పళని వర్గం ఎమ్మెల్యేలకు చేదు అనుభవం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. కాసేపట్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద రెండు వేలమంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనపు బలగాలు సిద్ధంగా ఉంచారు.
పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలకు చేదు అనుభవం: ఈ రోజు ఉదయం గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయల్దేరిన పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. చెన్నైలో ఈసీఆర్ రోడ్డులో అన్నా డీఎంకే కార్యకర్తలు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. బలపరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నినాదాలు చేస్తూ, వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తరలించారు.
మరిన్ని తమిళనాడు విశేషాలు..
భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు
పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్
మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!
ఎవరీ సైనైడ్ మల్లిక!
పళనిస్వామిని ఓడించండి: రాహుల్
అమ్మకు ఓటేయండి
నన్ను చూసి నవ్వొద్దు
‘మ్యాజిక్’ చేసేదెవరు?