గుజరాత్ సరిహద్దులో కూల్చివేయబడ్డ పాక్ నిఘా డ్రోన్
న్యూడిల్లీ: భారత్‌పై ప్రతి దాడికి ప్రయత్నించిన దాయాది పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్ 16 యుద్ధ విమానాలతో భారత్‌పై దాడికి యత్నించిన పాక్ పూర్తిగా విఫలమైంది. భారత్‌వైపు వచ్చి దాడులు జరిపేందుకు యత్నించిన పాక్ యత్నాలను ఎయిర్‌ఫోర్స్ తిప్పికొట్టింది. భారత్ సామర్థ్యం, సంసిద్ధత చూసి పాక్ వెనక్కి తగ్గినట్టుగా సమాచారం. కానీ దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. 12 మిరాజ్-2000 యుద్ద విమానాలతో దాడులు చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాక్ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్ రూమ్‌లను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.
దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనే పాక్ యత్నం విఫలమైనట్టుగా తెలుస్తుంది. భారత్ మిరాజ్ యుద్ద విమానాల స్థాయిని చూసి పాక్ తోకముడించింది. తాము ఎదురుదాడి చేయడంతో భారత యుద్ద విమానాలు వెనక్కి వెళ్లాయని పాక్ చెబుతన్న మాటల్లో వాస్తవం లేదని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. మరోవైపు భారత భూభాగంలోని ప్రవేశించిన పాక్ నిఘా డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. మంగళవారం ఉదయం 6.30 గంటలకు గుజరాత్‌లోని కచ్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. (పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్)
Comments
Please login to add a commentAdd a comment