ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకువచ్చి నిర్బంధించలేదని, అందరూ ఓ కుటుంబంలా ఉంటున్నారని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చెప్పారు. కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ క్యాంపులో ఉంటున్న ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.