కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన బీజేపీ | BJP fields Six rebel Congress MLAs Himachal Pradesh assembly polls | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన బీజేపీ

Published Tue, Mar 26 2024 2:07 PM | Last Updated on Tue, Mar 26 2024 4:00 PM

BJP fields Six rebel Congress MLAs Himachal Pradesh assembly polls - Sakshi

ఢిల్లీ:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య​ర్థులు ఐదు జాబితాను విడుదల బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. తాజాగా లోక్‌సభ ఎన్నికలతో  పాటు హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. హిమాచల్‌​ ప్రదేశ్‌లో  రాజ్యసభ  ఎంపీ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఆరుగురు రెబల్‌ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు కాంగ్రెస్‌, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. అనంతరం హిమాచల్‌ కాంగ్రెస్‌ అనర్హత ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు.

తాజాగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో వారు చోటు సంపాధించుకున్నారు. సుధీర్‌శర్మ- ధర్మశాల, రవి ఠాకుర్‌- లాహౌల్ అండ్‌ స్పితి, రాజిందర్‌ రానా- సుజన్‌పూర్‌, ఇందర్‌ దత్‌ లకాన్‌ పాల్- బర్సార్‌, చైతన్య శర్మ- గాగ్రేట్‌, దేవిందర్ కుమార్‌ భుట్టో- కుట్లేహర్‌ స్థానాల్లో బరిలోకి దిగనున్నారు.

ఈ ఆరు స్థానాలకు ఏడు విడతలో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. అదే రోజు హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాకుల కూడా పోలింగ్‌ జరగనుంది. అదే విధంగా గుజరాత్‌లో ఐదు స్థానాలు, కర్ణాటకలో ఒక స్థానం, పశ్చిమ బెంగాల్‌లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement