golden bay resort
-
శపథం చేసిన శశికళ పంతం నెగ్గింది
-
శశికళ ఎఫెక్ట్ : గోల్డెన్ బే రిసార్ట్ ఢమాల్
-
శశికళ ప్లాన్ గ్రాండ్ సక్సెస్!
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడింది. విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. మొత్తంగా 133 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనగా, పళనికి అనూకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 11 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. దీంతో మెజార్టీ ఓట్లు సాధించిన పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో పళని విజయం నల్లేరుపై నడకగా మారింది. రిసార్ట్ రాజకీయాలు నెగ్గాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పది రోజుల కిందటి వరకూ ఎవరికీ తెలియని కువతూర్కు సమీపంలోని గోల్డెడ్ బే రిసార్టులో చిన్నమ్మ శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను అక్కడ నిర్బంధించారని కథనాలు వచ్చాయి. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలను తనవైపు ఎక్కడ లాగేసుకుంటారోనని శశికళ చేసిన ప్రయత్నం నేడు ఫలించింది. అయితే ఆ ప్రయోజనాన్ని మాత్రం పళనిస్వామి పొందనున్నారు. సుప్రీంకోర్టు శశికళను దోషీగా తీర్పివ్వడంతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు కోర్టులో లొంగిపోయి అక్కడే మరో మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ ఆశలు గల్లంతు కాగా.. అమ్మ జయలలితకు, తనకు విధేయుడైన పళనిస్వామిని గోల్డెన్ బే రిసార్ట్ లోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వానికి మద్ధతు ఇవ్వకుండా చేయడంలోనూ శశికళ పన్నిన గోల్డెన్ బే రిసార్ట్ క్యాంపు వ్యూహం సక్సెస్ అయింది. అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు తనకే మద్ధతు ఇవ్వాలని కోరుతూ రిసార్టులో శశికళ చేసిన ప్రసంగాలు వారిని ఐకమత్యంగా ఉంచాయనడంలో సందేహమే అక్కర్లేదు. గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి కలుసుకోవడం.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు ఉందని వివరించడం.. ఆపై పళనితో గవర్నర్ ప్రమాణం చేయించడం చకచకా జరిగిపోయాయి. నేడు తమిళనాడు అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. ఈ ఓటింగ్ లో పాల్గొన్న వారిలో శశికళ క్యాంపులోని రిసార్ట్ ఎమ్మెల్యేల ఓటింగే పళనిస్వామి సీఎం పీఠాన్ని అందించింది. పన్నీర్ క్యాంపులోని ఆరుగురు ఎమ్మెల్యేలు సహా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేశారు. దాదాపు వారం రోజులపాటు గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలలో 122 మంది ఆయనకు మద్ధతు తెలుపుతూ ఓటేయడంతో మెజార్టీ సాధించి చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామి.. జయ వీర విధేయుడు పన్నీర్ సెల్వంపై మరోసారి విజయం సాధించారు. -
గోల్డెన్ బే రిసార్ట్ మూసివేత
చెన్న: గోల్డెన్ బే రిసార్ట్.. పది రోజుల క్రితం వరకు దీని గురించి చాలామంది తెలియదు. చెన్నైకు దాదాపు 80 కిలో మీటర్ల దూరంలో కువతూర్కు సమీపంలో ఈ రిసార్ట్ ఉంటుంది. శశికళపై పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక అన్నా డీఎంకేలో సంక్షోభం ఏర్పడటం, ఆ తర్వాత శశికళ వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పది రోజుల పాటు ఇక్కడ ఉంచాక గోల్డెన్ బే రిసార్ట్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. రోజూ వార్తల్లో నిలిచింది. పది రోజులగా అక్కడ మీడియా ప్రతినిధులు మకాం వేశారు. పోలీసులను భారీగా మోహరించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేలను విచారించి, వారి వాంగ్మూలం తీసుకున్నారు. ఎట్టకేలకు శనివారం ఉదయం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలను భారీ భద్రత మధ్య తీసుకెళ్లడంతో రిసార్ట్ ఖాళీ అయ్యింది. కాసేపటి తర్వాత గోల్డెన్ బే రిసార్ట్‌ను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. రిసార్ట్‌కు మరమ్మత్తులు చేయించాలని, దీని కారణంగా మూసివేస్తున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఈ రిసార్ట్‌లో ఉన్నప్పుడు వారిని కలిసేందుకు శశికళతో పాటు సీఎం పళనిస్వామి కూడా వెళ్లారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు
చెన్నై: కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు (శశికళ వర్గం) భారీ భద్రతతో అసెంబ్లీకి బయల్దేరారు. ఈ రోజు (శనివారం) తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కోనుండటంతో.. ఎమ్మెల్యేలను రిసార్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించారు. బలపరీక్షలో పళనిస్వామి నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పళనిస్వామి శిబిరంలో ప్రస్తుతం 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరిలో 20 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరగగా, పళనిస్వామి వారిని బుజ్జగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిన తర్వాత ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇక మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. అమ్మకు ఓటేయండి అంటూ బలపరీక్షలో పళనిస్వామిని ఓడించాల్సిందిగా ఎమ్మెల్యేలను కోరారు. ఆయన వర్గంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (89), కాంగ్రెస్ పార్టీలు (8) బలపరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఏం జరుగుతుందనే దానిపై తమిళనాడు పాటు దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
రిసార్ట్‌లో శశకళ వర్గీయుల సంబరాలు
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించడంతో శశికళ శిబిరం కళకళలాడుతోంది. గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నా డీఎంకే చీఫ్ శశికళకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరినా గవర్నర్ వేచిచూడటం, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పన్నీరు సెల్వం వర్గంలోకి చేరుతుండటం, ఇంతలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడటం, బెంగళూరు పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లడంతో ఆమె వర్గీయులు ఢీలాపడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ గవర్నర్.. పళనిస్వామిని ఆహ్వానించడంతో శశికళ వర్గీయులకు కొండంత ధైర్యం వచ్చినట్టయ్యింది. కాగా పళనిస్వామి అప్పుడే సీఎం అయినట్టు కాదని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు లేదని పన్నీరు సెల్వం వర్గీయులు చెబుతున్నారు. మొత్తానికి ఎవరిబలమెంత అన్నది అసెంబ్లీలో బలపరీక్షలో తేలనుంది. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి.. పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! ఎవరీ పళనిస్వామి..? ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశం! గవర్నర్‌తో పళనిస్వామి భేటీ పళనిస్వామికే మెజార్టీ ఉంది... పళనిస్వామే ఎందుకు! తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
శశికళ ఎఫెక్ట్ : గోల్డెన్ బే రిసార్ట్ ఢమాల్
చెన్నై : శశికళ ఎఫెక్ట్ గోల్డెన్ బే రిసార్ట్‌కు భారీగా తగులుతోంది. ఒక్కసారిగా తన పేరు ప్రతిష్టలన్నీ భారీగా కోల్పోతుంది. గూగుల్ రేటింగ్స్ అన్నీ తలకిందులుగా వస్తున్నాయి. శశికళ లాంటి రాజకీయ నాయకులకు సురక్షిత ప్రాంతంగా ఈ రిసార్ట్ మారడంతో దీనికి ఈ పరిస్థితి ఏర్పడింది. కనీసం ఈ రిసార్ట్ లో భద్రత ఉండదు, అక్కడ పొలికల్ మాఫీయా గ్రూప్ ఉందంటూ గూగుల్ రివ్యూలో నెటిజన్లు పేర్కొంటున్నారు. క్రిమినాల్స్ అక్కడ ఈజీగా లోపలికి రావడానికి, బయటికి వెళ్లడానికి వీలుందంటూ మరో నెటిజన్ చెప్పారు. హోటల్ మేనేజ్మెంట్ కూడా అక్కడ అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ చెబుతున్నారు. మొత్తం అక్కడ థర్డ్ క్లాస్ రౌడీలే ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లొదంటూ సూచిస్తున్నారు. మాఫియా గ్రూప్ ఉంటున్న ఈ ప్రాంతం పర్యాటకులకు ఎలా సురక్షితమో చెప్పడని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు కూడా ఈ రిసార్ట్‌పై మండిపడుతున్నారు. దీని ఫలితంగా గూగుల్ లో రిసార్ట్‌కు వస్తున్న రేటింగ్స్ చాలా ప్రతికూలంగా వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గోల్డెన్ బే రిసార్ట్ వద్ద జరుగుతున్న హైడ్రామా మనకు తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని ఎత్తులకు పై ఎత్తులు వేసిన శశికళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందర్ని అక్కడ దాచిపెట్టారు. కనీసం వారికి మొబైల్ ట్రాకింగ్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా చేశారు. రిసార్ట్ చుట్టూ శశికళ వర్గం మన్నార్ గుడి మాఫియాను దించారు. ఎమ్మెల్యేలను దాచడానికి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతంగా శశికళ భావించడంతో గోల్డెన్ బే రిసార్ట్ ఒక్కసారిగా పొలికల్ మాఫియాగా మారిపోయింది. గోల్డెన్ బే రిసార్ట్ ఇలా మారడంతో చాలా చెత్త రిసార్ట్‌గా పేరొందుతోంది. -
