కర్ణాటక: టార్గెట్‌ 15మంది ఎమ్మెల్యేలు! | Five Congress MLAS disappeared in Karnataka? | Sakshi
Sakshi News home page

Published Wed, May 16 2018 10:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Five Congress MLAS disappeared in Karnataka? - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా ఇటు బీజేపీ, అటు జేడీఎస్‌-కాంగ్రెస్‌ పావులు కదుతుపుతుండటంతో అనూహ్య మలుపులు తిరుగుతోంది. మెజారిటీ సంఖ్యాబలం ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరాలని జేడీఎస్‌-కాంగ్రెస్‌ భావిస్తుండగా.. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ వాటి ప్రయత్నాలకు గండికొట్టి.. తామే ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తోంది. ఇటు జేడీఎస్‌-కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అటు బీజేపీ ఆ రెండు పార్టీలను చీల్చాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

టార్గెట్‌ 15 మంది ఎమ్మెల్యేలు..
కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో ఇప్పటికే బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్టు చెప్తున్నారు. ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు శ్రీరాములుతోపాటు మరికొందరు సీనియర్‌ నేతలకు బీజేపీ అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే లింగాయత్‌ వర్గానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాయం అయినట్టు వినిపిస్తోంది. పార్టీ నాయకులకు ఆ ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. లింగాయత్‌ ఎమ్మెల్యేలతో యడ్యూరప్ప రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. ఇటు దేవెగౌడ కొడుకు రేవణ్ణతూనే బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రేవణ్ణ వర్గం తమకు మద్దతునిస్తే.. కేంద్రమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్‌ చేసినట్టు సమాచారం. మొత్తానికి ఇటు జేడీఎస్‌ నుంచి, అటు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలను తమవైపు ఫిరాయించేలా వ్యూహాల పదును పెట్టిన బీజేపీ.. ఆ మేరకు మైండ్‌గేమ్‌ను కూడా ముమ్మరం చేసింది. ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జోరుగా సాగిస్తోంది.

ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే లక్ష్యం!
బీజేపీ బారి నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనే కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా దృష్టిపెట్టింది.  తాము గెలిచిన 78 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ కూడా బీజేపీలో చేరకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. అనుమానం ప్రతి ఎమ్మెల్యేను తాము అధికారంలో ఉన్న పంజాబ్‌లోని రిసార్ట్స్‌కు కాంగ్రెస్‌ పార్టీ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లింగాయత్‌ ఎమ్మెల్యేలు యడ్యూరప్పపై సానుకూలంగా ఉన్నారని తెలుస్తుండటం కాంగ్రెస్‌ను కలవర పరుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ అధిష్టాన దూతలు అశోక్‌ గెహ్లాట్‌, గులాం నబీ ఆజాద్‌ అనుమానమున్న ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement