ప్యారిస్: ఫ్రెంచ్ బిలియనీర్, ఎంపీ, యుద్ధ విమానాల తయారీ సంస్థ రఫేల్‌కు చెందిన ఓలివర్ డసాల్ట్ రాఫెల్ (69) దుర్మరణం తీవ్ర విషాదాన్ని రేపింది. ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఒలీవర్‌తో పాటు పైలెట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. హెల్‌కాప్టర్ ప్రమాదంలో ఆలీవర్ దుర్మరణంపై సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌ను ఎంతగానో ప్రేమించే ఓలివీర్ ఆకస్మిక మరణం తమకు తీరని నష్టమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ట్వీట్ చేశారు. ఆయన మరణం చాలా బాధాకరం అంటూ కన్జర్వేటివ్ నేత, పారిస్ ప్రాంతీయ అధ్యక్షుడు వాలెరీ పెక్రెస్ ట్విటర్ ద్వారా నివాళులర్పించారు. (Muthoot Group: ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ దుర్మరణం)
కాగా ఫ్రెంచ్ విమానాల తయారీ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు మార్సెల్ డసాల్ట్ మనవడు ఓలివర్ డసాల్ట్. దివంగత ఫ్రెంచ్ బిలియనీర్ పారిశ్రామికవేత్త సెర్జ్ డసాల్ట్ పెద్ద కుమారుడు. ఓలివర్ 2002లో ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభకు ఎన్నికయ్యారు. ఓలివర్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగానూ కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని బిలీనియర్ల జాబితాలో 361వ స్థానంలో ఒలివర్ ఉన్నారు. ఈయన సంపద 6.3 బిలియన్ యూరోలు. ఒలీవర్ డస్సాల్ట్‌కు ముగ్గురు పిల్లలున్నారు. భారత్‌కు రాఫెల్ యుద్ధవిమానాలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే.
Olivier Dassault aimait la France. Capitaine d’industrie, député, élu local, commandant de réserve dans l’armée de l’air : sa vie durant, il ne cessa de servir notre pays, d’en valoriser les atouts. Son décès brutal est une grande perte. Pensées à sa famille et à ses proches.
— Emmanuel Macron (@EmmanuelMacron) March 7, 2021
Comments
Please login to add a commentAdd a comment