గోల్డెన్ బే రిసార్ట్ మూసివేత
చెన్న: గోల్డెన్ బే రిసార్ట్.. పది రోజుల క్రితం వరకు దీని గురించి చాలామంది తెలియదు. చెన్నైకు దాదాపు 80 కిలో మీటర్ల దూరంలో కువతూర్‌కు సమీపంలో ఈ రిసార్ట్ ఉంటుంది. శశికళపై పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక అన్నా డీఎంకేలో సంక్షోభం ఏర్పడటం, ఆ తర్వాత శశికళ వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పది రోజుల పాటు ఇక్కడ ఉంచాక గోల్డెన్ బే రిసార్ట్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. రోజూ వార్తల్లో నిలిచింది. పది రోజులగా అక్కడ మీడియా ప్రతినిధులు మకాం వేశారు. పోలీసులను భారీగా మోహరించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేలను విచారించి, వారి వాంగ్మూలం తీసుకున్నారు.
ఎట్టకేలకు శనివారం ఉదయం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలను భారీ భద్రత మధ్య తీసుకెళ్లడంతో రిసార్ట్ ఖాళీ అయ్యింది. కాసేపటి తర్వాత గోల్డెన్ బే రిసార్ట్‌ను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. రిసార్ట్‌కు మరమ్మత్తులు చేయించాలని, దీని కారణంగా మూసివేస్తున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఈ రిసార్ట్‌లో ఉన్నప్పుడు వారిని కలిసేందుకు శశికళతో పాటు సీఎం పళనిస్వామి కూడా వెళ్లారు.
మరిన్ని తమిళనాడు విశేషాలు..
భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు
పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్
మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!
ఎవరీ సైనైడ్ మల్లిక!
పళనిస్వామిని ఓడించండి: రాహుల్
అమ్మకు ఓటేయండి
నన్ను చూసి నవ్వొద్దు
‘మ్యాజిక్’ చేసేదెవరు?