tamilnadu pocitics
-
విజయ్ రాజకీయాల్లో నేను జోక్యం చేసుకోను
తమిళ హీరో దళపతి విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు, సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ వల్ల మనోళ్లు ఇతడిని ఎప్పటికప్పుడు తలుచుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం 'గోట్' మూవీ చేస్తున్న విజయ్.. తర్వాత మరొకటి చేసి పూర్తిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ విషయమై ఇదివరకే క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు విజయ్ పొలిటికల్ కెరీర్‌పై ఇతడి తండ్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విట్టర్ రివ్యూ)విజయ్‌ని హీరోగా పరిచయం చేసింది ఇతడి తండ్రి, దర్శకుడు ఎస్ ఏ.చంద్రశేఖర్. ఈయనే కొడుకుని రాజకీయాల్లోకి కూడా తీసుకురావాలని అనుకున్నారు. ఇందులో భాగంగా విజయ్ పేరు మీద అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు, భారీ సమావేశాలు నిర్వహించారు. కానీ ఎందుకనో తండ్రి-కొడుకుల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చంద్రశేఖర్ విజయ్‌కి దూరమవుతూ వచ్చారు. అప్పుడే బుస్సీ ఆనంద్ అనే పాండిచ్చేరి శాసన సభ్యుడు.. అభిమాని పేరుతో విజయ్‌కి దగ్గరయ్యారు. ఇప్పుడు బుస్సీ ఆనంద్‌నే రాజకీయపరంగా విజయ్‌కు అన్నీ.కారణాలేమైనా చంద్రశేఖర్, ఆయన కొడుకు విజయ్ కలుసుకుని చాలా కాలమైందది. తల్లి శోభ మాత్రం విజయ్‌ని అప్పుడప్పుడు ఆయన్ని కలుస్తుంటారు. అలాంటిది చాలా కాలం తర్వాత విజయ్ తల్లిదండ్రులు ఆయన్ని కలిశారు. ఆ ఫొటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా విజయ్ తల్లిదండ్రులు కాంచీపురం వెళ్లి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు వీళ్లని విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించి అడిగారు. తమ కొడుకు రాజకీయాల్లోకి రావడం సంతోషమేనని చెప్పిన చంద్రశేఖర్.. తాను విజయ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని క్లారిటీ ఇచ్చేశారు. మరి దీనికి కారణం ఏంటనేది మాత్రం చెప్పలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
నో మోర్ పాలిటిక్స్: కుండబద్దలు కొట్టిన రజినీ
-
మళ్లీ రాజకీయాల్లోకి సూపర్‌స్టార్ రజనీకాంత్?
-
గోల్డెన్ బే రిసార్ట్ మూసివేత
చెన్న: గోల్డెన్ బే రిసార్ట్.. పది రోజుల క్రితం వరకు దీని గురించి చాలామంది తెలియదు. చెన్నైకు దాదాపు 80 కిలో మీటర్ల దూరంలో కువతూర్కు సమీపంలో ఈ రిసార్ట్ ఉంటుంది. శశికళపై పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక అన్నా డీఎంకేలో సంక్షోభం ఏర్పడటం, ఆ తర్వాత శశికళ వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పది రోజుల పాటు ఇక్కడ ఉంచాక గోల్డెన్ బే రిసార్ట్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. రోజూ వార్తల్లో నిలిచింది. పది రోజులగా అక్కడ మీడియా ప్రతినిధులు మకాం వేశారు. పోలీసులను భారీగా మోహరించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేలను విచారించి, వారి వాంగ్మూలం తీసుకున్నారు. ఎట్టకేలకు శనివారం ఉదయం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలను భారీ భద్రత మధ్య తీసుకెళ్లడంతో రిసార్ట్ ఖాళీ అయ్యింది. కాసేపటి తర్వాత గోల్డెన్ బే రిసార్ట్‌ను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. రిసార్ట్‌కు మరమ్మత్తులు చేయించాలని, దీని కారణంగా మూసివేస్తున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఈ రిసార్ట్‌లో ఉన్నప్పుడు వారిని కలిసేందుకు శశికళతో పాటు సీఎం పళనిస్వామి కూడా వెళ్లారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
నేను ఎవరికి ఫిర్యాదు చేయాలి: స్పీకర్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా సభ్యులు ప్రవర్తించిన తీరుపై స్పీకర్ ధనపాల్ అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేశారు. తన చొక్కా చింపి అవమానించారని, తనపై జరిగిన దానిపై ఎవరికి ఫిర్యాదు చేయాలని స్పీకర్ వ్యాఖ్యానించారు. రాజ్యంగబద్ధంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. తన నిర్ణయంపై ఇతరులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న డిమాండ్‌ను తిరస్కరించినందుకు డీఎంకే సభ్యులు స్పీకర్‌ను ఘొరావ్ చేశారు. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంటూ స్పీకర్‌పై కుర్చీలు, పేపర్లు విసిరేసి, ఆయన ముందున్న టేబుల్‌ను విరగొట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ డీఎంకే సభ్యులు బయటకు వెళ్లాలని ఆదేశించారు. సభలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
అసెంబ్లీలో పళని వర్సెస్ పన్నీరు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ రణరంగంగా మారింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలంటూ ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు సభలో రభస చేశారు. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు కూడా స్వరం కలిపారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత ఏర్పడటంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా వేశారు. తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పళనిస్వామి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు. ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంను కలవకుండా కట్టడి చేస్తున్నారు. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్కో మంత్రికి చొప్పున బాధ్యతలు అప్పగించారు. కాగా సభ మళ్లీ ప్రారంభమయ్యే లోపు పళనివర్గం ఎమ్మెల్యేల మనసు మార్చేందుకు డీఎంకే, పన్నీరు సెల్వం వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
