జేడీ(ఎస్) రెబల్ ఎమ్మెల్యేలపై కొరడా
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటెయ్యడం ద్వారా ధిక్కారస్వరం వినిపించిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై జేడీ(ఎస్) కొరడా ఝుళిపించింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. నోటీసులు కూడా జారీ చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి ఎం. ఫారూక్ ఓటు వేయకుండా వీరంతా క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో ఈ చర్య తీసుకుంది.
జమీర్ అహ్మద్‌ఖాన్, చలువరాయస్వామి, బాలకృష్ణ, ఇక్బాల్ అన్సారి, అఖండ శ్రీనివాసమూర్తి, బండిసిద్దేగౌడ, గోపాలయ్య, భీమేగౌడలు అధినాయకత్వం పై ధిక్కారస్వరం వినిపించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో కాంగ్రెస్ మూడో అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. కాంగ్రెస్ నుంచి జైరాం రమేశ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ రామ్మూర్తి గెలుపొందారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గిలిచారు. బీజేపీ ఇద్దరు స్వతంత్రులు మద్దతు పలికారు.