
నేను ఎవరికి ఫిర్యాదు చేయాలి: స్పీకర్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా సభ్యులు ప్రవర్తించిన తీరుపై స్పీకర్ ధనపాల్ అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేశారు. తన చొక్కా చింపి అవమానించారని, తనపై జరిగిన దానిపై ఎవరికి ఫిర్యాదు చేయాలని స్పీకర్ వ్యాఖ్యానించారు. రాజ్యంగబద్ధంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. తన నిర్ణయంపై ఇతరులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు.
రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న డిమాండ్‌ను తిరస్కరించినందుకు డీఎంకే సభ్యులు స్పీకర్‌ను ఘొరావ్ చేశారు. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంటూ స్పీకర్‌పై కుర్చీలు, పేపర్లు విసిరేసి, ఆయన ముందున్న టేబుల్‌ను విరగొట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ డీఎంకే సభ్యులు బయటకు వెళ్లాలని ఆదేశించారు. సభలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు.
మరిన్ని తమిళనాడు విశేషాలు..
భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు
పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్
మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!
ఎవరీ సైనైడ్ మల్లిక!
పళనిస్వామిని ఓడించండి: రాహుల్
అమ్మకు ఓటేయండి
నన్ను చూసి నవ్వొద్దు
‘మ్యాజిక్’ చేసేదెవరు?