శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో నిరుద్యోగ యువతను నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు మోసం చేశారని, ఇందుకు ఆయనను యువత ఎన్నటికీ క్షమించదని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఎన్నికల ముందు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై హామీలిచ్చిన చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు తప్ప ఇంకెవరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతికి సవాలక్ష ఆంక్షలు విధించి అర్హులకు పరీక్ష పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు 5.39 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే స్క్రూటినీ చేసి 1.62లక్షల మందిని అర్హులుగా గుర్తించడం దారుణమన్నా రు. చంద్రబాబు మాటలు నమ్మి యువత మోసపోయారని అన్నారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి ఇవ్వడం వంటి అనేక అంశాలు సాధ్యం కాదని అప్పుడే వైఎస్సార్‌సీపీ ఎన్నికల కమిషన్‌కి అఫిడవిట్ ఇస్తే దానిపై ఎలాంటి పరిశీలన చేయకుండా వదిలేశారన్నారు.
రాష్ట్రం లో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరోక్షంగా నిర్వీ ర్యం చేసేందుకు గత నాలుగేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాల మూ సేస్తున్నారన్నారు. ఎంతసేపూ విదేశాలు తిరుగుతూ కాలం గడిపేస్తున్నారే తప్ప రాష్ట్రంలో ఎన్ని ఖాళీలున్నాయో కూడా సీఎంకు తెలీదన్నారు. అబద్ధాలతో ఉన్న ఎన్నికల మ్యాని ఫెస్టోను అధికారికంగా ఉన్న వెబ్‌సైట్‌లోంచి తొలగించేయడం సరికాదన్నారు. హామీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచీ పోరాడుతున్న ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. సమావేశంలో పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, పార్టీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయరావు, తమ్మినేని చిరంజీవినాగ్ (నాని), మండవిల్లి రవి, కోరాడ రమేష్, టి.కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
నేడు, రేపు 48 గంటలు ధర్నా
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబుకి వ్యతిరేకంగా అక్టోబర్ 2, 3 తేదీల్లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నామని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ విద్యార్థి విభాగం జిల్లా ఇన్‌చార్జి మెంటాడ స్వరూప్ తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో వైఎస్సార్ కూడలి ఏడురోడ్లు కూడలి వద్ద ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమానికి జిల్లాలో అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు హాజరవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment