F 16
-
మేం కూల్చింది ఎఫ్16నే
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్)కు చెందిన ఎఫ్–16 కూల్చివేతపై వస్తున్న అనుమానాలను భారత వైమానిక దళం(ఐఏఎఫ్) మరోసారి కొట్టిపారేసింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఘటనలో తాము కూల్చింది ఎఫ్–16 యుద్ధ విమానమే అనేందుకు బలమైన ఆధారాలున్నాయని పేర్కొంది. సోమవారం రక్షణ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ ఆర్.జి.కపూర్ మాట్లాడారు. ‘ఫిబవరి 27వ తేదీన జరిగిన ఘటనలో పీఏఎఫ్ ఎఫ్–16ను వినియోగిం చడం మాత్రమే కాదు, దానిని ఐఏఎఫ్ మిగ్–21 బైసన్ విమానం కూల్చి వేసిందడానికి కూడా తిరుగులేని ఆధారాలున్నాయి’ అని తెలిపారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన రెండు విమానాలు పరస్పరం తలపడిన విషయం సుస్పష్టం. అందులో ఒకటి పీఏఎఫ్‌కు చెందిన ఎఫ్–16 కాగా మరొకటి ఐఏఎఫ్‌కు చెందిన మిగ్–21 బైసన్ రకం విమానం. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్, రాడార్ వ్యవస్థలు కూడా పసిగట్టాయి’ అని వివరించారు. అయితే, భద్రతా కారణాల రీత్యా మిగతా వివరాలను తాము బహిరంగ పర్చలేక పోతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్(అవాక్స్)కు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. ఫిబ్రవరి 27న ఎఫ్–16ను కూల్చివేసిన అనంతరం వింగ్ కమాండర్ అభినందన్ నడుపుతున్న మిగ్ విమానాన్ని పీఏఎఫ్ కూల్చివేయడంతో ఆయన పాక్ భూభాగంలో దిగటం, తర్వాత విడుదల తెల్సిందే. -
కూలిన పాక్ యుద్ధ విమాన శకలాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్ 16ను భారత వైమానిక దళం విజయవంతంగా తిప్పికొట్టింది. ఎఫ్ 16ను కూల్చివేసినట్టు భారత అధికారులు ప్రకటించగా తాజాగా వీటి శకలాలను పాక్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తించారు. పీఓకేలో కూలిన పాకిస్తాన్ ఎఫ్ 16 శకలాలను పాకిస్తాన్ ఏడవ నార్తర్న్ లైట్ ఇన్ఫ్యాంట్రీ కమాండింగ్ ఆఫీసర్‌తో పాటు ఇతర పాక్ వాయుసేన సిబ్బంది పరిశీలిస్తున్న చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు భారత యుద్ధవిమానాన్ని కూల్చివేసి పైలట్ అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ ప్రకటించడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. కాగా భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత సమసిపోగానే తమ చెరలో ఉన్న భారత్ పైలట్ అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు పాక్‌తో ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతంలో భారత నావికా దళంతో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమైంది. సముద్రాల్లో నేవీ, కోస్ట్‌గార్డ్ బృందాలు పెట్రోలింగ్ చేస్తూ మత్స్యకారుల కదలికలనూ గమనిస్తున్నారు. -
విఫలమైన పాకిస్తాన్ ప్రతి దాడి..