ఎమ్మెల్యేలూ.. వెంటనే రిసార్ట్ ఖాళీ చేయండి
-
ఎమ్మెల్యేలూ.. వెంటనే రిసార్ట్ ఖాళీ చేయండి
చెన్నై: అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బసచేసిన కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. రిసార్ట్‌ను వెంటనే ఖాళీ చేయాలని ఎమ్మెల్యేలకు పోలీసులు సూచించారు. శశికళ, పళనిస్వామి తనను కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే శరవణన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గోల్డెన్ బే రిసార్ట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాంచీపురం ఎస్పీ రిసార్ట్ వద్దకు చేరుకుని విచారిస్తున్నారు. ఎమ్మెల్యేలు వెంటనే రిసార్ట్‌ను ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు. శశికళ వర్గం ఎమ్మెల్యేలతో కలసి శరవణన్ నిన్నటివరకు రిసార్ట్‌లో ఉన్నారు. ఆయన రిసార్ట్ నుంచి తప్పించుకుని వచ్చి తనను శశికళ, అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామి కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శశికళ, పళనిస్వామిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా
-
గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా
చెన్నై: శశికళ, ఆమె వర్గం ఎమ్మెల్యేలు ఉన్న కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిస్టార్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో.. సంబరాలు చేసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మద్దతుదారులు రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకువచ్చేందుకు వెళ్లారు. సెల్వం వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభిమానులు ర్యాలీగా గోల్డెన్ బే రిస్టార్కు వెళ్లారు. రిసార్ట్ బయటే సెల్వం మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. రిసార్ట్‌లో శశికళతో పాటు ఆమె వర్గం ఎమ్మెల్యేలు, అన్నా డీఎంకే పార్టీ నేతలు ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లు జైలు శిక్ష పడిన నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చిస్తున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో పళనిస్వామిని ఎన్నుకున్నారు. రిసార్ట్ బయట పన్నీరు సెల్వం వర్గీయులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేయగా.. లోపల ఉన్న ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలిపెట్టి వెళ్లబోమని చెబుతున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రిసార్ట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు. పన్నీరు సెల్వం వర్గీయులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు
చెన్నై : శశికళ సీఎం పదవి ఆశలను అడియాసలు చేస్తూ సుప్రీంకోర్టు ఆమెను ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించింది. తీర్పు వెలువడిన వెంటనే ఎమ్మెల్యేలున్న గోల్డెన్ బే రిసార్ట్‌లోకి కమాండోలు వెళ్లారు. రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను బయటికి తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటు చేసిన అనంతరం నుంచి గత వారం రోజులుగా ఎమ్మెల్యేలందర్ని శశికళ గోల్డెన్ బే రిసార్ట్‌లోనే ఉంచారు. వారిని ఎవరితో కలవనియ్యకుండా, వారి ఫోన్లను కూడా తీసేసుకున్నారు. శశికళ వర్గంపై అసంతృప్తి ఏర్పడినా కొందరు ఎమ్మెల్యేలను ఆమెనే స్వయంగా వెళ్లి బుచ్చగించారు. చాలామంది ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి బయటికి వచ్చేయాలని భావించిన వారిని అక్కడే నిర్భందంగా వచ్చినట్టు తెలిసింది. సుప్రీం తీర్పు నేడు వెలువడనున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి ఆమె కూడా గోల్డెన్ బే రిసార్ట్‌లోనే ఉన్నారు. తీర్పు తనకు అనుకూలంగా వస్తే, అక్కడి నుంచి విజయోత్సవ క్యాంప్ కూడా చేయాలని శశికళ ప్లాన్ చేశారు. అయితే ఆమె ఆశలపై సుప్రీం నీళ్లు చల్లింది. 1990లో ఆదాయానికి మించిన ఆస్తులను శశికళ కలిగి ఉందని ఆమెను దోషిగా నిర్ధారించింది. మరోవైపు నేడు సుప్రీం తీర్పు నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశముందని చెన్నై వ్యాప్తంగా 15వేల మంది పోలీసులను భద్రతకు దించారు. వీరిని గోల్డెన్ బే రిసార్ట్ సమీపంలో, రాష్ట్ర సచివాలయం, పోయెస్ గార్డు సమీపంలో భద్రతా ఏర్పాట్లను వారు పర్యవేక్షిస్తున్నారు. తీర్పు అనంతరం గోల్డెన్ బే రిసార్ట్‌లో భారీగా పోలీసులు మోహరించారు. వెంటనే లొంగిపోవాలని తీర్పు వెలువరిచిన నేపథ్యంలో శశికళను మరికొద్దిసేపట్లో అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. -
ఈ రాత్రికి గోల్డెన్ బే రిసార్ట్‌లో చిన్నమ్మ బస
చెన్నై: తమిళనాడు రాజకీయం వేడేక్కింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నా డీఎంకే చీఫ్ శశికళ, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అసెంబ్లీని సమావేశపరిచి, మెజార్టీ ఉన్న వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు భారత అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇవ్వగా.. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేపు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠగా మారింది. శశికళ మరోసారి కువతూరు సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ రోజు రాత్రికి ఆమె అక్కడే బస చేయనున్నారు. మూడు రోజుల్లో ఆమె ఎమ్మెల్యేలను కలవడమిది మూడోసారి. తాజా రాజకీయ పరిస్థితులపై శశికళ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. అన్నా డీఎంకేలో ప్రస్తుత సంక్షోభానికి డీఎంకేనే కారణమని నిందించారు. ఎంజీఆర్ మరణించినపుడు కూడా డీఎంకే ఇలాగే వ్యవహరించిందని చెప్పారు. ఈ సందర్భంగా శశికళ జయలలితను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అమ్మ ఇప్పటికీ మన గుండెల్లో ఉందని అన్నారు. తాను రిసార్ట్‌కు వచ్చే దారిలో కొందరు తనను ఓ గుడిసెలోకి ఆహ్వానించారని, లోపలకు వెళ్లి చూడగా అమ్మ ఫొటో కనిపించిందని, ప్రజల గుండెల్లో అమ్మ జీవిస్తున్నారని చెప్పారు. తమకు ఇపుడు సవాళ్లు ఎదురయ్యానని, అందరం కలసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. ఇదే రోజు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యలయంలో సీనియర్ నేతలతో సమావేశమై తాజా పరిణామాలను చర్చించారు. అన్నా డీఎంకే తమ ప్రత్యర్థి పార్టీ అని, పన్నీరు సెల్వంకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. గవర్నర్ వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, మెజార్టీ ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని స్టాలిన్ చెప్పారు. ఇక చేరికలు, మద్దతు దారులతో ఉత్సాహంగా ఉన్న పన్నీరు సెల్వం శిబిరం ఈ రోజు కాస్త ఢీలాపడింది. సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
గోల్డెన్ బే రిసార్ట్‌లో శశికళ కంటతడి
-
గోల్డెన్ బే రిసార్ట్‌లో శశికళ కంటతడి
చెన్నై: ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకువచ్చి నిర్బంధించలేదని, అందరూ ఓ కుటుంబంలా ఉంటున్నారని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చెప్పారు. కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ క్యాంపులో ఉంటున్న ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ ఎవరినీ బంధించలేదని, మీరు వాస్తవాన్ని చూడవచ్చని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి శశికళ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే వదంతులను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలందరూ తమ కుటుంబమని అన్నారు. కొందరు తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం కోసం మరో రోజు ఎదురు చూస్తామని చెప్పారు. గవర్నర్ నుంచి ఆహ్వానం రాకపోతే నిరసన తెలియజేస్తారా అన్న ప్రశ్నకు తదుపరి అడుగేంటో వేచి చూడండని చెప్పారు. పన్నీరు సెల్వం వర్గీయులు పార్టీని చీల్చేందుకు కుట్ర పనుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలందరూ కలసికట్టుగా ఉండాలని సూచించారు. సమావేశంలో మాట్లాడుతూ ఓ దశలో ఆమె కంటతడి పెట్టారు. శశికళ ఇంకా ఏం మాట్లాడారంటే.. మన