సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు అక్రమాలపై మాటలయుద్ధం పతాక స్థాయిలో కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేంద్ర ధనోవా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకున్న 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి రాహుల్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. యూపీఏ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకన్నా ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలు అద్భుతమని ఆయన అన్నారు.
రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో ఒక వ్యాపారవేత్తకు ప్రయోజనాలు కల్పించారని రాహుల్‌గాంధీ గురువారం నాడు ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదని ధనోవా పేర్కొన్నారు. అంతేకాక యూపీఏ హయాంలో తీసుకున్న మీడియం మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఎంఆర్‌సీఏ) కొనుగోలు ఒప్పందాలకన్నా.. ఎన్డీఏ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని ధనోవా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment