సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఫైటర్‌జెట్లపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుగా చిత్రీకరిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక రకంగా అంటే.. ప్రతిపక్షాలు మరోరకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..అసలు ప్రతిపక్ష నేతలకు కామన్‌సెన్స్ ఉండా అని ప్రశ్నించారు. నేను చేసిన వ్యాఖ్యలు కొంచెం బుద్దితో ఆలోచించినా అందరికి అర్థం అవుతుందన్నారు.భారత్ దగ్గర రఫేల్ ఫైటర్‌జెట్లు ఉండుంటే ఇటీవల పాకిస్తాన్‌తో తలెత్తిన ఘర్షణల ఫలితం మరోలా ఉండేదని నరేంద్ర మోదీ అన్న సంగతి తెలిసిందే. రాఫెల్ సమయానికి రాకపోవడానికి స్వార్థ ప్రయోజనాలే కారణమని ఆయన కాంగ్రెస్‌ను నిందించారు. అయితే తాను భారత సైనిక శక్తి, వైమానిక దాడులను శకించిన్నట్లుగా కాంగ్రెస్ నేతలు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. (రఫేల్ ఉంటే ఫలితం మరోలా ఉండేది)
‘దయచేసి మీ (కాంగ్రెస్ నేతలు) కామన్ సెన్స్‌ను వాడండి. దాడుల సమయంలో మన దగ్గర్ రఫెల్స్ ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. మన విమానం ఒక్కటి కూడా కూలేదు కాదు, పాకిస్తాన్ విమానం ఒక్కటి కూడా మిగిలేది కాదు అని నేను అన్నాను. కానీ నా వాఖ్యలను మీరు(కాంగ్రెస్ నేతలు) తప్పుగా చిత్రీకరిస్తున్నారు. నేను సైనికుల శక్తిని శంకిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రఫెల్‌ను సరైన సమయానికే మనం పొంది ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నది నా ఉద్దేశం. కామెన్ సెన్స్‌తో ఆలోచింని మాట్లాడండి’ అని మోదీ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దయచేసి కామన్ సెన్స్ వాడండి : మోదీ
Published Mon, Mar 4 2019 6:34 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment