సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్‌సీపీ కొత్త ఊపు తీసుకొచ్చింది. అభిమానుల కోసం కొత్త పాట ‘సిద్ధం’ను విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన, విపక్షాల కుట్రలకు ‘సిద్ధం’ పాట అద్ధం పడుతోంది. ప్రస్తుతం ‘సిద్ధం’ పాట సోషల్ మీడియాలో హోరెత్తుతోంది.
ఇక.. ఇప్పటికే విడుదలైన ‘జగనన్న అజెండా’ పేరుతో విడుదలైన వీడియో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాట యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాట వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై విపరీతంగా షేర్ చేస్తున్నారు. ‘‘మీబిడ్డ ఒక్కడే ఒక వైపు ఉన్నాడు.. చెప్పుకోవడానికి ఏమీ లేని వాళ్లంతా ఏకం అవుతున్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి, మీరే సైనికులుగా కదలండి’’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాయిస్‌తో మొదలయ్యే ఈ పాటను నల్లగొండ గద్దర్ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు.
జగనన్న అజెండా సాంగ్….🎵🎶
— YSR Congress Party (@YSRCParty) January 13, 2024
Jagananna Agenda Full Song…@ysjagan @JaganannaCNCTS#JaganannaAgenda#YSJagan#YSJaganAgain#YSRCPNewSong#YSJaganNewSong pic.twitter.com/dhD4joKIOZ
Comments
Please login to add a commentAdd a comment