సాక్షి, హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు జరపడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ అక్రమిత కశ్మీర్‌లో.. దాయాది దేశం ఇన్ని రోజులు పరోక్ష యుద్ధం చేసిందన్నారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పాక్ కేంద్రంగా కార్యాకలాపాలు కొనసాగిస్తూ భారత పార్లమెంట్‌పై దాడి చేయడం, పుల్వామాలో జవాన్లపై ఆత్మహుతి దాడికి పాల్పడటం వంటి దుర్మార్గాలకు పాల్పడిందని గుర్తుచేశారు.
భారత్ జైషే ఉగ్రసంస్థ గురించి, మసూద్ అహ్మద్ విషయంలో పాక్‌కు ఎన్ని ఆధారాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జైషే మహమ్మద్ క్యాంపులపై దాడులు చేయడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. తను పైలెట్లకు సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు. జైషే మహమ్మద్‌కు చెందిన అన్ని స్థావరాలపై దాడి చేయాలని కోరారు. పాక్‌లో తలదాచుకున్న అల్‌ఖైదా చీఫ్ బిన్ లాడెన్‌ను వారి భూభాగంలోకే వెళ్లి మట్టుబెట్టిన అమెరికా తరహాలో.. పాక్‌లో ఉండి ఉగ్రచర్యలు పాల్పడేవారినందరిని ఏరిపారేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment