Speaker Dhanapal
-
స్పీకర్, డిప్యూటీ సీఎంలకు సుప్రీం నోటీసు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారంలో తమిళనాడు స్పీకర్ ధనపాల్, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా 11 మంది ఎమ్మెల్యేలకు సోమవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు 4వారాల్లోగా బదులివ్వాలని ఆదేశించింది. పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత విశ్వాస పరీక్ష తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వంతోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆ 11 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హతవేటు వేయాలని డీఎంకే విప్ చక్రపాణి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ నిర్ణయంలో తలదూర్చలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో చక్రపాణి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సైతం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. -
దినకరన్ ఎమ్మెల్యేలపై వేటు
-
దినకరన్ ఎమ్మెల్యేలపై వేటు
18 మందిని అనర్హులుగా ప్రకటించిన స్పీకర్ ► అనర్హతపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలు ► డీఎంకే ఎమ్మెల్యేలతో నేడు స్టాలిన్ అత్యవసర సమావేశం ► మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న విపక్షం? ► ఆసక్తికరంగా మారిన తమిళ రాజకీయాలు చెన్నై: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే రాజకీయాలపై శశికళ పెత్తనానికి చెక్ పడింది. తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామిపై కాలుదువ్విన టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. స్పీకర్ ధనపాల్ సోమవారం అనర్హులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీచేశారు. సీఎం పళనిస్వామిని గద్దె దించేందుకు పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ప్రయత్నించిన నేపథ్యంలో.. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అనర్హత నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేశారంటూ దినకరన్ మండిపడ్డారు. ఈ ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం హైకోర్టులో అనర్హతను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశారు. మరోవైపు, మారుతున్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు డీఎంకే ఎమ్మెల్యేలంతా చెన్నై రావాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. వివాదానికి కారణమేంటి? జయలలిత మరణం, శశికళ జైలుకు పయనం తరువాత పార్టీ, ప్రభుత్వాలపై పెత్తనం విషయంలో టీటీవీ దినకరన్, సీఎం ఎడపాడి మధ్య రాజకీయ వైరంతో వివాదం రాజుకుంది. పన్నీర్‌సెల్వంను దరిచేర్చుకునేందుకు శశికళ కుటుంబాన్ని పళనిస్వామి దూరం పెట్టారు. దినకరన్‌ను కట్టడి చేశారు. దీంతో ఆగ్రహించిన దినకరన్ 19 మంది ఎమ్మెల్యేల చేత మద్దతు ఉపసంహరింపజేసి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడవేయటంతో విపక్షాలన్నీ విశ్వాస పరీక్ష పెట్టాలని డిమాండ్ చేశాయి. అటు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న 19 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వ ప్రధాన విప్ రాజేంద్రన్ స్పీకర్‌ను కోరారు. ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. జక్కయ్యన్ అనే ఎమ్మెల్యే ఒక్కరే స్పీకర్ ముందు హాజరై పళనిస్వామివర్గంలో చేరగా.. మిగిలిన వారిపై స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళ, బుధవారాల్లో ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. డీఎంకే మదిలో ఏముంది? తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం డీఎంకే ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పళని సర్కారుపై ప్రజల్లోనూ అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలచే మూకుమ్మడిగా రాజీనామా చేయించి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పరిస్థితులు కల్పించాలని స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఎవరి బలమెంత? ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ విశ్వాస పరీక్షకు అనుమతిస్తే.. పళనిస్వామి మరోసారి సీఎంగా నెగ్గటం సులువే. మొత్తం 233 మంది ఎమ్మెల్యేలున్న ప్రస్తుత తమిళ అసెంబ్లీలో (జయ మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది) విజయానికి 117 సీట్లు అవసరం. అయితే.. పళనిస్వామి వర్గంలో 113 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మిత్రపక్షాలున్నారు. ఈ నేపథ్యంలో 18మందిపై అనర్హత వేటు పడితే.. 215 సభ్యులు మాత్రమే విశ్వాస పరీక్షలో పాల్గొంటారు. అప్పుడు గెలిచేందుకు 109 సీట్లు అవసరం. ఈ మేజిక్ ఫిగర్‌ను సీఎం వర్గం సులభంగానే చేరుకుంటుంది. అయితే.. రెండ్రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు.. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోం మంత్రి రాజ్నా«థ్ సింగ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని వివరించారు. -
అసెంబ్లీకి పట్టు
♦ స్పీకర్‌పై స్టాలిన్ ఒత్తిడి ♦ అంతర్గత సమరంలో జోక్యం చేసుకోం ♦ ఫెరా...మాఫియా.. ♦ ప్రతిపక్ష నేత వ్యాఖ్య సాక్షి, చెన్నై: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీని సమావేశ పరచాలని స్పీకర్ ధనపాల్‌పై ప్రధాన ప్రతి పక్షం ఒత్తిడి తెచ్చే పనిలో పడింది. ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం వినతి పత్రం సమర్పించారు. అన్నాడీఎంకే అంతర్గత సమరంలో తాము జోక్యం చేసుకోమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం లో కరువు తాండవం ఓ వైపు, భానుడి ఉగ్ర తాండవం మరోవైపు అన్ని వర్గాల్ని పిండి పిప్పి చేస్తున్న విషయం తెలిసిందే. అన్నదాతలకు మద్దతుగా రాష్ట్ర బంద్‌కు సైతం ప్రధాన ప్రతిపక్షం నేతృత్వంలో ప్రతి పక్షాలు పిలుపునిచ్చాయి. ప్రజలు తల్లడిల్లుతున్నా, వాటితో తమకేంటి అన్నట్టుగా అధికార పక్షం మెతక వైఖరిని అనుసరిస్తున్నదని ప్రతి పక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకోవడంలో భాగంగా వ్యక్తిగత స్వలాభంలో మునిగి పాలనను, ప్రజల్ని సీఎంతో పాటు మంత్రులు పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీని సమావేశ పరచాలని స్పీకర్‌పై ప్రధాన ప్రతిపక్షం ఒత్తిడికి సిద్ధమైంది. అసెంబ్లీకి పట్టు: ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఉపనేత దురై మురుగన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉదయం అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ ధనపాల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు, రైతు సమస్యలు, తాగు నీటి ఎద్దడి అంశాలపై చర్చించి ప్రత్యేక సమావేశానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు తగ్గ వినతి పత్రాన్ని స్పీకర్‌కు సమర్పించారు. త్వరితగతిన అసెంబ్లీని సమావేశ పరిచే విధంగా చర్యలు వేగవంతం చేయాలని పట్టుబట్టారు. జోక్యం చేసుకోం: మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారని వివరించారు. ప్రధానంగా రైతులు ఇక్కడ సాగించిన పోరాటాలకు స్పందనలేని దృష్ట్యా, చివరకు ఢిల్లీ వెళ్లి మరీ పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. తాగు నీటి కోసం గ్రామాల్లో సైతం జనం కిలో మీటర్ల కొద్ది పయనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడి ందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే, వాటి మీద దృష్టి సారించాల్సిన పాలకులు వారి పార్టీ అంతర్గత సమరంలో నుంచి బయట పడే మార్గాల అన్వేషణలో మునిగి ఉండడం విచారకరం అని మండిపడ్డారు.అన్నాడిఎంకే అంతర్గత సమరంలో తాము జోక్యం చేసుకోమని, ఇది డిఎంకే సిద్ధం కాదన్నారు. అయితే, వ్యక్తి్తగత స్వలాభం,పార్టీలో ఆధిపత్యం కోసం ప్రాకులాడుతూ ప్రజల్ని విస్మరిస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు. -
నేను ఎవరికి ఫిర్యాదు చేయాలి: స్పీకర్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా సభ్యులు ప్రవర్తించిన తీరుపై స్పీకర్ ధనపాల్ అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేశారు. తన చొక్కా చింపి అవమానించారని, తనపై జరిగిన దానిపై ఎవరికి ఫిర్యాదు చేయాలని స్పీకర్ వ్యాఖ్యానించారు. రాజ్యంగబద్ధంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. తన నిర్ణయంపై ఇతరులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న డిమాండ్‌ను తిరస్కరించినందుకు డీఎంకే సభ్యులు స్పీకర్‌ను ఘొరావ్ చేశారు. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంటూ స్పీకర్‌పై కుర్చీలు, పేపర్లు విసిరేసి, ఆయన ముందున్న టేబుల్‌ను విరగొట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ డీఎంకే సభ్యులు బయటకు వెళ్లాలని ఆదేశించారు. సభలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
ఆరుగురు ఎమ్మెల్యేల అజ్ఞాతవాసం
అధికార (అమ్మ) పార్టీని నిందిస్తే ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో డీఎండీకే ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ రుచి చూపించారు. ఎమ్మెల్యేలమనే విషయాన్నే ఏడాదిపాటు మరిచిపోయేలా నిషేధం విధించారు. పంచపాండవుల అజ్ఞాతవాసాన్ని తలపించేలా అనేక ఆంక్షలను అమలులోకి తెచ్చారు. సస్పెన్షన్ మాత్రమే కాదు షరతులు వర్తిస్తాయి అంటూ ఉత్తర్వులు జారీచేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: గత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రగడ సృష్టించారు. బడ్జెట్ ప్రతులను చింపివేయడం, స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడం, మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శనాస్త్రాలు సంధించడం వంటి గందరగోళాలకు పాల్పడ్డారు. చంద్రకుమార్, మోహన్‌రాజ్, పార్తిబన్, వెంకటేశన్, శేఖర్, దినకరన్ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుత, రాబోయే అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకాకుండా స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఆనాటి సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 1వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. అయితే సచి వాలయం ప్రాంగణంలో ప్రతిరోజూ ధర్నా చేపట్టి తమ నిరసన తెలిపారు. అంతేగాక డీఎంకే, కాంగ్రెస్ తదితర ప్రతిపక్షపార్టీల మద్దతు కూడగట్టుకున్నారు. ఇదిలా ఉండగా, డీఎండీకే ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని మరో పదిరోజుల పాటూ పొడిగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంటే రాబోయే శీతాకాల అసెం బ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనే వీలులేకుండా చేశారు. ఇక ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు 2016 జనవరి లేదా ఫిబ్రవరిలోనే జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడా ది అసెంబ్లీ ఎన్నికలు సైతం ముంచుకొస్తున్న కారణం గా ఆనాటి అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ఈ కారణాల వల్ల సస్పెన్షన్ వేటుకు గురైన ఆరుగురు డీఎండీకే ఎమ్మెల్యేలు ఇక అసెంబ్లీ ముఖం చూస్తారా అనేది అనుమానంగా మారింది. అవమానంతోపాటూ ఆర్థికపోటు: దాదాపు ఏడాది నిషేధం డీఎండీకే ఎమ్మెల్యేలను అవమానంతోపాటు ఆర్థికపోటుకు గురిచేసింది. ఒక్కో ఎమ్మెల్యే నెలసరి వేతనం కింద మొత్తం రూ.55 వేలు పొందుతుంటారు. సస్పెన్షన్ వేటు పడిన ఎమ్మెల్యేలు సుమారు ఏడాది పాటు ఈ మొత్తాన్ని కోల్పోనున్నారు. అలాగే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కింద రూ.5వేలు, అసెంబ్లీ సమావేశాలకు హాజరైనపుడు చెల్లించే సిట్టింగ్ చార్జీ 500 కోల్పోనున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే హోదాలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకునేందుకు వీలులేదు. అంతేకాదు అసెంబ్లీ ప్రాంగణంలోని గ్రంథాలయం ప్రవేశం కూడా నిషిద్ధమే. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలోకి వెళ్లకూడదు, అధికారిక కార్యక్రమాలకు హాజరుకారాదని షరతులు ఉన్నాయి. ఏడాది పాటూ ఆరుమంది సభ్యులు తాము ఎమ్మెల్యేమనే విషయాన్ని మర్చిపోవాలి. అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో తిరుగుతూ పలుకుబడి పెంచుకునే వీలులేకుండా అధికారపక్షం ఎత్తుగడవేసింది. బహుశా ఎమ్మెల్యేలపై ఇంత పెద్ద వేటు, ఆర్థికపోటు మరే రాష్ట్రంలోనూ చోటుచేసుకోలేదని భావించవచ్చు. -
చిక్కుల్లో ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేతో వైర్యం ఏర్పడ్డ నాటి నుంచి డీఎండీకే వర్గాలు సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఏ చిన్న వ్యాఖ్య చేసినా, ఆరోపణలు గుప్పించినా పరువు నష్టం దావాలు దాఖలవుతూ వచ్చాయి. అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశం గత వారం ఆరంభమైంది. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం వివాదం రాజుకుంది. తమ గళాన్ని నొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎండీకే సభ్యులు అధికార పక్షంతో గట్టిగానే ఢీ కొట్టారు. అసెంబ్లీ వేదికగా వివాదం ముదరడంతో మార్షల్స్ ద్వారా బయటకు వారిని స్పీకర్ ధనపాల్ గెంటించారు. అలాగే, క్రమ శిక్షణ చర్యగా తాజా సమావేశాలు, తదుపరి సమావేశాలకు వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. చివరకు తగ్గిన స్పీకర్ ధనపాల్ ఈ సమావేశాలకు మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్టు మరుసటి రోజు ప్రకటించారు. సస్పెన్షన్‌లో సవరణలు జరిగినా, డీఎండీకే ఎమ్మెల్యేలకు అసలు చిక్కంతా మార్షల్స్ రూపంలో కాచుకు కూర్చుంది. చిక్కుల్లో...ముగ్గురు టార్గెట్ బయటకు గెంటివేసే క్రమంలో డీఎండీకే ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో ఢీ కొట్టారు. ఈ క్రమంలో విజయన్ అనే సబ్ ఇన్స్పెక్టర్ గాయ పడ్డారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ద్వారా డీఎండీకే ఎమ్మెల్యే భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే సమయంలో, డీఎండీకే సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సచివాలయం పోలీసులకు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఫిర్యాదు చేయ డం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సబ్ ఇన్స్పెక్టర్ విజయన్ను సచివాలయం పోలీసులు శనివారం సాయంత్రం కలుసుకుని వివరణ తీసుకున్నారు. సంఘటన ఎలా జరిగింది, దాడి చేసిన ఎమ్మెల్యేల వివరాల్ని సేకరించారు. జమాలుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎండీకే ఎమ్మెల్యేలు మోహన్ రాజ్, శేఖర్, దినకరన్‌లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. నగర కమిషనర్ జార్జ్‌తో సచివాలయం పోలీసులు సమావేశమై కేసుల నమోదుకు సంబంధించి చర్చించడం గమనార్హం. వీరిపై ఎలాంటి సెక్షన్లను నమోదు చేయాలోనని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిని తన విధుల్ని నిర్వర్తించకుండా అడ్డుకోవడం, దాడి చేయడం వంటి సెక్షన్లను నమోదు చేయడానికి సచివాలయం పోలీసులు సిద్ధం అయ్యారని సమాచారం. అయితే, సోమవారం అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో మరుసటి రోజు డీఎండీకే ఎమ్మెల్యేల భరతం పట్టేవిధంగా కేసుల నమోదు, అరెస్టులకు కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. -
సస్పెన్షన్‌లో సవరణ!
అసెంబ్లీ నుంచి డీఎండీకే ఎమ్మెల్యేల సస్పెండ్ వ్యవహారంలో స్వల్ప మార్పులు జరిగాయి. వారిని ఈ సమావేశాల వరకే సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ధనపాల్ శుక్రవారం ప్రకటించారు. గరం..గరంగా సాగిన సభా పర్వంలో డీఎంకే, పీఎంకే, కాంగ్రెస్, పుదియ తమిళగంలు వాకౌట్ చేశాయి. తమ అమ్మ జయలలిత ప్రగతిని చాటుతూ సీఎం పన్నీరుసెల్వం ప్రత్యేక ప్రకటనలు చేశారు. - స్పీకర్ ధనపాల్ నిర్ణయం - గరం..గరంగా సభా పర్వం సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం ప్రశ్నోత్తరాల మొదలు సభాపర్వం గరం..గరంగానే సాగింది. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని టార్గెట్ చేసి పలువురు మంత్రులు తీవ్రంగానే స్పందించారు. వారి వ్యాఖ్యలకు ఆక్షేపణ తెలుపుతూ, తామేమి తక్కువ తిన్నామా అన్నట్టుగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను టార్గెట్ చేసి డీఎంకే వర్గాలు శివాలెత్తారు. సభా పర్వం అంతా గరంగరంగా సాగినా, చివరకు ప్రతి పక్షాలకు మాట్లాడే అకాశాల్ని స్పీకర్ ధనపాల్ కత్తిరించడం రగడకు దారితీసింది. అధికార పక్షం సభ్యులకు, మంత్రులకు మాట్లాడేందుకు అధిక సమయం కేటాయించే స్పీకర్, తమకు మాత్రం కేటాయించడం లేదంటూ డీఎంకే, పీఎంకే, కాంగ్రెస్, పుదియ తమిళగంలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. డీఎండీకే సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ, వారికి మద్దతుగా నిలిచే విధంగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. చివరకు తమ గళాన్ని నొక్కేస్తుండడంతో అసెంబ్లీ నుంచి తొలుత డీఎంకే, వారి వెంట కాంగ్రెస్, ఆతర్వాత పీఎంకే, పుదియ తమిళగంలు వాకౌట్ చేశాయి. సస్పెన్షన్‌లో సవరణ వాకౌట్ల పర్వం అనంతరం స్పీకర్ ధనపాల్ స్పందించారు. సభలో డీఎండీకే సభ్యులు వ్యవహరించిన తీరును ఎత్తి చూపుతూ, అందుకు తగ్గ ఫొటో, వీడియో క్లిప్పింగ్‌లకు క్రమ శిక్షణా సంఘానికి పంపించామన్నారు. అదే సమయంలో వారిని సభ నుంచి ఈ సమావేశాలతో పాటుగా రానున్నమరో సమావేశాలకు సైతం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తుచేశారు. అయితే, ఆ నిర్ణయంలో స్వల్ప మార్పు చేస్తున్నామన్నారు. ఎవరి ఒత్తిడికో లేదా, మరెవ్వరి ఆగ్రహానికో తలొగ్గి తాను నిర్ణయంలో మార్పు చేయడం లేదన్న విషయాన్ని సభలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిగణించాలని సూచించారు. డీఎండీకే సభ్యులను కేవలం ఈ సమావేశాలకు మాత్రమే సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో తదుపరి సమావేశాలకు డీఎండీకే సభ్యులు సభకు హాజరు కావచ్చు. ఇప్పటికే నాలుగు రోజుల సభలో మూడు రోజులు ముగియడంతో ఇక వాళ్లు వస్తే, ఏమి రాకుంటే ఏమి అన్న పెదవి విప్పే వాళ్లే సభా మందిరం పరిసరాల్లో అధికం. మిగులు విద్యుత్ అసెంబ్లీలో మంత్రులతో పాటుగా సీఎం పన్నీరు సెల్వం ప్రసంగించారు. రవాణా మంత్రి సెంథిల్ బాలాజా ప్రసంగించే క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి చెన్నైకు యాభై ఏసీ బస్సుల్ని నడపబోతున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ మంత్రి అగ్రి కృష్ణమూర్తి ప్రసంగిస్తూ, బయోడీజిల్ పై ప్రయోగం వేగవంతం అయిందని, పరిశోధనలు పూర్తికాగానే, వాహనాలకు ఆ డీజిల్ వినియోగంపై చర్యలు చేపట్టనున్నామన్నారు. దేవాదాయ శాఖ ఇన్చార్జ్ మంత్రి కామరాజ్ ప్రసంగిస్తూ, నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఆరు వేల 972 ఆలయాల్ని పునరుద్ధరించి కుంభాభిషేకాలు నిర్వహించామని వివరించారు. సీఎం పన్నీరు సెల్వం ప్రసంగిస్తూ, రాష్ట్రంలో గాడ్సె విగ్రహాల ఏర్పాటుకు హిందూ మహా సభ చర్యలకు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో అలాంటి విగ్రహాలు ఎక్కడ ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదని, ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ను మరికొన్ని నెలల్లో చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తమ అమ్మ చేపట్టిన ముందస్తు ప్రయత్నాలు, ప్రాజెక్టులు ఫలాల్ని ఇస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో 22 వేల మెగావాట్ల విద్యుత్‌ను చూడబోతున్నామని, త్వరలో ఇది సాకారం కావడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 16 వేల మెగావాట్లు, ఇతర కేంద్రాల ద్వారా రెండు మూడు వేల మెగావాట్లు, బయటి నుంచి కొనుగోళ్ల ద్వారా మూడు వేల మూడు వందల మెగావాట్ల రూపంలో ఈ విద్యుత్ రాష్ట్రానికి దక్కనున్నదని వివరించారు. రోజుల తరబడి నిరవధిక దీక్షలో ఉన్న ఉద్యాన వన వర్సిటీ విద్యార్థుల దీక్షపై స్పందిస్తూ, వారితో చర్చలకు చర్యలు చేపట్టామన్నారు.