న్యూడిల్లీ: భారత్‌పై ప్రతి దాడికి ప్రయత్నించిన దాయాది పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్ 16 యుద్ధ విమానాలతో భారత్‌పై దాడికి యత్నించిన పాక్ పూర్తిగా విఫలమైంది. భారత్‌వైపు వచ్చి దాడులు జరిపేందుకు యత్నించిన పాక్ యత్నాలను ఎయిర్‌ఫోర్స్ తిప్పికొట్టింది. భారత్ సామర్థ్యం, సంసిద్ధత చూసి పాక్ వెనక్కి తగ్గినట్టుగా సమాచారం. కానీ దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. 12 మిరాజ్-2000 యుద్ద విమానాలతో దాడులు చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాక్ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్ రూమ్‌లను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనే పాక్ యత్నం విఫలమైనట్టుగా తెలుస్తుంది. భారత్ మిరాజ్ యుద్ద విమానాల స్థాయిని చూసి పాక్ తోకముడించింది. తాము ఎదురుదాడి చేయడంతో భారత యుద్ద విమానాలు వెనక్కి వెళ్లాయని పాక్ చెబుతన్న మాటల్లో వాస్తవం లేదని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. మరోవైపు భారత భూభాగంలోని ప్రవేశించిన పాక్ నిఘా డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. మంగళవారం ఉదయం 6.30 గంటలకు గుజరాత్‌లోని కచ్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. (పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్) -
'లాడెన్ భుజం మీదుగా మాపై తూటాలు'
జెనీవా: 'ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటూ అమెరికా, ఈయూలు పాకిస్థాన్ కు ఆయుధాలిస్తున్నాయి. వాస్తవం ఏమంటే పాకిస్థానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అల్ కాయిదా లీడర్ బిన్ లాడెన్ ఉదంతంలోనూ ఇది నిజమని తేలింది. ఒకవైపు లాడెన్ ను వేటాడేందుకు అమెరికా పాక్ కు భారీ ఎత్తున ఆయుధాలిచ్చింది. తీరా చూస్తే లాడెన్ పాకిస్థాన్ లోనే ఆశ్రయం పొందడం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. లాడెన్ భుజం మీదుగా పాకిస్థాన్ పేల్చిన తుపాకి తూటాలకు బలైంది మా(బెలూచిస్థాన్) ప్రజలే' అంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల వేదికపై ఉద్వేగంగా ప్రసంగించారు బెలూచిస్థాన్ ప్రతినిధి మెహ్రాన్. పాకిస్థాన్‌కు అణుసామర్థ్యం గల ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల్ని అమ్మాలన్న అమెరికా నిర్ణయాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తోన్న మెహ్రాన్.. శనివారం జనీవాలో జరిగిన ఐక్యర్యాజ్యసమితి మానవహక్కుల కమిషన్ వార్షిక సమావేశంలోనూ తన వాణిని వినిపించారు. అమెరికా, యురోపియన్ యూనియన్లు అందిస్తోన్న ఆయుధాలను పాకిస్థాన్ దుర్వినియోగం చేస్తున్నదని, బెలూచిస్థాన్ ప్రజలను అంతం చేసేందుకు వాటిని వినియోగిస్తున్నదని మెహ్రాన్ ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రపంచదేశాలు పాకిస్థాన్ కు ఆయుధాలివ్వటం మానేయాలని, ఆమేరకు ఐక్యరాజ్యసమితి కృషిచేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. బెలూచిస్థాన్ బాధేంటి? పాకిస్థాన్ లోని నాలుగు ఫ్రావిన్స్ లలో బెలూచిస్థాన్ ఒకటి. క్వెట్టా ప్రధాన నగరంగా ఉన్న ఈ ప్రాంతం 1947కు ముందు స్వతంత్ర్య రాజ్యం. ఇండియా నుంచి విడిపోయిన తర్వాత పాక్ సైన్యాలు బెలూచిస్థాన్ ను ఆక్రమించుకున్నాయి(1948 ఏప్రిల్ లో). పాక్ పాలనలో జీవించబోమంటూ బెలూచిస్థాన్ ప్రజలు అనేక ఆందోళనలు చేశారు. అయితే, ఈ ఆందోళనలను పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచి వేస్తూనే ఉంది. పాక్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే... వారిని, వారి కుటుంబీకులను గుట్టు చప్పుడు కాకుండా, మూడో కంటికి తెలికుండా పాక్ సైన్యం అత్యంత దారుణంగా హతమారుస్తోంది. ఈ క్రమంలోనే వంద మంది చిన్నారులను పాక్ సైన్యం కాల్చి చంపింది. ఈ దారుణం వెలుగు చూడటంతో, బెలూచ్ ప్రజల్లో ఆగ్రహావేశాలు తీవ్ర రూపం దాల్చాయి. మీ రాక్షస పాలన మాకు వద్దంటూ, బెలూచ్ ప్రజలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలను తీవ్రతరం చేశారు. బెలూచిస్థాన్ లో పాకిస్థాన్ సైన్యాలు సాగిస్తోన్న అకృత్యాలివి(పాత ఫొటోలు)