rafale jets
-
రఫెల్ డీల్ ముడుపుల ఆరోపణలు
-
2022 నాటికి వాయుసేనలోకి ‘రఫేల్’
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో 2022 నాటికి 36 రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని భారత వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ బదౌరియా పేర్కొన్నారు. కరోనా కారణంగా ఫ్రాన్స్ నుంచి ఒకట్రెండు విమానాల రాకలో జాప్యం జరిగిందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రఫేల్ వినామాలను వాయుసేనలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. భారత-చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులపై ప్రశ్నించగా.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సమస్య చర్చల దశలో ఉందని పేర్కొన్నారు. వివాదాస్పద ప్రాంతం నుంచి ఇరు దేశాల బలగాల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపులపై నిఘా కొనసాగుతోందని చెప్పారు. పరిస్థితులకు తగ్గట్లు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రక్షణపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ పూర్తి చేసుకుని యువత ఎయిర్‌ఫోర్స్‌లోకి అడుగుపెడుతోందని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్లు ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగంలో 161 మంది ఫ్లైట్ క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) నిర్వహించారు. ఆరుగురు నావికా దళ అధికారులు, ఐదుగురు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకోవడంతో వారికి ‘వింగ్స్’ప్రదానం చేశారు. ఫ్లయింగ్ ఆఫీసర్ ప్రజ్వాల్ అనిల్ కులకర్ణి పైలట్స్ కోర్సులో ప్రథమ స్థానంలో నిలిచి ప్రెసిడెంట్ పతకంతో పాటు ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డును అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ విభాగంలో తొలి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ కృతిక కుల్హారీకి ప్రెసిడెంట్ పతకం లభించింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ అధికారులు గగనతలంలో శిక్షణ విమానాలు నడిపి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. హవాక్స్, చేతక్, సారంగ్ హెలికాప్టర్లు, కిరణ్ విమానాల ఏరోబాటిక్ విన్యాసాలు ఆహూతులను అలరించాయి. -
ఘోర ప్రమాదం: రాఫెల్ ఫేమ్ ఓలివర్ డసాల్ట్ దుర్మరణం
ప్యారిస్: ఫ్రెంచ్ బిలియనీర్, ఎంపీ, యుద్ధ విమానాల తయారీ సంస్థ రఫేల్‌కు చెందిన ఓలివర్ డసాల్ట్ రాఫెల్ (69) దుర్మరణం తీవ్ర విషాదాన్ని రేపింది. ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఒలీవర్‌తో పాటు పైలెట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. హెల్‌కాప్టర్ ప్రమాదంలో ఆలీవర్ దుర్మరణంపై సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌ను ఎంతగానో ప్రేమించే ఓలివీర్ ఆకస్మిక మరణం తమకు తీరని నష్టమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ట్వీట్ చేశారు. ఆయన మరణం చాలా బాధాకరం అంటూ కన్జర్వేటివ్ నేత, పారిస్ ప్రాంతీయ అధ్యక్షుడు వాలెరీ పెక్రెస్ ట్విటర్ ద్వారా నివాళులర్పించారు. (Muthoot Group: ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ దుర్మరణం) కాగా ఫ్రెంచ్ విమానాల తయారీ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు మార్సెల్ డసాల్ట్ మనవడు ఓలివర్ డసాల్ట్. దివంగత ఫ్రెంచ్ బిలియనీర్ పారిశ్రామికవేత్త సెర్జ్ డసాల్ట్ పెద్ద కుమారుడు. ఓలివర్ 2002లో ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభకు ఎన్నికయ్యారు. ఓలివర్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగానూ కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని బిలీనియర్ల జాబితాలో 361వ స్థానంలో ఒలివర్ ఉన్నారు. ఈయన సంపద 6.3 బిలియన్ యూరోలు. ఒలీవర్ డస్సాల్ట్‌కు ముగ్గురు పిల్లలున్నారు. భారత్‌కు రాఫెల్ యుద్ధవిమానాలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. Olivier Dassault aimait la France. Capitaine d’industrie, député, élu local, commandant de réserve dans l’armée de l’air : sa vie durant, il ne cessa de servir notre pays, d’en valoriser les atouts. Son décès brutal est une grande perte. Pensées à sa famille et à ses proches. — Emmanuel Macron (@EmmanuelMacron) March 7, 2021 -
గణతంత్ర వేడుకల్లో రఫేల్ జిగేల్
న్యూఢిల్లీ: భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలు కరోనా ఆంక్షల మధ్య జరగనున్నాయి. ఈ నెల 26న దేశ సైనిక సత్తా చాటడానికి త్రివిధ బలగాలు సిద్ధమయ్యాయి. అయితే కోవిడ్–19 కారణంగా భారీగా మార్పులు చేర్పులు చేశారు. ప్రజా సందర్శనకి ఆంక్షలతో పాటు ఎన్నో కొత్త శకటాలు ఈ ఏడాది దర్శనమివ్వనున్నాయి. రఫేల్ యుద్ధ విమానాలను తొలిసారిగా ఈ ఏడాది పెరేడ్లో ప్రదర్శించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ నుంచి వచ్చిన రఫేల్ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. మొట్టమొదటిసారిగా మహిళా యుద్ధ పైలెట్ లెఫ్ట్‌నెంట్ భావనాకాంత్ ఈ సారి ప్రదర్శనలో పాల్గొంటారు. భారత వాయుసేనకు చెంది తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్–30 విమాన శకటాలను భావన ముందుండి నడిపిస్తారు. గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్ ప్రాతినిధ్యం వహించబోతోంది. లేహ్ జిల్లాలో చారిత్రక థిక్సే మఠాన్ని ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. థిక్సే కొండలపై ఉన్న ఈ మఠం ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం తొలిసారిగా శకటంగా దర్శనమివ్వబోతోంది. భారత నావికాదళం ఐఎన్ఎస్ విక్రాంత్ 1971 భారత్–పాక్ యుద్ధ సమయంలో నావికా దళ ఆపరేషన్‌ను శకటంగా ప్రదర్శిస్తోంది. ఇక వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు భారీ ర్యాలీకి సిద్ధం కావడంతో ఎలాంటి పరిణామలు ఎదురు కాబోతాయా అన్న ఆందోళనైతే నెలకొంది. కరోనా ఆంక్షల ప్రభావం కోవిడ్–19 ఆంక్షల ప్రభావంతో ఈ సారి ముఖ్య అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తొలుత రావడానికి అంగీకరించినప్పటికీ కరోనా విజృంభణతో పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో అయిదు దశాబ్దాల తర్వాత ముఖ్య అతిథి లేకుండానే వేడుకలు జరగనున్నాయి. గతంలో 1952, 1953, 1966లలో ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి కరోనా కారణంగా సందర్శకుల సంఖ్యని బాగా తగ్గించారు. గత ఏడాది లక్షా 50 వేల మందికి అనుమతినిస్తే ఈ సారి 25 వేల మంది హాజరుకానున్నారు. ఇక మీడియా సిబ్బంది సంఖ్య 300 నుంచి 200కి తగ్గించారు. ఈ సారి పాఠశాల విద్యార్థులు పెరేడ్లో ఉండరు. ఇక 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిని ఇండియా గేట్ లాన్స్‌లోకి మాత్రమే అనుమతినిస్తారు. పెరేడ్ సమయాన్ని కూడా తగ్గించారు. ఇండియా గేట్ దగ్గర నేషనల్ స్టేడియం వరకు మాత్రమే పెరేడ్‌కు అనుమతినిచ్చారు. ఇక శకటాలు మాత్రం ఎర్రకోట వరకు వెళతాయి మాజీ సైనికాధికారులు, మహిళా అధికారులు పాల్గొనే కార్యక్రమాలను రద్దు చేశారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించే మోటార్ సైకిల్ స్టంట్స్ కూడా ఈ సారి ఉండవు. శనివారం రాజ్‌పథ్‌లో ఫుల్ డ్రెస్ రిహార్సల్లో భారత యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామగ్రి -
అంబాల : ఎయిర్‌ఫోర్స్‌లోకి రఫెల్ యుద్ధ విమానాలు
-
రఫెల్ డీల్ : రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత రాజకీయాల్లో వివాదాల పుట్టగా పేరొందిన రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని లక్క్ష్యంగా చేసుకుని.. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. భారతీయ ఖజానాను రఫెల్ యుద్ధ విమానాల కోసం దోచుకున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా 2024 ఎన్నికల సమయానికి రఫెల్ జెట్స్ భారత సైన్యానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని, అది తమకు ఎన్నికల్లో ఎంతో లబ్ధి చేకూరుతుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ తీవ్రంగా ఖండించారు. భారత సైన్యానికి చెందని రఫెల్‌పై గోయల్ ప్రచారం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నిజం ఒక్కటే మార్గాలే అనేకం’ అంటూ మహ్మాత్మా గాంధీ సూక్తులను జోడించిన రాహుల్ బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సందించారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రఫెల్ జెట్స్ ఒప్పందం తొలినుంచీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఇటీవల ఆరు యుద్ధ విమానులు భారత గడ్డపై అడుగుపెట్టాయి. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. -
అంబాలా ఎయిర్‌బేస్‌కు రఫేల్ యుద్ధ విమానాలు
-
హ్యాపీ ల్యాండింగ్ : రఫేల్ జెట్స్ వచ్చేశాయ్!
-
హ్యాపీ ల్యాండింగ్ : రఫేల్ జెట్స్ వచ్చేశాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం(ఐఏఎఫ్) దీర్ఘకాలంగా వేచిచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం అంబాలా వైమానికి స్ధావరానికి మరికాసేపట్లో చేరుకుంటాయి. భారత గగనతలంలోకి బుధవారం మధ్యాహ్నం తొలి బ్యాచ్‌లో భాగంగా ఐదు రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోగానే భారత నౌకా యుద్ధవిమానం నుంచి భారీ స్వాగతం లభించింది. ‘హిందూ మహా సముద్రానికి స్వాగతం మీరు సగర్వంగా ఆకాశాన్ని తాకవచ్చు..హ్యాపీ ల్యాండింగ్స్’ అంటూ ఐఎన్ఎస్ కోల్‌కతా రఫేల్ జెట్స్‌కు రేడియో సందేశం పంపింది. ఇందుకు రఫేల్ పైలట్ ధన్యవాదాలు తెలిపారు. రఫేల్ యుద్ధవిమానాలు అంబాలకు చేరగానే వాటిని వైమానిక దళంలో చేర్చే కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహిస్తారు. ఇక చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోవడంతో ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు. కాగా, నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి మరికొద్దిసేపట్లో చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సోమవారం సాయంత్రం దిగాయి. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో మొదటి రఫేల్ జెట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది. చదవండి : రా.. రా.. రఫేల్! -
అనుకున్న సమయానికే రఫేల్ జెట్లు
న్యూఢిల్లీ: భారత్‌తో ఫ్రాన్స్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 36 రఫేల్ జెట్లను అందించేందుకు సిద్దంగా ఉన్నామని ఫ్రెంచ్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి ఈమాన్యుల్ లినేన్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో కరోనా ఉదృతి నేపథ్యంలో నెలకొన్న అనుమానాలను తెరదిస్తు కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్ మెదటి రఫేల్ జట్ను 2019 అక్టొబర్ 8న భారత్‌కు అందించింది. భారత్ రఫేల్ తయారీలో కొన్ని సూచనలు ఇచ్చిందని వాటిని పరిగణలోకి తీసుకొని అత్యధునిక సాంకేతికతతో అందించామని ఫ్రెంచ్ ఉన్నతాధికారులు తెలిపారు. భారత వైమానిక దళం సూచించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని అధికారుల పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 1,45,00మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 28,330 మంది మరణించారు. -
‘రఫేల్ జెట్స్’ సరిపోవు: ఐఏఎఫ్ చీఫ్
న్యూఢిల్లీ: పెరుగుతున్న వైమానిక దళ అవసరాలకు త్వరలో దళంలో చేరనున్న రఫేల్ యుద్ధవిమానాలు సరిపోవని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా పేర్కొన్నారు. దేశీయంగా యుద్ధ విమానాలు ఇతర ఆధునిక ఆయుధాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలు త్వరలో వైమానిక దళంలో సేవలందించనున్న విషయం తెలిసిందే. బాలాకోట్ వైమానిక దాడుల తరువాత వైమానిక దళం అందించగల సేవలపై ఉన్న అభిప్రాయంలో కీలక మార్పు వచ్చిందన్నారు. సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ శుక్రవారం నిర్వహించిన ‘ఎయిర్ పవర్ ఇన్ నో వార్ నో పీస్ సినారియో’ సదస్సులో బదౌరియా ప్రసంగించారు. ‘36 రఫేల్ యుద్ధ విమానాలు మన అవసరాలకు సరిపోవు. మనం దేశీయంగా తయారు చేసిన అస్త్ర క్షిపణిని ఎస్‌యూ 30, మిగ్ 29 వంటి ఇతర ఫైటర్ జెట్‌పై ఉపయోగించగలగాలి. అప్పుడే మన వైమానిక శక్తి మరింత పెరుగుతుంది’ అన్నారు. అయితే, ఇతర క్షిపణులను ప్రయోగించగల యుద్ధ విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాల్సి ఉందన్నారు. బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడాలన్న ప్రభుత్వ నిర్ణయం సాహసోపేతమైందన్నారు. మన వైమానిక దళం లక్ష్యాలను కచ్చితంగా చేధించిందన్నారు. మన దాడిపై స్పందించేందుకు పాకిస్తాన్ వైమానిక దళానికి 30 గంటల సమయం పట్టిందని బదౌరియా వ్యాఖ్యానించారు. -
‘కోర్టుకు కాదు.. దేశానికి క్షమాపణలు చెప్పాలి’
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ప్రధానితో పాటు ప్రజలందరినీ రాహుల్ తీవ్రంగా అవమానించాడని అన్నారు. అలాగే ప్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యలను కూడా రాహుల్ వక్రీకరించారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని ఉద్దేశించిన రాహుల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలను చేయవద్దని సూచించింది. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన పలువురు కేంద్ర మంత్రులు విపక్షాలు ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవుపలికారు. దేశ ప్రజలందరికీ రాహుల్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు, ఇటీవల సుప్రీంతీర్పుని సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. అలాగే కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్ డీల్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్ధారించింది. తద్వారా వివాదాస్పదమైన రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చినట్టైంది. -
రాఫెల్ డీల్ : కేంద్రానికి క్లీన్చిట్
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సమీక్ష పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు, ఇటీవల సుప్రీంతీర్పుని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. అలాగే కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. తద్వారా వివాదాస్పదమైన రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చినట్టైంది. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణప పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. రాహుల్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం సూచించింది. కాగా ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించింది. అయితే, తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్ డీల్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్ధారించింది. -
‘రఫేల్’ ఒప్పందంపై ‘ఫేక్’ వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను.. పరిగణనలోకి తీసుకోకూడదంటూ ప్రభుత్వ అటార్నీ జనరల్ కేకే వేణు గోపాల్ బుధవారం కోర్టు ముందు చేసిన వాదన చిత్రంగా ఉంది. ‘రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పత్రాలను రక్షణ శాఖ నుంచి ఎవరో తస్కరించారు. అందులోని అంశాలను హిందూ ఆంగ్ల దిన పత్రిక ప్రచురిస్తే వాటిని ఆధారంగా చేసుకొని ప్రశాంత భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమంగా సాధించిన డాక్యుమెంట్లను ఆధారం చేసుకున్నందున ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోకూడదు. పైగా ఆ డాక్యుమెంట్లలోని అంశాలను హిందూ పత్రిక ప్రచురించడం అనేది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. ఆ మేరకు ఆ పత్రికపై చర్య తీసుకోవచ్చు’ అన్నది అటార్నీ జనరల్ చేసిన వాదన. పిటిషన్లో సవాల్ చేసిన లేదా లేవనెత్తిన అంశాల్లో బలం ఉందా, లేదా ? అవి తప్పా, ఒప్పా ? అని వాదించాల్సిన అటార్నీ జనరల్, అవి దొంగలించినవి, అవి అక్రమంగా సంపాదించినవి అనడం చిత్రమే కాదు, అవివేకం కూడా. రఫేల్ పత్రాలను దొంగలించారంటే, ఆ లెక్కన ప్రశాంత్ భూషణ్ పిటిషన్లో ప్రస్తావించిన అంశాలన్నీ నిజమని తేలినట్లే. పత్రిక మీద అధికార రహస్యాల చట్టం కింద చర్య తీసుకోమని సూచించడం అంటే కేంద్రానికి మద్దతుగా ఏదో దాస్తున్నట్లే లెక్క! మరో పక్క ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే.(రఫేల్ పత్రాలు చోరీ) 1923 నాటి చట్టం ఏమి చెబుతోంది? భారత దేశానికి స్వాతంత్య్ర రాకముందు బ్రిటీష్ హయాంలో అంటే, 1923లో అధికార రహస్యాల చట్టం అమల్లోకి వచ్చింది. జాతీయ భద్రతా లేదా జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు నాటి నుంచి నేటి వరకు పాలకులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఇరుకున పడినప్పుడల్లా ఈ చట్టాన్ని ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయింది. పైగా 2005లో తీసుకొచ్చిన సమాచార హక్కుకు ఈ అధికార రహస్యాల చట్టం పూర్తి భిన్నంగా ఉంది. ఈ చట్టాన్ని సమీక్షించాల్సిందిగా ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమే 2015లో చట్టం సమీక్షకు ఓ ప్యానెల్‌ను నియమించింది. ఆ ప్యానెల్ సమీక్ష ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఇంకెంత కాలం పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో రెండు చట్టాలు పరస్పరం భిన్నంగా ఉన్నందున ప్రభుత్వ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో కేసులు భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని మిలిటెంట్లకు అందజేశారన్న ఆరోపణలపై ఓ కశ్మీర్ జర్నలిస్ట్‌పై అధికార రహస్యాల చట్టం కింద 2006లో కేసు పెట్టారు. దర్యాప్తు సందర్భంగా ఆ సమాచారం ఎంత మాత్రం రహస్యమైనది కాదని, అది ప్రజలందరికి అందుబాటులో ఉన్న సమాచారమేనని తేలింది. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన కేబినెట్ నోట్‌ను బయట పెట్టినందుకు 1998లో కూడా ఓ జర్నలిస్టుపై ఈ చట్టం కింద కేసు పెట్టి వేధించారు. అమెరికా సుప్రీం కోర్టు ఏమి తీర్పు ఇచ్చింది ? ‘వియత్నాంతో ఎన్నేళ్లు యుద్ధం చేసినా విజయం సాధించడం కష్టం. రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం చేయక తప్పడం లేదు. వేలాది మంది యువకుల ప్రాణాలు వృథా అవుతున్నాయి. ప్రాణ నష్టంతోపాటు ఎంతో అర్థిక నష్టం జరుగుతోంది’ అన్న కీలక సమాచారం కలిగిన ప్రభుత్వ రహస్య డాక్యుమెంట్లు అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కాలంలో అమెరికాలోని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికకు దొరికాయి. వాటిని ప్రచురించాలా, వద్దా ? అని అప్పటి ఎడిటర్ ఇన్ చీఫ్ బెన్ బ్రాడ్లీ సంశయించారు. చివరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రచురించాలని నిర్ణయించుకొని వరుసగా ప్రచురించారు. అందులో ఓ భాగాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కూడా ప్రచురించింది. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆ రెండు పత్రికలపైనా అమెరికా ప్రభుత్వం ‘యూఎస్ ఎస్పనేజ్ యాక్ట్’ కింద కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛ ప్రకారం ఆ డాక్యుమెంట్లను ప్రచురించడంలో తప్పు లేదంటూ తొమ్మిది మంది సభ్యులు గల అమెరికా జ్యూరీ 6-3 తేడాతో మెజారిటీ తీర్పు చెప్పింది. ‘ది పోస్ట్’ పేరిట సినిమా పత్రికల న్యాయపోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని హాలివుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత స్టీవెన్ స్పీల్బెర్గ్ ‘ది పోస్ట్’ చిత్రాన్ని నిర్మించారు. 2017లో విడుదలైన ఈ చిత్రంలో పత్రికా సంపాదకుడిగా టామ్ హాంక్స్ నటించారు. పలు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయినా అవార్డులు మాత్రం రాలేదు. -
పాతాళంలో దాక్కున్నా వదలం
జామ్‌నగర్/అహ్మదాబాద్: ‘ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా వదలిపెట్టబోం. వాళ్ల స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి అంతం చేయడమే మన లక్ష్యం. ఒక కార్యక్రమం పూర్తయింది కదా అని ప్రభుత్వం ఆగిపోదు. మరింత కఠిన, తీవ్రమైన మరిన్ని చర్యలకు వెనుకాడబోదు’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్, అహ్మదాబాద్‌లలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. బాలాకోట్‌పై ఐఏఎఫ్ దాడి పైలట్‌ప్రాజెక్టు మాత్రమే.. అసలైన దాడులు ఇకపై మొదలవుతాయని ప్రధాని అన్నారు. పొరుగుదేశం నుంచి ఉగ్రవాదాన్ని రూపుమాపే దాకా ఇవి కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ‘పొరుగు దేశంలో ఉన్న ఉగ్ర వ్యాధి మూలాలను తొలగించి మనం ఆ వ్యాధిని నయం చేయలేమా? ఉగ్రవాదంతో భారత్‌ను నాశనం చేయాలని చూస్తున్న వారిని వేరే దేశంలో ఉన్నాసరే వదలబోం’ అని అన్నారు. బాలాకోట్ ఐఏఎఫ్ దాడికి రఫేల్ విమానాలను వాడితే ఫలితం వేరేలా ఉండేదన్న తన ప్రకటనపై పెడార్థాలు తీసేముందు విపక్ష నేతలు కాస్త విజ్ఞత ప్రదర్శించాలని సూచించారు. ‘రఫేల్ విమానాలు మనకు సకాలంలో అంది ఉంటే బాలాకోట్ దాడి ఫలితం మరోలా ఉండేదని చెప్పా. కానీ, వాళ్లు(ప్రతిపక్షాలు) మన వైమానిక దళాల సామర్థ్యాన్ని నేను అనుమానిస్తున్నానంటూ మాట్లాడుతున్నారు. దయచేసి విజ్ఞతతో మాట్లాడండి. బాలాకోట్ దాడిలో రఫేల్‌ను వాడినట్లయితే మనం ఒక్క ఫైటర్ జెట్‌ను కూడా కోల్పోయే వాళ్లం కాదు. అలాగే, ప్రత్యర్థుల విమానం ఒక్కటీ మిగిలేది కాదనేది నా ఉద్దేశం. నా మాటలను వాళ్లు అపార్థం చేసుకుంటే నేనేం చేయాలి? వాళ్ల పరిమితులు వాళ్లవి’ అని మోదీ వ్యాఖ్యానించారు. బాలాకోట్ దాడులకు ఆధారాలు బయటపెట్టాలంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న డిమాండ్లపై ప్రధాని స్పందిస్తూ.. ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంతో తాను పనిచేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తనను తొలగించేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. నేడు మన ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ పత్రికల్లో ప్రధాన శీర్షికలతో ప్రచురితమవుతాయంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం కాబట్టే ప్రభుత్వం బాలాకోట్ దాడికి పూనుకుందని ప్రతిపక్షాలు భావిస్తే..సర్జికల్ స్టైక్స్(2016)సమయంలో ఏ ఎన్నికలున్నాయి? అని ఆయన ప్రశ్నించారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు పేలవమైన స్వల్పకాలిక విధానాలకు బదులు నిర్మాణాత్మక, దీర్ఘకాలిక చర్యలు అవసరమని తెలిపారు. పదేళ్లకోసారి రైతు రుణాలు మాఫీ చేయడం, ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్ పని అంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని బాంద్రా–జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును, అహ్మదాబాద్ మెట్రో మొదటి దశ(6.5కిలోమీటర్లు)ను ప్రారంభించి వస్త్రాల్– అప్పారెల్ పార్కు ఏరియా మార్గంలో కొంతదూరం మెట్రో రైలులో ప్రయాణించారు. -
దయచేసి కామన్ సెన్స్ వాడండి : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఫైటర్‌జెట్లపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుగా చిత్రీకరిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక రకంగా అంటే.. ప్రతిపక్షాలు మరోరకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..అసలు ప్రతిపక్ష నేతలకు కామన్సెన్స్ ఉండా అని ప్రశ్నించారు. నేను చేసిన వ్యాఖ్యలు కొంచెం బుద్దితో ఆలోచించినా అందరికి అర్థం అవుతుందన్నారు.భారత్ దగ్గర రఫేల్ ఫైటర్జెట్లు ఉండుంటే ఇటీవల పాకిస్తాన్‌తో తలెత్తిన ఘర్షణల ఫలితం మరోలా ఉండేదని నరేంద్ర మోదీ అన్న సంగతి తెలిసిందే. రాఫెల్ సమయానికి రాకపోవడానికి స్వార్థ ప్రయోజనాలే కారణమని ఆయన కాంగ్రెస్‌ను నిందించారు. అయితే తాను భారత సైనిక శక్తి, వైమానిక దాడులను శకించిన్నట్లుగా కాంగ్రెస్ నేతలు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. (రఫేల్ ఉంటే ఫలితం మరోలా ఉండేది) ‘దయచేసి మీ (కాంగ్రెస్ నేతలు) కామన్ సెన్స్‌ను వాడండి. దాడుల సమయంలో మన దగ్గర్ రఫెల్స్ ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. మన విమానం ఒక్కటి కూడా కూలేదు కాదు, పాకిస్తాన్ విమానం ఒక్కటి కూడా మిగిలేది కాదు అని నేను అన్నాను. కానీ నా వాఖ్యలను మీరు(కాంగ్రెస్ నేతలు) తప్పుగా చిత్రీకరిస్తున్నారు. నేను సైనికుల శక్తిని శంకిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రఫెల్‌ను సరైన సమయానికే మనం పొంది ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నది నా ఉద్దేశం. కామెన్ సెన్స్‌తో ఆలోచింని మాట్లాడండి’ అని మోదీ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యూపీఏతో పోలిస్తే చవకే
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులతో పోలిస్తే 2.86 శాతం తక్కువ ధరకు మోదీ సర్కారు ఒప్పందం కదుర్చుకున్నట్టు కాగ్ వెల్లడించింది. బుధవారం రాజ్యసభకు సమర్పించిన 141 పేజీల నివేదికలో ఈ మేరకు పేర్కొంది. 2007, 2015 కొనుగోలు ఒప్పందాలను పోల్చిచూసినట్టు కాగ్ తెలిపింది. రఫేల్ యుద్ధవిమానాల కోసం గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కారు జరిపిన సంప్రదింపుల్లో బేస్ ధరలో ఎటువంటి మార్పులేదని తేల్చింది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఆపరేషనల్ సపోర్ట్ నిర్వహణ 4.77 శాతం తగ్గింది. భారత అవసరాలకు తగినట్లు సాంకేతిక మార్పులు చేయడంలో 17.08 శాతం తగ్గుదల కనిపించింది. ఇంజినీరింగ్ సపోర్ట్ ప్యాకేజీ 6.54 శాతం పెరిగింది. పనితీరు ఆధారిత విషయంలో 6.54 శాతం మెరుగుపడింది. టూల్స్, టెస్టర్స్, గ్రౌండ్ ఎక్విప్‌మెంట్‌లో 0.15 శాతం పెరిగింది. ఆయుధాల ప్యాకేజీలో 1.05 శాతం తగ్గుదల నమోదైంది. పైలట్, సాంకేతిక నిపుణుల శిక్షణ వ్యయం 2.68 శాతం పెరిగిందని కాగ్ వివరించింది. అయితే ధరల వివరాలు వెల్లడించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యం గెలిచింది: బీజేపీ కాగ్ నివేదికపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సత్యం గెలిచిందని, ప్రతిపక్షాల కుట్రలు బయటపడ్డాయని వ్యాఖ్యానించారు. విపక్షాలు ఇకలైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. బీజేపీ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని పేర్కొన్నారు. -
దద్దరిల్లిన పార్లమెంటు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడిపుట్టిస్తున్నాయి. రఫేల్, రామ మందిరం, కావేరీ జలాల సమస్యలపై ఉభయ సభలు దద్దరిల్లాయి. బుధవారం రెండో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే పలు అంశాలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సభా కార్యక్రమాలు నడవకుండానే గురువారానికి ఉభయసభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్, శివసేన, అన్నా డీఎంకే సభ్యులు వారి వారి సమస్యలు తీర్చాలంటూ ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లారు. రఫేల్ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తమిళనాడులోని కావేరీ తీరప్రాంత రైతులకు న్యాయం చేయాలని అన్నా డీఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. వారిని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంతగా వారించినా వారు వినకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో ఆటిజం బిల్లుకు ఆమోదం.. ప్రతిపక్షాలు నినాదాల మధ్యే రాజ్యసభలో ఆటిజం బిల్లుకు ఆమోదం లభించింది. నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజేబిలిటీస్ (సవరణ)–2018 బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో కావేరీ జలాలపై అన్నా డీఎంకే, డీఎంకే పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. వారివారి సీట్లలోకి వెళ్లి కూర్చోవాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య సభ్యులను కోరారు. సభ్యులు వినకుండా నిరసన వ్యక్తం చేస్తుండటంతో పెద్దల సభను చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. -
రాఫెల్: రాహుల్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశ్ కీ చౌకీదార్, అనిల్ అంబానీ కా చౌకీదార్ బన్‌గయా’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ‘రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోల్‌మాల్’ను సజీవంగా ఉంచి లబ్ధి పొందాలని రాహుల్ చూస్తున్నారు. ఆయన వ్యూహం ఫలించేనా? 1437 కోట్ల రూపాయల బోఫోర్స్ ఆయుధాల కొనుగోల్‌మాల్‌లో కేవలం 65 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణల కారణంగా నాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. నేడు ఏకంగా 58 వేల కోట్ల రూపాయల కొనుగోళ్లలో వేలాది కోట్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోతుందా? అసలు ఈ ఆరోపణలను జనం నమ్ముతారా? నమ్మితే ఎంతవరకు? బోఫోర్స్ కుంభకోణాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో నాడు వీపీ సింగ్ విజయం సాధించారు. నాడు మీడియా కూడా కుంభకోణాన్ని ఊదరగొట్టింది. నేడు వీపీ సింగ్ లాంటి నాయకుడు లేరు. నాటి లాగా నేటి మీడియా లేదు. నాడు రాజీవ్ గాంధీని సమర్థుడైన నాయకుడని మధ్యతరగతి ప్రజలు నమ్మలేదు. నేడు నాలుగేళ్ల పాలనలో చెప్పుకోతగ్గ అభివద్ధి ఏమీ సాధించకపోగా, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలు భూమరాంగ్ అయినా మోదీని ఇప్పటికీ మధ్య తరగతి ప్రజలు విశ్వసిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇంకా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. రాఫెల్ యుద్ధ విమానాల్లో భారీ కుంభకోణం జరిగిందంటూ రాహుల్ గాంధీ సహేతుకంగానే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అది సామాన్య ప్రజల్లోకి వెళ్లకపోవడానికి ఈ కారణాలతోపాటు ఆయన ఉపన్యాస ధోరణి కూడా కారణమే. ఈ మధ్య కాస్త ఆవేశంగా మాట్లాడుతున్నప్పటికీ అది రాయించుకున్న స్క్రిప్టును వల్లెవేసినట్లుగా ఉంటుందని తోటి కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. ఆయన ఉపన్యాస ధోరణి పట్టణ ప్రజలను ఆకర్షించకపోగా గ్రామీణ ప్రజలకు అర్థం కావడం లేదు. రాహుల్ గాంధీ ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చిన ఈ ‘రఖేల్’ వివాదం ఏమిటని తమను గ్రామీణ ప్రజలు అప్పుడప్పుడు అడుగుతుంటారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని యూపీ కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. రాఫెల్ వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ చేస్తున్న ప్రధాన ఆరోపణలు రెండు. ఒకటి యూపీఏ ప్రభుత్వంలో చర్చలు జరిపినప్పటితో పోలిస్తే ఒప్పందం విలువ అనూహ్యంగా పెరిగిపోవడం, రెండు, ఒప్పందంలో మార్గదర్శకాలను మార్చి ఫ్రాన్స్ కంపెనీ భారతీయ భాగస్వామి కంపెనీగా అనిల్ అంబానీ కంపెనీని ఎంపిక చేసుకోవడం, అందులోనూ యుద్ధ విమానాల ఉత్పత్తిలో అణు మాత్రం అనుభవంలేని, అప్పటికీ పుట్టని అనిల్ అంబానీ కంపెనీని ఎంపిక చేయడం. వివాదాన్ని సజీవంగా ఉంచాలనే.. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణాన్ని రానున్న సార్వత్రిక ఎన్నికల వరకు సజీవంగా ఉంచాలనే కాంగ్రెస్ పార్టీ దీన్ని సుప్రీం కోర్టుకు తీసుకెళ్లింది. ఈ కేసును బుధవారం నాడు విచారించిన సుప్రీంకోర్టు, ఒప్పందం చేసుకోవడానికి అనుసరించిన చర్చల ప్రక్రియ ఏమిటో తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీల్డ్ చేసిన కవర్లో వీటి వివరాలను అక్టోబర్ 29వ తేదీలోగా అందజేయాని, 31 నాడు విచారణ జరుగుతుందని తెలిపింది. ఒప్పందం విలువ అనూహ్యంగా పెరగడానికి కారణాలనుగానీ, హెచ్ఏఎల్కు బదులు రిలయెన్స్‌ను ఎంపిక చేయడానికి కారణాలుగానీ అడగకుండా జనాంతికంగా చర్చల ప్రక్రియను సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిందంటే కేసు కూడా ఎక్కువ కాలం నిలబడక పోవచ్చు. అదేపనిగా ప్రచారం తోటి ప్రతిపక్ష పార్టీల నాయకులెవరూ రాఫెల్ ఒప్పందాన్ని పట్టించుకోకపోయినా రాహుల్ గాంధీయే ప్రధాన ఆయుధంగా ప్రచారం చేస్తున్నారు. అది పార్లమెంట్ వేదికైనా, ఎన్నికల ర్యాలీ అయినా, లండన్ యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడినా రాఫెల్ వివాదాన్నే అందుకుంటున్నారు. రిలయెన్స్ కంపెనీని ఎంపిక చేసుకోవడం తమకు తప్పనిసరైందంటూ రాఫెల్ యుద్ధ విమానాలను ఉత్పత్తిచేసే డిసౌ కంపెనీ ప్రతినిధులు చెప్పడాన్ని ఉటంకిస్తూ తాజాగా ఫ్రెంచ్ వెబ్సైట్ ‘మీడియాపార్ట్’ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించినప్పుడు కూడా రాహుల్ ఈ వివాదాన్ని అందుకున్నారు. ఈ వివాదం గ్రామీణ జనం వరకు వెళ్లగలదా? విజయాన్ని సాధించపెట్టగలదా? అన్నది ఇప్పటికైతే అనుమానమే! -
రూపాయి విలువ పడిపోయినా నేనే కారణమా!?
సాక్షి, న్యూడిల్లీ : ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాఫెల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. భారత ప్రభుత్వం సూచన మేరకే రిలయన్స్ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే బాంబు పేల్చిన నాటి నుంచి.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ లక్ష్యంగా.. రాహుల్ గాంధీ విమర్శల పర్వం కొనసాగిస్తుంటే మరోవైపు బీజేపీ నేతలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను టార్గెట్ చేశారు. రాబర్ట్ వాద్రాకు సంబంధించిన సంస్థకు రాఫెల్ కాంట్రాక్టు దక్కలేదనే అక్కసుతోనే కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై దాడికి దిగుతోందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై రాబర్ట్ వాద్రా స్పందించారు. ఇప్పటికైనా నిజం చెప్పండి.. రాఫెల్ డీల్ గురించి కనీసం ఇప్పుడైనా భారత ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వానికి ఉందని వాద్రా వ్యాఖ్యానించారు. అబద్ధాలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ ఒప్పందం కోసం భరత జాతిని అమ్మి వేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతీ విషయానికి తనను టార్గెట్ చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. బీజేపీదంతా ఓ ప్రహసనమని.. రూపాయి విలువ పడిపోయినా, ఇంధన ధరలు పెరిగినా దానికి కూడా వాద్రానే కారణమనేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ వాద్రా ఆరోపించారు. కాగా యూపీఏ హయాంలో జరిగిన రక్షణ ఒప్పందం కుదర్చడంలో రాబర్ట్ వాద్రా సహాయం పొందేందుకు ఓ డిఫెన్స్ డీలర్.. ఆయనకు లండన్‌లో ఒక ఫ్లాట్ బహుమతిగా ఇచ్చారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లండన్ వెళ్లేందుకు వాద్రా కోసం సదరు డీలర్ ఫస్ట్ క్లాస్ టికెట్లు బుక్ చేశారంటూ.. అందుకు సంబంధించిన కాపీలను సంబిత్ మీడియాకు విడుదల చేశారు. -
రాఫైర్!
-
‘రాఫెల్’ను నడిపిన ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్
న్యూఢిల్లీ: భారత్ కోసం ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ తయారుచేసిన తొలి రాఫెల్ ఫైటర్ జెట్‌ను ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్, ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్ నడిపారు. రాఫెల్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదు రోజుల క్రితం ఫ్రాన్స్‌కు చేరుకున్న నంబియార్ గురువారం రాఫెల్ జెట్ సమర్థత, పనితీరును పరీక్షించడంలో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపారు. ఈ పర్యటనలో భాగంగా రాఫెల్ ఫైటర్ జెట్ల తయారీ పనుల్లో పురోగతిని సమీక్షించారు. భారత అవసరాలకు తగ్గట్లుగా రాఫెల్ జెట్‌లో మార్పులు సూచించేందుకు ఐఏఎఫ్ బృందం డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీతో కలసి పనిచేస్తోంది. భారత్‌కు రాఫెల్ ఫైటర్ జెట్ల సరఫరా 2019 నుంచి మొదలుకానుంది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఫైటర్ జెట్లను(ఆయుధాలతో కలిపి) రూ.58,000 కోట్లకు కొంటోంది. -
రాఫెల్ డీల్‌లో ఆ క్లాజు లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంలో ధరల వెల్లడికి సంబంధించి భారత్-ఫ్రాన్స్ మధ్య 2008లో జరిగిన డీల్‌లో ఎలాంటి క్లాజ్ లేదని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ఒప్పందంపై మోదీ సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రక్షణ శాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ ఆరోపించారు. ప్రతి విమానం ధరలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందాన్ని కాగ్, పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలించే క్రమంలో ప్రభుత్వం రాఫెల్ జెట్ ధరల వివరాల్లో గోప్యత పాటించలేదని స్పష్టం చేశారు. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి ధరల వెల్లడిపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దేశాన్ని తప్పుదారిపట్టించినందుకు వారు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్ ధరను వెల్లడించడంపై ఫ్రాన్స్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఫ్రెంచ్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో స్పష్టం చేశారని చెప్పారు. ప్రధాని, రక్షణ మంత్రి పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించేలా వ్యవహరించడం సభా హక్కుల ఉల్లంఘనేనని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా ఆరోపించారు. -
'పారికర్‌కు కూడా ఆ విషయం తెలియదు'
సౌందట్టి (కర్ణాటక) : రాఫెల్ ఒప్పందంలో మార్పు చేస్తున్న విషయం అప్పుడు రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌కు కూడా తెలియదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పారికర్‌కు తెలియకుండానే ప్రధాని నరేంద్రమోదీ ఈ పనిచేశారని చెప్పారు. ఆ సమయంలో గోవాలో పారికర్ చేపలు కొనుగోలు చేస్తున్నారంటూ చమత్కరించారు. 'మాజీ రక్షణ శాఖమంత్రి గోవాలోని ఫిష్ మార్కెట్లో చేపలు కొనుగోలు చేస్తున్నారు. ప్రధాని మోదీ రాఫెల్ కాంట్రాక్టును పూర్తిగా మార్చేసిన విషయం ఆయనకు తెలియదు' అని రాహుల్ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మూడు ప్రశ్నలు ప్రధాని మోదీకి మీడియా ప్రతినిధులు సంధించాలని విజ్ఞప్తి చేశారు. అసలు రాఫెల్ జెట్ల ఖరీదు ఎంత? ఆ కాంట్రాక్టును ఎందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి తొలగించారు? ఎందుకు ఓ వ్యాపార వేత్తకు ఆ కాంట్రాక్టు అప్పగించారు? ఈ ప్రశ్నలు నేను గతంలో కూడా ప్రధానికి వేశాను. కానీ, ఒక్క సమాధానం లభించలేదు. మీకు దొరుకుతుందేమో ప్రశ్నించండి?' అని రాహుల్ అన్నారు. కర్ణాటకలో ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ ప్రచార వేడిని పెంచారు. అందులో భాగంగా జరిగిన బహిరంగ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. -
సీతారామన్ వ్యాఖ్యల పట్ల విస్మయం
సాక్షి, న్యూఢిల్లీ : 36 డసాల్ట్ రాఫేల్ యుద్ధ విమానాలను ఏ రేటుకు కొనుగోలు చేస్తున్నారు? ఒక్కో విమానానికి ఎంతవుతుంది? మొత్తం 36 విమానాలకు ఎత్తవుతుంది? అంటూ ఫ్రాన్స్ కంపెనీతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వివరాలు వెల్లడించాలంటూ రాజ్యసభలో ఓ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ససేమిరా అన్నారు. ఈ విమానాల కొనుగోలు ఓ పెద్ద స్కామ్ అంటూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించినప్పటికీ విమానాల ధర వివరాలను వెల్లడించడానికి వెనకాడారు. పైగా ‘ఇది భారత్, ఫ్రాన్స్ అంతర్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం. రాజ్యాంగంలోని 10వ అధికరణం కింద దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. బహిర్గతం చేయలేం’ అని తెగేసి చెప్పారు. నిర్మలా సీతారామన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు ప్రతిపక్షాన్నే కాకుండా అటు పాలకపక్షాన్ని కూడా విస్మయానికి గురి చేసి ఉంటుంది. రాఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు సంధించినప్పుడు ఈ విమానాల కొనుగోలులో ప్రజల సొమ్ము ఉన్నందున ఒక్కో విమానానికి ఎంతయిందో, మొత్తం విమానాలకు ఎంతయిందో ఒప్పందం వివరాలు అందుబాటులోకి వచ్చాక తప్పకుండా వెల్లడిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో కూడా ఈ ప్రశ్న వెలువడినప్పుడు ‘కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికీ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ప్రధానంగా ఉన్న తేడా పారదర్శకత. మేమీది దాచం. రాఫేల్ ఒప్పందంలో ప్రజల సొమ్ము ఉన్నందు వల్ల తప్పకుండా త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని సీతారామన్ తెలిపారు. మొదటి నుంచి రాఫేల్ విమానాల డీల్ వివాదాస్పదంగానే ఉంది. కాంగ్రెస్ హయాంలో 126 రాఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు చర్చలు జరిగాయి. అందులో 18 ఎగిరేందుకు సిద్ధంగా విమానాలను అందజేయాలని ఉండగా, మిగతావాటిని డసాల్ట్ కంపెనీ సహకారంతో హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ తయారు చేయాల్సి ఉండింది. ఆ సమయంలో ఒక్కో ఫైటర్ జెట్ ఖరీదు 714 కోట్ల రూపాయలను లెక్కగట్టారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడంతో ఒప్పందం తుదిరూపు దాల్చలేదు. మోదీ ప్రభుత్వం హయాంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 ఫైటర్ జెట్ల కొనుగోలుకు తాజాగా చర్చలు మొదలయ్యాయి. ఒప్పందం కూడా కుదిరింది. రాఫేల్ విమానాల కొనుగోలుకు ఎంతవుతుందని లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించినప్పుడు 2016, సెప్టెంబర్ 23వ తేదీన ఒక్కో జెట్‌కు 670 కోట్ల రూపాయలు అవుతుందని బీజేపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ లెక్కన మొత్తం 36 విమానాలకు దాదాపు 24వేల కోట్ల రూపాయలు కావాలి. 2015లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ మొత్తం ఒప్పందం విలువ 90 వేల కోట్ల రూపాయలని పార్లమెంట్‌కు తెలిపారు. అది తప్పని మొత్తం ఒప్పందం విలువ 58 వేల కోట్ల రూపాయలని, ఒక్కో విమానానికి 1063 కోట్ల రూపాయలవుతోందని ఆ తర్వాత ప్రభుత్వమే ప్రకటించింది. మొత్తం ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకుంటే ఒక్కో ఫైటర్‌కు 1640 కోట్ల రూపాయలు అవుతుందని ఆ తర్వాత ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రాఫేల్ యుద్ధ విమానాలకు రోజుకో లెక్క చెబుతున్న నేపథ్యంలో అసలు లెక్కేమిటో చెప్పాల్సిందిగా ప్రతిపక్షం నిలదీస్తే రాజ్యాంగంలోని పదవ అధికరణం ప్రకారం గోప్యంగా ఉంచడం ప్రభుత్వ ధర్మం అనడంలో అర్థం ఏమైనా ఉందా? ప్రజల సొమ్ముతో కొంటున్నందున ఒప్పందం విలువను తానే వెల్లడిస్తానని చెప్పిన మంత్రి సీతారామన్ మాట మార్చటంలో అర్థం ఉందా? పారదర్శకతకే ప్రాధాన్యమిస్తానంటున్న బీజేపీ ప్రభుత్వం ఈ ఒప్పందం విలువను వెల్లడించక పోవడం ఏమిటీ?