పార్టీని, ప్రభుత్వాన్ని ఎవ్వరూ కదపలేరు కొన్నేళ్లుగా మంత్రిగా పనిచేసిన పన్నీరు సెల్వం.. ఈ సంక్షోభానికి కారణం మన వేలితో మన కళ్లనే పొడుస్తున్నారు కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత అమ్మ సమాధి వద్ద ఫొటో దిగి ప్రపంచానికి చూపిస్తాం అసెంబ్లీలో అమ్మ చిత్రపటాన్ని ఏర్పాటు చేద్దాం కొందరు ఇది జరగకుండా అడ్డుపడుతున్నారు అమ్మ నాతో ఉన్నంత వరకూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు నాకు 129 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది విజయం సాధించాక అమ్మకు అంకితం ఇద్దాం డీఎంకే కుట్రలను గెలిపించవద్దు నేను మహిళను కాబట్టి భయపెట్టాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవు తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ! శశి నుంచి మా మంత్రిని కాపాడండి! అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు! నేడు శశికళ భారీ స్కెచ్? శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్! చెన్నైలో హై టెన్షన్ పన్నీర్ మైండ్ గేమ్ షురూ.. దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి -
ఎమ్మెల్యేలతో మరోసారి చిన్నమ్మ మంతనాలు
-
ఎమ్మెల్యేలతో మరోసారి చిన్నమ్మ మంతనాలు
చెన్నై: అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మరోసారి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆదివారం చెన్నై నుంచి కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు. గోల్డెన్ బే రిసార్ట్ క్యాంపులో ఉంటున్న ఎమ్మెల్యేలతో శశికళ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడం, కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శిబిరంవైపు పార్టీ నేతలు వెళ్తుండటం వంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించినట్టు సమాచారం. శశికళ నిన్న (శనివారం) కూడా గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లి ఎమ్మెల్యేలతో చర్చించిన విషయం తెలిసిందే. నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ జాప్యం చేస్తుండటం, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేజారి పోతుండటంపై శశికళ వర్గం ఆందోళన చెందుతోంది. శశికళ ఎమ్మెల్యేలతో కలసి వెళ్లి రాజ్‌భవన్ ఎదుట పరేడ్ నిర్వహించనున్నట్టు వార్తలు వచ్చాయి. తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ! శశి నుంచి మా మంత్రిని కాపాడండి! అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు! నేడు శశికళ భారీ స్కెచ్? శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్! చెన్నైలో హై టెన్షన్ పన్నీర్ మైండ్ గేమ్ షురూ.. దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి -
శశికళపై స్థానికులు తీవ్ర మండిపాటు
చెన్నై : అమ్మ తర్వాత అమ్మగా, తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనుకున్న చిన్నమ్మ శశికళకు ఊహించని షాకులెదురవుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అనూహ్యంగా మద్దతు పెరగడంతో పాటు, ఆమెపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికారిక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్ వైపు దారులన్నింటిల్లో ఆంక్షలు విధించడంపై అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ ఉన్న గ్రామ దారులన్నింటిన్నీ బ్లాక్ చేస్తున్నారు. అంతేకాక రాత్రిపూట రాజకీయ తతంగమంతా నడపాలనుకుంటున్న శశికళ వర్గం చీకటిపడ్డాక ఆ దారుల్లో వెలుతురు కూడా ఉండకుండా ఉండేందుకు లైట్స్ అన్నీ స్విచ్చాఫ్ చేస్తున్నారు. మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అతి బలవంతం మీద అక్కడ ఉన్నారని తెలుస్తోంది. వారు శశికళపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వారిని బుజ్జగించడానికి శశికళ ఆ రిసార్ట్‌కు వెళ్లి మరీ ఎమ్మెల్యేలను కలిశారు. తన మెజార్జీని నిరూపించుకోవడానికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా ఆమె కోరారు. అయితే ఇప్పటి వరకు గవర్నర్ శశికళకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. గవర్నర్ కనుక అపాయింట్మెంట్ నిరాకరిస్తే జయ సమాధి వద్ద దీక్షకు దిగేందుకు కూడా శశికళ సిద్ధమవుతున్నారు. -
ఎమ్మెల్యేలకు శశికళ ఉద్వేగభరిత విజ్ఞప్తి!
-
ఎమ్మెల్యేలకు శశికళ ఉద్వేగభరిత విజ్ఞప్తి!
చెన్నై: ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పన్నీర్ సెల్వం వర్గం. ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు. మరోవైపు సహకరించిన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్. అయినా తన మాట నెగ్గించుకోవాలన్న పంతం. తాను ముఖ్యమంత్రి అయి తీరాలన్న పట్టుదల.. ఈ పరిణామాల అన్నింటి నడుమ చిన్నమ్మ శశికళ శనివారం గోల్డెన్ బే రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వారితో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్యేలను నిర్బంధించి తనవైపు తిప్పుకుంటానన్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. ఎమ్మెల్యేల నిర్బంధం ఆరోపణలు అవాస్తవనమి పేర్కొన్నారు. ఈ రిసార్ట్‌లో తనకు మద్దతుగా ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాన్ని శశికళ నడుపుతున్న సంగతి తెలిసిందే. గోల్డెన్ బే రిసార్ట్‌లో దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 20 మంది ఎదురుతిరిగారని, వారు ఏక్షణమైనా పన్నీర్ సెల్వం గూటిలో చేరేందుకుసిద్ధంగా ఉన్నారని కథనాలు గుప్పమంటున్న నేపథ్యంలో శశికళ ఇక్కడికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ చాలామంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారన్న వార్తలను ఖండించడానికి అన్నట్టు.. రిసార్ట్‌లో శశికళ, ఎమ్మెల్యేలతో కలిసిన ఫొటోలను విడుదల చేశారు. ఇక్కడి నుంచి నేరుగా చిన్నమ్మ జయలలిత సమాధి వద్దకు వెళుతారని, సమాధి వద్ద అమ్మకు నివాళులర్పించనున్నారని సమాచారం. -
ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. రంగంలోకి శశి!
చెన్నై: అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న గోల్డెన్ బే రిసార్ట్ వేదికగా తమిళనాడు రాజకీయాలు సాగుతున్నాయి. ఈ రిసార్ట్‌లో తనిఖీ చేసిన అధికారులు.. ఇక్కడ కేవలం 90మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు తేల్చారు. ఈ 90 మందిలోనూ 20 మంది ఎమ్మెల్యేలు శశికళకు ఎదురుతిరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ.. ఈ అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు నేరుగా రంగంలోకి దిగారు. ముగ్గురు మంత్రులను వెంటపెట్టుకొని పోయెస్ గార్డెన్ నుంచి బయలుదేరిన చిన్నమ్మ రిసార్ట్‌కు చేరుకున్నారు. తనకు అండగా ఉన్న ఎమ్మెల్యేలతోపాటు, అసంతృప్త నేతలతో కూడా ఆమె భేటీ అయ్యారు. ఎదురుతిరిగిన 20 మంది ఎమ్మెల్యేలను ప్రధానంగా బుజ్జగించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తామంటూ మొండికేస్తున్న ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు శశికళ ఇక్కడికి వచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రిసార్ట్ నుంచి ఆమె ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లాలని భావిస్తున్నారని, అక్కడ ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని కల్పించాలని గవర్నర్‌ను కోరనున్నారని సమాచారం. తనకు ప్రజా వ్యతిరేకత, పన్నీర్ సెల్వానికి పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో మధ్యేమార్గంగా సీఎం అభ్యర్థిగా కొత్త పేరు శశివర్గం తెరపైకి తేవొచ్చునని, నిన్న అన్నాడీఎంకే ప్రీసిడియం చైర్మన్‌గా ఎన్నికైన సెంగొట్టాయన్‌ను సీఎంగా ముందుకు తెచ్చే అవకాశముందని వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు ప్రస్తుతం హోరాహోరీగా తలపడుతున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు ఇద్దరు ఎత్తులు, పైఎత్తులు వేస్తుండటంతో తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. -
ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. రంగంలోకి శశి!
