అసెంబ్లీలో పళని వర్సెస్ పన్నీరు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ రణరంగంగా మారింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలంటూ ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు సభలో రభస చేశారు. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు కూడా స్వరం కలిపారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత ఏర్పడటంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా వేశారు.
తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పళనిస్వామి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు. ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంను కలవకుండా కట్టడి చేస్తున్నారు. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్కో మంత్రికి చొప్పున బాధ్యతలు అప్పగించారు. కాగా సభ మళ్లీ ప్రారంభమయ్యే లోపు పళనివర్గం ఎమ్మెల్యేల మనసు మార్చేందుకు డీఎంకే, పన్నీరు సెల్వం వర్గీయులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని తమిళనాడు విశేషాలు..
భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు
పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్
మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!
ఎవరీ సైనైడ్ మల్లిక!
పళనిస్వామిని ఓడించండి: రాహుల్
అమ్మకు ఓటేయండి
నన్ను చూసి నవ్వొద్దు
‘మ్యాజిక్’ చేసేదెవరు?