May 24th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Assembly Elections 2024: Political News Updates In Telugu On May 24th, 2024 | Sakshi
Sakshi News home page

May 24th AP Election News Updates: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Fri, May 24 2024 6:56 AM | Last Updated on Fri, May 24 2024 1:43 PM

Ap Elections 2024 May 24 Political Updates Telugu

May 24th AP Elections 2024 News Political Update

01:42 PM, May 24th, 2024
ఆరోగ్యశ్రీ ఆగలేదు.. అయినా అసత్య ప్రచారమే!

  • ఏపీ వ్యాప్తంగా డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయి
  • ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు
  • అయినా కూడా నిలిచిపోయాయంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు  
  • రెండు రోజుల క్రితం నెట్ వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది.
  • మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా
  • సమీక్ష ఇప్పటికే.. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3566 కోట్లు చెల్లించింది
  • 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు తొలి రెండు నెలలలో రూ.366 కోట్ల చెల్లింపులు
  • ఇక ఏడాది కాలంగా రోజుకి సరాసరిన 5349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న(మే 22, బుధవారం) 6718 మందికి..
  • నిన్నన(మే 23, గురువారం) 7118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి: ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా 
  • ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్ వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయి
  • పొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి.. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదు

11:45 AM, May 24th, 2024
బెంగుళూరు రేవ్ పార్టీకి, నాకు ఎలాంటి సంబంధం లేదు: మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

  • నెల్లూరు:
  • మాజీ మంత్రి సోమిరెడ్డి నా పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాడు
  • బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను
  • మాజీ మంత్రి సోమిరెడ్డికి దమ్ము దైర్యం ఉంటే.. అయన కూడా బ్లడ్ శాంపిల్ ఇవ్వగలడా..?
  • నా పాస్ పోర్ట్ నా వద్దే ఉంది.. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం చెప్పాను
  • సోమిరెడ్డిలాగా నాది నీచమైన చరిత్ర కాదు.. తాగుడుబోతులు మాట్లాడే మాటలు ఎవ్వరూ పట్టించుకోరు
  • రేవ్ పార్టీలోని నిందితులకు, నాకు ఎలాంటి సంబంధాలు లేవు
  • నా కారు స్టిక్కర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాం
  • నిందితులు గోపాల్ రెడ్డితో తనకు పరిచయం ఉన్నట్టు ఒక్క ఆధారమైన సోమిరెడ్డి చూపగలడా..?
  • రాజకీయంగా ఎదుర్కోలేకే సోమిరెడ్డి నాపై ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నాడు
  • సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి
  • పురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లాడు
  • సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నేను చేస్తున్న ఆరోపణలన్ని పచ్చి నిజాలే..

11:00 AM, May 24th, 2024
టీడీపీ నేతల అరాచకం.. కొనసాగుతున్న అరెస్ట్‌లు

  • పల్నాడు జిల్లాలో పోలింగ్‌ రోజున టీడీపీ నేతల విధ్వంసం కేసులో కొనసాగుతున్న అరెస్టులు
  • రోజు భారీ స్థాయిలో కొనసాగుతున్న అరెస్టులు
  • 146 కేసుల్లో 1500 మందిని పైగా నిందితుల్ని గుర్తించిన పోలీసులు
  • ఇప్పటికే వెయ్యి మందికి పైగా నిందితుల అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఇప్పటికే భారీ స్థాయిలో నిందితుల అరెస్టులు
  • పరారీలో ఉన్న వారి కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసిన ఎస్పీ మల్లికా గార్గ్
  • కౌంటింగ్ నేపథ్యంలో 400 మంది అనుమానితులను బైండోవర్ చేసిన పోలీసులు
  • నరసరావుపేట సబ్ డివిజన్‌లో కొత్తగా ఐదుగురిపై రౌడీషీట్లు ఓపెన్ చేసిన పోలీసులు

9:58 AM, May 24th, 2024
చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

  • చంద్రబాబు పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు
  • 2019 ఎన్నికలలో  వచ్చింది 23 స్థానాలే
  • ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు
  • జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నది
  • ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?
  • ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే  పరిమితం కాబోతున్నావని తెలిసి.. నీ మీద జాలేస్తోంది
     

     
     

8:28 AM, May 24th, 2024
ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ

  • జూన్‌ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్టు చెయ్యొద్దని పోలీసులకు ఆదేశం
  • కౌంటింగ్‌ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్‌రెడ్డికి ఆదేశం
  • నలుగురి కంటే ఎక్కువ మందితో తిరగరాదు
  • ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదు
  • సాక్షులను ప్రభావితం చేయరాదు.. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదు
  • హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు స్పష్టీకరణ
  • వీరిపై నిఘా పెట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం

8:23 AM, May 24th, 2024
టీడీపీ రిగ్గింగ్‌లపై ఈసీకి మరోసారి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