-
రిసార్ట్ కు వెళుతున్న శశి.. క్షణక్షణం ఉత్కంఠ!
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, జయ వీర విధేయుడు పన్నీర్ సెల్వం మధ్య సీఎం కుర్చీ కోసం పోరు ఇంకా కొనసాగుతోంది. సీఎం పీఠం కోసం శశికళ 90కి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో ఉన్న గోల్డెన్ బే రిసార్టుకు తరలించి సకల సౌకర్యాలు కల్పిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు, రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను నేటి సాయంత్రం శశికళ కలుసుకోనున్నట్లు సమాచారం. దీంతో పార్టీ నేతల్లో, రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రిసార్ట్ ప్రాంతానికి వెళ్లే ముందు చెన్నై మెరీనా బీచ్ లో జయ సమాధిని శశికళ సందర్శించనున్నారు. మెరీనా బీచ్ నుంచి నేరుగా తాను ఎమ్మెల్యేలను తరలించి ఉంచిన రిసార్ట్ వద్దకు వెళ్లనున్నారు. రిసార్టులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో నేరుగా భేటీలో పాల్గొని.. వారికి తాను ఏం చేయనున్నారో, ఎలాంటి ప్రయోజనాలు కల్పించనున్నారో వివరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా సెల్వం వర్గంలో చేరుతుండటం ఆమె ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఈ తరుణంలో సీక్రెట్ రిసార్టుకు వెళ్లి పార్టీ ఎమ్మెల్యేలను తనకే మద్ధతు తెలపాలని మరోమారు కోరనున్నారు. రిసార్ట్ ప్రాంతానికి ఎమ్మెల్యేలకు అవసరమైన నూతన దుస్తులు, ఇతరత్రా సామాగ్రి పంపినట్లు సమాచారం. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయాన్ని తెలపక పోవడంతో శశికళ కష్టాలు మరింత పెరిగిపోతున్నాయి. తన కనుసన్నల్లో నడుచుకుంటున్న నేతలు పన్నీర్ వర్గంలో చేరకుండా ఉండాలంటే నేరుగా వెళ్లి వారితో చర్చించాలని శశికళ భావిస్తున్నారు. తమిళ రాజకీయాలకు సంబంధించి మరిన్ని కీలక కథనాలు: తెరపైకి కొత్త సీఎం.. శశి వర్గం ట్విస్ట్! శరీరాలు రిసార్టులో.. మనస్సు సెల్వంపై! శశికళపై విజయశాంతి కామెంట్! గవర్నర్‌కు శశికళ మరో లేఖ -
రిసార్టులో ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్న పోలీసులు
శశికళ - పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న కుర్చీలాటలో భాగంగా రిసార్టులో దాచిపెట్టిన ఎమ్మెల్యేల వద్దకు పోలీసులు ఎట్టకేలకు చేరుకున్నారు. మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో గల రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. సుమారు 120 మంది వరకు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్లు సమాచారం రావడంతో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు శనివారం ఉదయం అక్కడకు భారీ పోలీసు బలగాలతో వెళ్లిన విషయం తెలిసిందే. అదనపు డీఎస్పీ తమిళ్ సెల్వన్, డీఆర్వో రామచంద్రన్‌ల నేతృత్వంలోని అధికారుల బృందం ఉదయం 6.30 గంటలకే అక్కడకు చేరుకుని ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడటం మొదలుపెట్టింది. రిసార్టుకు వాళ్లంతట వాళ్లే వచ్చారా లేక ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చి అక్కడ ఉంచారా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా చెప్పాలని కూడా పోలీసులు అడుగుతున్నారు. ఎమ్మెల్యేలను నిజంగానే నిర్బంధిస్తే అది చాలా పెద్ద నేరం అవుతుందని మద్రాస్ హైకోర్టు మండిపడింది. సోమవారానికల్లా ఎమ్మెల్యేల విషయంపై తమకు స్పష్టత ఇవ్వాలని చెప్పింది. దాంతో పోలీసులు చురుగ్గా కదిలారు. అక్కడకు వెళ్లిన పోలీసులు, మీడియా ప్రతినిధులపై స్థానికులు, రిసార్టుల వద్ద ఉన్న ప్రైవేటు గార్డులు రాళ్లతో దాడులు చేశారు. కొంతమంది బౌన్సర్లను కూడా అక్కడ పెట్టి మరీ ఎమ్మెల్యేలను బయటకు కదలకుండా ఆపుతున్నట్లు కథనాలు వచ్చాయి. సంబంధిత వార్తలు చదవండి అమ్మ స్నేహితుల మద్దతు ఎవరికంటే.. సెల్వంకు మద్దతు.. చిన్నమ్మకు ఆందోళన గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పోయెస్ గార్డెన్ వెలవెల పన్నీర్‌కే 95 శాతం మద్దతు! గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం -
ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు
-
ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏమైపోయారని.. నిజంగా వాళ్లు బందీలుగానే ఉన్నారా, ఎక్కడున్నా సోమవారానికల్లా అందరినీ తీసుకురావాలంటూ తమిళనాడు డీజీపీ టీకే రాజేంద్రన్‌ను మద్రాస్ హైకోర్టు సీరియస్‌గా ఆదేశించింది. ఎమ్మెల్యేలు బందీలు కావడంపై ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. దాంతో క్యాంపు రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడెక్కాయి. మహాబలిపురం గోల్డెన్ బే రిసార్టులలో ఉన్న ఎమ్మెల్యేలను తప్పనిసరిగా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఇదే పరిస్థితిపై గవర్నర్ విద్యాసాగర్ రావుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ టీకే రాజేంద్రన్ సమావేశమయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నిర్బంధం ఆరోపణలపై చర్చించారు. రాష్ట్రంలోని పరిస్థితులను సీఎస్, డీజీపీలు గవర్నర్‌కు వివరించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న క్యాంపు వద్దకు డీజీపీ స్వయంగా వెళ్లాలని నిర్ణయించారు. ఎక్కడా రిసార్టు.. ఎమ్మెల్యేలను నిర్బంధించినట్లు చెబుతున్న రిసార్టు ఒకరకంగా చెప్పాలంటే దుర్భేద్యమైనది. సముద్ర తీరానికి కిలోమీటరు దూరంలో సముద్రంలో ఒక చిన్న ద్వీపంలో ఈ రిసార్టు ఉంటుంది. దానికి చేరుకోవాలంటే తప్పనిసరిగా పడవల్లో వెళ్లాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అక్కడినుంచి తప్పించుకోవాలన్నా సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేల మానసిక స్థితి ఎలా ఉందోనని వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల ఫోన్లు లాక్కున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'సాక్షి' ప్రతినిధులు మంత్రి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే విజయకుమార్ తదితరులకు ఫోన్లు చేసే ప్రయత్నం చేసినప్పుడు స్విచాఫ్ అని వచ్చింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్లు కలిశాయి గానీ .. అప్పుడు వాళ్లు చాలా ఆందోళనకరమైన స్వరంతో మాట్లాడారు. రిసార్టులకు తాము ఇష్టపూర్వకంగా వెళ్లామా లేదా ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లడానికి వీల్లేకుండా తంజావూరు నుంచి వచ్చిన రౌడీ మూకలు కాపలా ఉన్నాయి. దాంతో మీడియా కూడా అక్కడకు వెళ్లే ధైర్యం చేయలేకపోతోంది. సుప్రీంలో శశికి ఊరట మరోవైపు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది అంత అత్యవసరమైనది కాదని, అందువల్ల సాధారణ పద్ధతిలోనే ఈనెల 17న దాన్ని విచారిస్తామని తెలిపింది. దాంతో శశికళకు ప్రమాణస్వీకారం అవకాశాలు కాస్త పెరిగినట్లయ్యాయి. సంబంధిత కథనాలు చదవండి.. శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు!