తమిళ హీరో దళపతి విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు, సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ వల్ల మనోళ్లు ఇతడిని ఎప్పటికప్పుడు తలుచుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం 'గోట్' మూవీ చేస్తున్న విజయ్.. తర్వాత మరొకటి చేసి పూర్తిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ విషయమై ఇదివరకే క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు విజయ్ పొలిటికల్ కెరీర్‌పై ఇతడి తండ్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విట్టర్ రివ్యూ)
విజయ్‌ని హీరోగా పరిచయం చేసింది ఇతడి తండ్రి, దర్శకుడు ఎస్ ఏ.చంద్రశేఖర్. ఈయనే కొడుకుని రాజకీయాల్లోకి కూడా తీసుకురావాలని అనుకున్నారు. ఇందులో భాగంగా విజయ్ పేరు మీద అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు, భారీ సమావేశాలు నిర్వహించారు. కానీ ఎందుకనో తండ్రి-కొడుకుల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చంద్రశేఖర్ విజయ్‌కి దూరమవుతూ వచ్చారు. అప్పుడే బుస్సీ ఆనంద్ అనే పాండిచ్చేరి శాసన సభ్యుడు.. అభిమాని పేరుతో విజయ్‌కి దగ్గరయ్యారు. ఇప్పుడు బుస్సీ ఆనంద్‌నే రాజకీయపరంగా విజయ్‌కు అన్నీ.
కారణాలేమైనా చంద్రశేఖర్, ఆయన కొడుకు విజయ్ కలుసుకుని చాలా కాలమైందది. తల్లి శోభ మాత్రం విజయ్‌ని అప్పుడప్పుడు ఆయన్ని కలుస్తుంటారు. అలాంటిది చాలా కాలం తర్వాత విజయ్ తల్లిదండ్రులు ఆయన్ని కలిశారు. ఆ ఫొటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా విజయ్ తల్లిదండ్రులు కాంచీపురం వెళ్లి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు వీళ్లని విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించి అడిగారు. తమ కొడుకు రాజకీయాల్లోకి రావడం సంతోషమేనని చెప్పిన చంద్రశేఖర్.. తాను విజయ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని క్లారిటీ ఇచ్చేశారు. మరి దీనికి కారణం ఏంటనేది మాత్రం చెప్పలేదు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
Comments
Please login to add a commentAdd a comment