే మరోవైపు తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని మాట్లాడడం ఎంత వరకూ సమంజసమన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, గవర్నర్, శాసనసభ వ్యవస్థలను పాలకులు భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఇపుడు కార్యనిర్వాహక వ్యవస్థను సైతం భ్రష్టుపట్టించడానికి యత్నిస్తున్నారని విమర్శించారు.