న్యూఢిల్లీ: భారత్‌తో ఫ్రాన్స్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 36 రఫేల్ జెట్‌లను అందించేందుకు సిద్దంగా ఉన్నామని ఫ్రెంచ్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి ఈమాన్యుల్ లినేన్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో కరోనా ఉదృతి నేపథ్యంలో నెలకొన్న అనుమానాలను తెరదిస్తు కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్ మెదటి రఫేల్ జట్‌ను 2019 అక్టొబర్ 8న భారత్‌కు అందించింది. భారత్ రఫేల్ తయారీలో కొన్ని సూచనలు ఇచ్చిందని వాటిని పరిగణలోకి తీసుకొని అత్యధునిక సాంకేతికతతో అందించామని ఫ్రెంచ్ ఉన్నతాధికారులు తెలిపారు. భారత వైమానిక దళం సూచించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని అధికారుల పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 1,45,00మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 28,330 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment