
బెంగళూరు/ఇండోర్: పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ జరిపిన దాడుల్లో కుట్ర కోణం ఉందేమోనని కర్ణాటక మంత్రి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ‘44 మందికి 22 సీట్లు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప చేసిన ప్రకటనతో ప్రజల్లో అనుమానాలున్నాయి. సైనికుల త్యాగాలను వాడుకుని కర్ణాటకలోని 22 సీట్లు గెలుచుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది’అని మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ జరిపిన దాడితో ప్రధాని మోదీ ఆదరణ పెరిగిపోయిందనీ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ సీట్లలో 22 తమ పార్టీనే గెలుచుకుంటుందంటూ యడ్యూరప్ప ప్రకటన చేశారు. దీంతో బీజేపీపై ఆరోపణలు వెల్లువెత్తాయి.