పన్నీరు, స్టాలిన్లది ఒక్కటే డిమాండ్ కానీ..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం మధ్య బలపరీక్ష జరుగుతోంది. ప్రజాభిప్రాయం విన్న తర్వాతే ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్ ధనపాల్‌ను కోరారు. స్పీకర్ వీరి డిమాండ్‌ను తిరస్కరిస్తూ డివిజన్ వారీగా ఓటింగ్ నిర్వహించారు. అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్ రావు 15 రోజులు సమయం ఇచ్చారని, ఎందుకు హడావుడిగా ఓటింగ్ నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బలపరీక్షను మరోరోజుకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షని స్టాలిన్ చెప్పారు. సభలో పన్నీరు సెల్వం మాట్లాడుతూ.. కువతూర్‌లోని గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను ఉంచిన విషయం అందరికీ తెలుసునని, ప్రజాభిప్రాయం విన్న తర్వాతే ఓటింగ్ నిర్వహించాలని కోరారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన సభలో నిరసనకు దిగారు. స్పీకర్ రహస్య ఓటింగ్‌ను తిరస్కరించడంపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు డీఎంకే, పన్నీరు సెల్వం వర్గీయులు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కూడా రహస్య ఓటింగ్‌కు పట్టుపట్టాయి. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
పళని వర్గం ఎమ్మెల్యేలకు చేదు అనుభవం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. కాసేపట్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద రెండు వేలమంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనపు బలగాలు సిద్ధంగా ఉంచారు. పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలకు చేదు అనుభవం: ఈ రోజు ఉదయం గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయల్దేరిన పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. చెన్నైలో ఈసీఆర్ రోడ్డులో అన్నా డీఎంకే కార్యకర్తలు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. బలపరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నినాదాలు చేస్తూ, వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తరలించారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
చివర్లో పళనికి షాక్.. మరో ఎమ్మెల్యే జంప్
-
భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు
-
బలపరీక్షకు కరుణానిధి దూరం!
చెన్నై: తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ డీఎంకే చీఫ్ కరుణానిధి (92) కాసేపట్లో జరిగే బలపరీక్షకు దూరంగా ఉండనున్నట్టు సమాచారం. అనారోగ్యం కారణంగా కరుణ అసెంబ్లీకి రారని, బలపరీక్షలో పాల్గొనబోరని డీఎంకే వర్గాలు తెలిపాయి. ఇటీవల అస్వస్థతకు గురైన కరుణానిధి కొన్ని రోజులు చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. డీఎంకేకు మొత్తం 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కరుణ మినహా మిగతా 88 మంది ఎమ్మెల్యేలు.. బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారు. ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నాయకత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బలపరీక్షలో పాల్గొంటారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్
చెన్నై: అన్నా డీఎంకే రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఈ రోజు తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఎదుర్కొనే బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కాసేపట్లో బలపరీక్ష జరగనుండగా, పళనిస్వామి శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. అసెంబ్లీలో పళనిస్వామికి మద్దతుగా ఓటు వేయబోనని ఎమ్మెల్యే అరుణ్ కుమార్ ప్రకటించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గూటికి చేరారు. నిన్నరాత్రి వరకు పళనిస్వామి శిబిరంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అరుణ్ కుమార్ జంప్ కావడంతో ప్రస్తుతం 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షలో పళనిస్వామి నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పన్నీరు సెల్వం శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న కోయంబత్తూరు ఎమ్మెల్యే నటరాజన్ పన్నీరు సెల్వం వర్గంలో చేరారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు పళనిస్వామిని వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు రావడంతో ఈ రోజు బలపరీక్షలో ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. బలపరీక్షలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నాయి. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు
చెన్నై: కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు (శశికళ వర్గం) భారీ భద్రతతో అసెంబ్లీకి బయల్దేరారు. ఈ రోజు (శనివారం) తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కోనుండటంతో.. ఎమ్మెల్యేలను రిసార్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించారు. బలపరీక్షలో పళనిస్వామి నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పళనిస్వామి శిబిరంలో ప్రస్తుతం 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరిలో 20 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరగగా, పళనిస్వామి వారిని బుజ్జగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిన తర్వాత ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇక మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. అమ్మకు ఓటేయండి అంటూ బలపరీక్షలో పళనిస్వామిని ఓడించాల్సిందిగా ఎమ్మెల్యేలను కోరారు. ఆయన వర్గంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (89), కాంగ్రెస్ పార్టీలు (8) బలపరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఏం జరుగుతుందనే దానిపై తమిళనాడు పాటు దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు?