సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
తమకు అనర్హత వేటు నోటీసులు పంపడాన్ని తప్పుబడుతూ.. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదుల్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తూనే.. తదుపరి విచారణను వచ్చే నెల 26వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
చదవండి: వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ విచారణ
Comments
Please login to add a commentAdd a comment