హిప్ హిప్ హుర్రే...
న్యూఢిల్లీ: నేడు తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఉత్తరాఖండ్ అసెంబ్లీలో హరీష్ రావత్ బలపరీక్ష ఎదుర్కున్నారు. ఓటింగ్ అనంతరం ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. హిప్ హిప్ హుర్రే ఫర్ డెమోక్రసీ అంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యయే గెలిచిందంటూ ట్వీట్ లో పేర్కొన్న దిగ్విజయ్... తమ పార్టీ నేత హరీశ్ రావత్ కు శుభాకాంక్షలు తెలిపి కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు. ప్రజాస్వాయ్యాన్ని న్యాయవ్యవస్థ కాపాడిందని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ ఓటింగ్ మంగళవారం ఓటింగ్ నిర్వహించారు. ఆ వివరాలను సీల్డు కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పిస్తారు. బుధవారం సుప్రీంకోర్టు అధికారికంగా బలపరీక్ష ఫలితాన్ని ప్రకటించనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా 33 మంది ఎమ్మల్యేలు ఓటు వేసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతుండగా.. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ తన అభిప్రాయాలను వెల్లడించారు.
Hip Hip Hurray for Democracy and Three Cheers for Harish Rawat. Judiciary has saved our Democracy. pic.twitter.com/OZpnVFEyph
— digvijaya singh (@digvijaya_28) 10 May 2016