  • పోలింగ్ రోజు 16 నియోజకవర్గాలలో టీడీపీ రిగ్గింగ్‌కి పాల్పడినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు
  • 60కి పైగా పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరిన వైఎస్సార్‌సీపీ
  • పోలింగ్ రోజు పలుచోట్ల యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్
  • పచ్చమూక రిగ్గింగ్ చేసుకోవడానికి సహకరించిన కొందరు పోలీస్ అధికారులు
  • రిగ్గింగ్ జరిగిన ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ పరిశీలించాలంటున్న వైఎస్సార్‌సీపీ
  • ఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ పర్సంటేజ్‌ని గమనించినా రిగ్గింగ్ జరిగిందో లేదో అర్ధమవుతోందంటున్న వైఎస్సార్‌సీపీ
  • చేసిన రిగ్గింగ్ బయటపడుతుందనే రీపోలింగ్ కోరని టీడీపీ
  • పల్నాడు జిల్లాలో టీడీపీ రిగ్గింగ్‌పై పోలింగ్ రోజే ఈసికి ఫిర్యాదు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  • రిగ్గింగ్‌కి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
  • పిన్నెల్లి ఫిర్యాదుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోని ఈసీ

8:05 AM, May 24th, 2024
నగరి టీడీపీ అభ్యర్థి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

  • ఫలితాలు రాకముందే గాలి భానుప్రకాష్‌ను నగరి ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఫ్లెక్సీల ఏర్పాటు 
  • బీఎస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ను ప్రారంభించిన భానుప్రకాష్‌
  • ఎన్నికల అధికారికి మున్సిపల్‌ చైర్మన్‌ హరి ఫిర్యాదు  

7:19 AM, May 24th, 2024
టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?: సజ్జల రామకృష్ణారెడ్డి

  • ఒక్క పాల్వాయి గేట్‌ వీడియోనే ఎలా లీక్‌ అయ్యింది?
  • అది కూడా చిన్న క్లిప్పింగే ఎలా బయటకు వచ్చింది?
  • 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఎన్నికల కమిషనే చెబుతోంది
  • ఆ వీడియోలను ఎందుకు రిలీజ్‌ చేయట్లేదు?
  • అమాయక ఓటర్లపై దాడులు చేసిన టీడీపీ గూండాలపై చర్యలకెందుకు వెనుకాడుతున్నారు?
  • ఎన్నికల కమిషన్‌కు ప్రశ్నలు సంధించిన సజ్జల  

7:10 AM, May 24th, 2024
మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..టీడీపీ నేతల దాడి

  • పోలింగ్‌ రోజున మహిళా పోలీస్‌ అనూషపై టీడీపీ నేతల దాడి
  • ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో ఘటన
  • ఎస్పీని కలవకుండా మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
  • చివరికి కలెక్టర్‌ ఆదేశాలతో టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు
  • రాజీకి ఒప్పుకోలేదని కౌంటర్‌ కేసూ నమోదు చేశారని బాధితురాలి ఆవేదన

7:07 AM, May 24th, 2024
ఆ వీడియో లీక్‌ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవో

  • అది మేము విడుదల చేయలేదు
  • ఈసీకి సంబంధం లేదు
  • దర్యాప్తు సమయంలో బయటకు వెళ్లి ఉండవచ్చు
  • దానిపైనా విచారణ చేస్తున్నాం
  • ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు
  • మీడియాతో సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా

7:03 AM, May 24th, 2024
టీడీపీ రీపోలింగ్‌ ఎందుకు కోరలేదు?

  • మాచర్లలో విచ్చలవిడిగా రిగ్గింగ్‌ చేసిన టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి
  • అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడి
  • రిగ్గింగ్‌ అడ్డుకోవడంతో తుమృకోటలో నాలుగు ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
  • అయినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు
  • పోలింగ్‌ సక్రమంగా జరగలేదంటూ గగ్గోలు
  • అయినా రీపోలింగ్‌ కోరని టీడీపీ
  • అంటే తమకు అనుకూలంగా ఎన్నికలు జరిగినట్లేగా..
  • మరోవైపు.. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రీపోలింగ్‌ కోరిన ఎమ్మెల్యే పిన్నెల్లి 
  • రీపోలింగ్‌ జరగకుండా ఎన్నికల అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి

6:56 AM, May 24th, 2024
పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..

  • పల్నాట గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు.. ఆపై రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ నేతలు
  • ఓటింగ్‌ తరువాత కూడా బడుగు, బలహీన వర్గాలపై దాడులు కొనసాగింపు
  • వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో బేడ బుడగ జంగాలపై దాడి.. రెంటచింతల మండల పరిధిలోని గోలిలో ఎస్టీలపై దాడి
  • తొండేపి గ్రామాన్ని వదలి ప్రాణభయంతో బయట తలదాచుకుంటున్న మైనార్టీలు
  • చిలకలూరిపేట మండలం కావూరులో ఎస్సీలకు తాగునీరు నిలిపివేత
  • కొత్త గణేషునిపాడు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను వెళ్లగొట్టిన టీడీపీ నేతలు
  • చివరకు బాధితులపైనే కేసులు నమోదు  
  • పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు, అనిల్‌ కుమార్‌పైనా దాడి
  • పట్టించుకోని పోలీసు యంత్రాంగం
     

6:40 AM, May 24th, 2024
కూటమి సేవలో 'ఘనాపాఠి'

  • చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి.. పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు
  • కీలక అధికారుల ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారి
  • పోలీసులను కట్టడి చేసి టీడీపీ గూండాగిరికి అండదండలు
  • కౌంటింగ్‌ రోజు మరోసారి అలజడికి కొమ్ము కాస్తున్న వైనం
  • పచ్చ ముఠాలను ఇంతవరకు అరెస్ట్‌ చేయకపోవడమే నిదర్శనం
  • టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్‌
  • పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన్ను తక్షణం బదిలీ చేయాలంటున్న పోలీస్‌ యంత్రాంగం
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement